సాక్షి,తాడేపల్లి: జనసేనకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గానికి చెందిన జనసేన కీలక నేత పాఠంశెట్టి సూర్యచంద్ర దంపతులు వైఎస్సార్‌సీపీలో చేరారు.

గురువారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సమక్షంలో పాఠంశెట్టి సూర్యచంద్ర, ఆయన సతీమణి శ్రీదేవితో పాటు వారి ముఖ్య అనుచరులు వైఎస్సార్‌సీపీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.


నియోజకవర్గంలో బలమైన పట్టు..
జగ్గంపేట నియోజకవర్గ రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న పాఠంశెట్టి సూర్యచంద్ర మూడుసార్లు బూరుగుపూడి గ్రామ సర్పంచ్‌గా పనిచేశారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థిగా, 2024 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా జగ్గంపేట నియోజకవర్గం నుంచి పోటీ చేసి గణనీయమైన ఓట్లు సాధించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ తోట నరసింహంతో పాటు పలువురు వైఎస్సార్‌సీపీ నాయకులు పాల్గొన్నారు
ఇదీ చదవండి : సుప్రీం ఆదేశాలు..ఏపీ ఎన్నికల సంఘం కీలక నిర్ణయం


