బస్సు డ్రైవర్‌కు ఫిట్స్‌ 

Sudden Fits for APSRTC Bus Driver Boy Deceased - Sakshi

ఇంటిపైకి దూసుకెళ్లిన బస్సు 

బాలుడి మృతి 

శృంగవరపుకోట: బస్సు నడుపుతున్న డ్రైవర్‌కు ఆకస్మికంగా ఫిట్స్‌ రావడంతో స్టీరింగ్‌పై పడిపోయాడు. బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న ఓ ఇంటిని, బాలుడిని ఢీకొట్టింది. బాలుడు మృతిచెందగా, ఇంటి వద్ద ఉన్న మరో మహిళకు గాయాలయ్యాయి. ఎస్‌.కోట ఆర్టీసీ డిపో నుంచి ఆదివారం ఉదయం విజయనగరం బయలుదేరిన ఆర్టీసీ పల్లె వెలుగు బస్సు ధర్మవరం శివారు మారుతీనగర్‌ మలుపు వద్దకు వచ్చేసరికి డ్రైవర్‌ గంగునాయుడుకు ఒక్కసారిగా ఫిట్స్‌ వచ్చింది.

డ్రైవర్‌ స్టీరింగ్‌పై పడిపోవడంతో బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న ఇంటిపైకి దూసుకుపోయింది. ఇంటి ముందు ఉన్న బాలుడు శిరికి అభిషేక్‌ (12)ను, సమీపంలో వంట చేస్తున్న తొత్తడి పాపను ఢీకొట్టింది. అభిషేక్‌ను 108లో ఎస్‌.కోట ఏరియా ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పాపకు కూడా గాయాలయ్యాయి.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top