Hyundai Launches Year End Special Discounts Upto Rs 50000 - Sakshi
Sakshi News home page

Hyundai Dec 2021 Offers: కొత్త కారు కొనే వారికి బంపర్ ఆఫర్.. భారీగా తగ్గింపు!

Dec 6 2021 3:30 PM | Updated on Dec 6 2021 4:29 PM

Hyundai is offering year end discounts up to RS 50000 - Sakshi

మీరు కొత్త కారు కొనాలని చూస్తున్నారా? అయితే, మీకు ఒక శుభవార్త. ప్రముఖ ఆటోమొబైల్ తయారీ సంస్థ హ్యుందాయ్ ఎంపిక చేసిన మోడల్స్ మీద భారీగా డిస్కౌంట్ అందిస్తుంది. ఇయర్ ఎండ్ సేల్ పేరుతో కార్ల మీద డిస్కౌంట్ ప్రకటించింది. ఈ నెలలో కారు కొనుగోలు చేసే వారికి ₹50,000 వరకు ప్రయోజనాలను అందిస్తుంది. ఇది పరిమిత కాల ఆఫర్ మాత్రమేనని గుర్తుపెట్టుకోవాలి. డిసెంబర్ నెల చివరి వరకే ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. ఈ క్రింద పేర్కొన్న కార్ల మీద రూ.50 వేల వరకు డిస్కౌంట్ అందిస్తుంది.

  • హ్యుందాయ్ శాంట్రో (పెట్రోల్): ₹40,000 వరకు
  • హ్యుందాయ్ ఐ20 (పెట్రోల్/డీజిల్): ₹40,000 వరకు
  • హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 ఎన్ఐఓఎస్ (పెట్రోల్/డీజిల్): ₹50,000 వరకు
  • హ్యుందాయ్ ఆరా(పెట్రోల్/డీజిల్): ₹50,000 వరకు

కార్లపై తగ్గింపు ఆఫర్లు అనేవి ప్రాంతం, డీలర్‌షిప్, కారు మోడల్, వేరియంట్ ప్రాతిపదికన మారుతూ ఉంటాయి. అందువల్ల మీరు కారు కొనుగోలు చేయడానికి ముందుగానే ఆఫర్ వివరాలు పూర్తిగా తెలుసుకోవడం ఉత్తమం. లేదంటే ఇబ్బంది పడాల్సి రావొచ్చు. అలాగే, వచ్చే నెల నుంచి కార్ల ధరలు మళ్లీ పెరిగే అవకాశం ఉంది. మీరు కొత్త కారు కొనుగోలు చేయలని చూస్తుంటే? ఇది ఉత్తమ సమయం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement