విశాఖలో ‘ఇండియా ఆన్‌ ద మూన్‌’ భారీ ర్యాలీ  | India on the Moon is huge rally in Visakhapatnam | Sakshi
Sakshi News home page

విశాఖలో ‘ఇండియా ఆన్‌ ద మూన్‌’ భారీ ర్యాలీ 

Published Sat, Aug 26 2023 6:10 AM | Last Updated on Sat, Aug 26 2023 6:10 AM

India on the Moon is huge rally in Visakhapatnam - Sakshi

ఎంవీపీకాలనీ (విశాఖపట్నం): ‘ఇండియా ఆన్‌ ద మూ­న్‌’ పేరుతో విశాఖపట్నంలో శుక్రవారం భారీ ర్యాలీ నిర్వహించారు. ఏయూ ఇంజినీరింగ్‌ కళాశాల ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్‌ విభాగాల ఆధ్వర్యంలో విద్యార్థులు 400 అడుగుల జాతీయ జెండాను ప్రదర్శించారు.

ఈ ర్యాలీని ప్రారంభించిన ఏయూ వీసీ ఆచార్య ప్రసాదరెడ్డి మాట్లాడుతూ ఇండియా మూన్‌ మిషన్‌ చంద్రయాన్‌–3 సక్సెస్‌ కావడంతో భారత్‌కు అంతర్జాతీయ ఖ్యాతి లభించిందన్నారు. దీన్ని స్ఫూర్తిగా తీసుకుని యువత శాస్త్ర విజ్ఞానం వైపు దూసుకెళ్లాలన్నారు. ఈ మిషన్‌లో ఏయూ ఎమ్మెస్సీ ఎల్రక్టానిక్స్‌ విభాగానికి చెందిన పూర్వ విద్యార్థి ప్రాతినిధ్యం వహించడం ఏయూకు గర్వకారణం అన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement