వివేకా, సునీతమ్మకు మాటల్లేవ్‌! | Viveka Case: PA Krishna Reddy Sensational Comments Sunitha Couple | Sakshi
Sakshi News home page

వివేకా, సునీతమ్మకు మాటల్లేవ్‌!.. అల్లుడిపై మంచి అభిప్రాయం లేదు

Published Mon, Mar 4 2024 6:50 PM | Last Updated on Mon, Mar 4 2024 7:57 PM

Viveka Case: PA Krishna Reddy Sensational Comments Sunitha Couple - Sakshi

వివేకాకు ఏదో జరిగిందని నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డికి ఫోన్‌ చేసి చెప్పాను. అయితే లెటర్‌ విషయం ఎవరికీ చెప్పొద్దంటూ.. 

సాక్షి, హైదరాబాద్‌:  మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో.. సునీతా దంపతులపై ఆయన వ్యక్తిగత కార్యదర్శిగా పని చేసిన కృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా నర్రెడ్డి సునీత యెల్లో మీడియా వేదికగా సంచలన ఆరోపణలు చేయగా.. సాక్షితో కృష్ణారెడ్డి ఎక్స్‌క్లూజివ్‌ ఇంటర్వ్యూలో కృష్ణారెడ్డి పలు నిజాల్ని పంచుకున్నారు. 

‘‘వివేకానందరెడ్డితో నాది 35 ఏళ్ల అనుబంధం. ఆయన హత్య గురించి ముందు నాకే తెలిసింది. వెంటనే ఆయన అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డికి ఫోన్‌ చేశాను. వివేకాను ఎవరో ఏదో చేశారని స్పష్టంగా చెప్పాను. అయితే.. లెటర్‌ విషయం ఎవరికీ చెప్పొద్దని నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి నాతో అన్నారు. అలాగే ఈ కేసులో  అసలు గుండెపోటు కోణం ఎక్కడి నుంచి వచ్చిందో కూడా నాకు తెలియదు. 

.. వివేకా హత్య జరిగిన రోజే నన్ను అరెస్ట్‌ చేసి చిత్రహింసలు పెట్టారు. సీబీఐ ఎస్పీ రాంసింగ్‌, సునీతా దంపతులు నన్ను బెదిరించారు. తాము చెప్పిన పేర్లు సీబీఐ ముందు చెప్పాలని నన్ను ఒత్తిడి చేశారు. వివేకా కేసులో అవినాష్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డి పేర్లు చెప్పాలన్నారు. నానా హింసలకు గురి చేశారు. లేదంటే జైలుకు పంపిస్తామన్నారు. 

.. వివేకానందరెడ్డి, సునీతమ్మ చాలాకాలంగా మాట్లాడుకోలేదు. వివేకా రెండో వివాహం విషయంలో గొడవలు జరిగాయి. రెండో భార్య షమీమ్‌ కొడుకును వారసుడిగా చేస్తారనే వివేకా చెక్‌ పవర్‌ తొలగించారు. వివేకానందరెడ్డికి అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డిపై మంచి అభిప్రాయం లేదు. అల్లుడిపై ఆయన ఎప్పుడూ కోపంగానే ఉండేవారు అని తెలిపారాయన.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement