Honda CB 300F Bike: హోండా సీబీ300ఎఫ్‌ బైక్‌ లాంచ్‌, ధర ఎంతంటే!

Honda Launched 300f Bike And  Price At Rs 2.26 Lakh - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: హోండా మోటర్‌సైకిల్‌ అండ్‌ స్కూటర్‌ ఇండియా (హెచ్‌ఎంఎస్‌ఐ)తాజాగా సీబీ300ఎఫ్‌ బైక్‌ను ఆవిష్కరించింది. ఇది రెండు వేరియంట్లలో లభిస్తుంది. 

డీలక్స్‌ ధర రూ. 2.25 లక్షలు కాగా డీలక్స్‌ ప్రో ధర రూ. 2.28 లక్షలుగా (ఢిల్లీలో ఎక్స్‌షోరూం) ఉంటుంది. బిగ్‌వింగ్‌ షోరూమ్‌లలో ఈ బైక్‌ను బుక్‌ చేసుకోవచ్చని హెచ్‌ఎంఎస్‌ఐ ఎండీ అత్సుషి ఒగాటా తెలిపారు.


 293 సీసీ ఇంజిను, అధునాతన ఆయిల్‌–కూలింగ్‌ టెక్నాలజీ, స్మార్ట్‌ఫోన్‌ వాయిస్‌ కంట్రోల్‌ సిస్టం తదితర ప్రత్యేకతలు ఈ బైక్‌లో ఉన్నాయి.    

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top