సిమెంట్ ధ‌ర‌ల పెంపు? బస్తాపై ఎంతంటే.. | Home Construction To Get Costlier As Cement Companies Plan Rs 10 To Rs 15 Per Bag Price Hike From Mid October | Sakshi
Sakshi News home page

సిమెంట్ ధ‌ర‌ల పెంపు? బస్తాపై ఎంతంటే..

Oct 12 2026 2:43 PM | Updated on Oct 12 2026 2:59 PM

Home Construction Set to Get Costlier Cement Giants Plan Price Hike

దేశీయ సిమెంట్ రంగానికి మళ్లీ ధరల మంట తాకనుంది. అక్టోబర్ మూడో వారం (మిడ్-అక్టోబర్) నుంచి దేశంలో సిమెంట్ తయారీ సంస్థలు సిమెంట్ బస్తాపై రూ.10 నుంచి రూ.15 వరకు ధరలను పెంచే యోచనలో ఉన్నాయని ఆర్థిక పరిశోధనా సంస్థ ‘ఎమ్‌కే రీసెర్చ్’ ప్రాథమిక నివేదిక వెల్లడించింది.

ధరల పెంపునకు కారణాలు

ఉత్పత్తి వ్యయాలు పెరగడం, ప్రధానంగా ఇంధన వ్యయాలు, ప్యాకింగ్ మెటీరియల్ ధరలు అధికం కావడమే ఈ నిర్ణయానికి మూలకారణమని రీసెర్చ్ నివేదిక విశ్లేషించింది. రెండో త్రైమాసికంలో అధిక ఇంధన బిల్లులు, నెగెటివ్ ఆపరేటింగ్ లెవరేజ్ ప్రభావంతో టన్నుకు రూ.200 నుంచి రూ.250 వరకు సీక్వెన్షియల్ రాబడి క్షీణత నమోదు కావచ్చని భావిస్తున్నారు. ఈ లాభాల తగ్గుదలను భర్తీ చేసుకునేందుకే కంపెనీలు ధరల పెంపు మార్గాన్ని ఎంచుకుంటున్నాయి.

డిమాండ్,  మార్కెట్ సరళి

ధరలు పెరుగుతున్నప్పటికీ సిమెంట్ రంగానికి డిమాండ్ స్థిరంగానే ఉందని ఎమ్‌కే రీసెర్చ్ పేర్కొంది. 2027 ఆర్థిక సంవత్సరం తొలి అర్ధభాగంలో పరిశ్రమ ఉత్పత్తి, విక్రయాలు దాదాపు 7% నుంచి 8% వార్షిక వృద్ధిని నమోదు చేయవచ్చని అంచనా వేసింది. ప్రాథమికంగా నాన్-ట్రేడ్ విభాగమే ఈ సిమెంట్ డిమాండ్‌ను నడిపిస్తోంది. రాబోయే పండుగలు, పనుల సీజన్, ప్రైవేట్ రియల్ ఎస్టేట్ రంగాలు పెరగడం, మౌలిక వసతుల కల్పన ప్రక్రియలు ఈ డిమాండ్‌ను రాబోయే ఏడాదిన్నర పాటు సుస్థిరంగా ఉంచుతాయని నివేదిక అభిప్రాయపడింది. వర్షాకాలం ముగిసి నిర్మాణ రంగాలు 
ఊపందుకుంటున్న తరుణంలో ఈ ధరల పెంపు గృహ నిర్మాణదారులు, బిల్డర్లు, మౌలిక వసతుల ప్రాజెక్టులపై అదనపు భారాన్ని మోపనుంది.

ఇదీ చదవండి: పండగ ఆఫర్లు.. ఆన్‌లైన్‌ షాపింగ్‌.. బీ అలర్ట్!

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement