వల్లభనేని వంశీ అక్రమ అరెస్టు కేసులో నిజాలు ఇవిగో.. | YSRCP Releases Truths On Vallabhaneni Vamsi Arrest | Sakshi
Sakshi News home page

వల్లభనేని వంశీ అక్రమ అరెస్టు కేసులో నిజాలు ఇవిగో..

Feb 18 2025 7:43 PM | Updated on Feb 19 2025 7:46 AM

YSRCP Releases Truths On Vallabhaneni Vamsi Arrest

విజయవాడ: వల్లభనేని వంశీ అక్రమ అరెస్ట్ కేసులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కొత్త నిజాలను బయటపెట్టింది. చంద్రబాబు ప్రభుత్వం కుట్రను బహిర్గతం చేస్తూ.. సత్యవర్థన్ వాంగ్మూలాన్ని వైఎస్సార్ సీపీ విడుదల చేసింది.  తన సోషల్ మీడియా హ్యాండిల్ ‘ఎక్స్’లో  ఆధారాలను వైఎస్సార్ సీపీ బయటపెట్టింది. ‘Truth Bomb’ పేరుతో వంశీ అక్రమ అరెస్టులో నిజాలు ఇవిగో అంటూ వైఎస్సార్‌ సీపీ ఆధారాలను విడుదల చేసింది. 

వంశీ అరెస్టే లక్ష్యంగా చంద్రబాబు సర్కారు చేసిన కుట్రలతో పాటు, గన్నవరం కేసులో కట్టుకథలు, కల్పితాలు, తప్పుడు సాక్ష్యాలు, అక్రమ అరెస్టులకు సంబంధించిన ఆధారాలను ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేసింది.  కోర్టు ముందు సత్యవర్థన్ స్టేట్ మెంట్ అందుకు నిదర్శనంగా పేర్కొంది. ఫిబ్రవరి 10 వ తేదీన సత్యవర్థన్ ఏదైతే స్టేట్ మెంట్ ఇచ్చాడో దాన్ని విడుదల చేసింది. ఘటన జరిగిన సమయంలో తాను అక్కడ లేనని సత్యవర్థన్ కోర్టుకు చెప్పిన స్టేట్ మెంట్ ను వైఎస్సార్ సీపీ బహిర్గతం చేసింది.

Advertisement
 
Advertisement
Advertisement