Conekt Gadgets launches 'Rhythm' Bluetooth smart sunglasses - Sakshi
Sakshi News home page

బ్లూటూత్‌ కాలింగ్‌ స్మార్ట్‌ ‘రిథమ్‌’ సన్‌గ్లాసెస్‌: భారీ తగ్గింపుతో

Mar 11 2023 4:59 PM | Updated on Mar 11 2023 6:24 PM

Conekt Gadgets launches Bluetooth smart Rhythm sunglasses - Sakshi

హైదరాబాద్: హైదరాబాద్‌కు చెందిన కన్జూమర్‌ ఎలక్ట్రానిక్స్‌ కంపెనీ కనెక్ట్‌ గ్యాడ్జెట్స్‌ రిథమ్‌ పేరుతో బ్లూటూత్‌ కాలింగ్‌ స్మార్ట్‌ సన్‌గ్లాసెస్‌ను ఆవిష్కరించింది. ఎండ నుంచి రక్షణతోపాటు ఫోన్‌ కాల్స్‌ అందుకోవచ్చు. పాటలు వినొచ్చు.  స్పెషల్‌ లాంచ్‌ ఆఫర్‌ ధర రూ. 1,999. నాలుగు గంటల ప్లేబ్యాక్‌ టైమ్‌ అందిస్తుంది. మార్కెట్లోకి విడుదల చేసిన 3 రోజుల్లోనే 20,000 యూనిట్లు విక్రయించామని కంపెనీ కో-ఫౌండర్‌ ప్రదీప్‌ యెర్రగుంట్ల తెలిపారు. 

రిథమ్‌ అంతర్నిర్మిత మైక్రోఫోన్ స్పీకర్‌లతో వస్తుంది. ఇది మ్యూజిక్‌, ఇన్‌కమింగ్ కాల్స్‌కు సులభంగా మారడానికి  వీలు కల్పిస్తుందనీ, ముఖ్యంగా  సన్ గ్లాసెస్‌ను తీయకుండానే వాల్యూమ్‌ను సర్దుబాటు చేయవచ్చు. వాయిస్ కమాండ్స్‌ ఇవ్వొచ్చు అని  ప్రదీప్‌ తెలిపారు. రిథమ్ కేవలం 38 గ్రాముల బరువు ఉంటుంది. ఇందులోని 120mAh బ్యాటరీ నాలుగు గంటల ప్లేబ్యాక్ సమయాన్ని అందిస్తుందన్నారు. త్వరలోనే మరో ఐదు మోడళ్లను విడుదల చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. వచ్చే త్రైమాసికంలో 5 లక్షల యూనిట్లను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. మరోవైపు దీని  అసలు  ధర రూ. 6,999. అయితే  ప్రత్యేక లాంచ్ ఆఫర్‌గా, 1,999 రూపాయలకే అందిస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement