దిగొచ్చిన బంగారం.. ఇక కొందాం.. | Gold and Silver Price Today On 2 December 2024 | Sakshi
Sakshi News home page

దిగొచ్చిన బంగారం.. ఇక కొందాం..

Dec 2 2024 11:50 AM | Updated on Dec 2 2024 2:42 PM

Gold and Silver Price Today On 2 December 2024

Gold Price Today: దేశవ్యాప్తంగా బంగారం ధరలు నేడు (డిసెంబర్‌ 2) చెప్పుకోదగ్గ స్థాయిలో క్షీణించాయి. మూడు రోజుల్లో తులానికి (10 గ్రాములు) రూ.700 పైగా రేటు దిగిరావడం పసిడి కొనుగోలుదారులకు ఉత్సాహాన్ని కలిగిస్తోంది. బంగారం ధరలు ద్రవ్యోల్బణం , గ్లోబల్ ధరలలో మార్పు, సెంట్రల్ బ్యాంక్ గోల్డ్ రిజర్వ్, హెచ్చుతగ్గుల వడ్డీ రేట్లు, నగల మార్కెట్‌లతో సహా అనేక అంతర్జాతీయ కారకాల ప్రభావంపై ఆధారపడి ఉంటాయి.

తెలుగు రాష్ట్రాలోని హైదరాబాద్‌, విశాఖపట్నం, విజయవాడ సహా   వివిధ ప్రాంతాల్లో  ఈరోజు పసిడి 10 గ్రాముల ధరలను పరిశీలిస్తే.. 22 క్యారెట్ల బంగారం రూ.600 తగ్గి రూ.70,900 వద్దకు వచ్చింది. అలాగే 24 క్యారెట్ల పసిడి రూ.650 క్షీణించి రూ.77,350 వద్దకు తగ్గింది.

అదే విధంగా దేశ రాజధాని ఢిల్లీ ప్రాంతంలోనూ బంగారం ధరలు దిగివచ్చాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.600 తగ్గి రూ.71,050 వద్దకు, 24 క్యారెట్ల పసిడి రూ.650 తగ్గి రూ.77,500 వద్దకు దిగొచ్చాయి.

ఇదీ చదవండి: చైనాలో భారీ బంగారు నిక్షేపం.. ఇక ఇదే టాప్‌!

మరోవైపు వెండి ధరలు (Silver Price Today) కూడా నేడు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్‌లో కేజీ వెండిపై రూ.500 మేర క్షీణించింది. దీంతో ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.99,500 వద్దకు వచ్చింది.

(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement