విశాఖే మా రాజధాని.. నేనూ అక్కడికి షిఫ్ట్‌ అవుతాను: సీఎం జగన్‌

CM YS Jagan Interesting Comments On administrative capital Vizag - Sakshi

సాక్షి, ఢిల్లీ: ఏపీ కాబోయే పాలనా రాజధాని విశాఖపట్నం గురించి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గ్లోబల్‌ ఇన్వెస్టర్ల సమ్మిట్‌ సన్నాహక సదస్సులో.. ఢిల్లీలో మంగళవారం ఆయన పలు కంపెనీల ప్రతినిధులను ఉద్దేశించి ప్రసంగిస్తూ ‘మా రాజధాని విశాఖే’ అని ప్రకటించారు. 

రాబోయే రోజుల్లో మా రాజధానిగా మారనున్న విశాఖపట్నంకు.. మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. రాబోయే నెలల్లో నేనూ విశాఖపట్నంకు మారబోతున్నాను అని ఆయన స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే మార్చి 3, 4వ తేదీల్లో విశాఖపట్నం వేదికగా గ్లోబల్‌ ఇన్వెస్టర్ల సమ్మిట్‌ జరగనుందని ఆయన తెలియజేశారు. తన పిలుపును ఆహ్వానంగా భావించి అక్కడికి రావాలని ఇన్వెస్టర్లను ఆహ్వానిస్తూనే.. అక్కడ జరుగుతున్న వ్యాపారాభివృద్ధిని తోటి ఇన్వెస్టర్లకు తెలియజెప్పాలని సీఎం జగన్‌ కోరారు.  

(ఢిల్లీ సమావేశంలో సీఎం జగన్‌ ప్రకటన.. యథాతధంగా)
 "Here I am to invite you to Visakhapatnam which is going to be our capital, in the days to come. I myself would also be shifting over to Visakhapatnam in the months to come as well".

విశాఖపట్నంను పరిపాలనా రాజధానిగా చేస్తామని గత రెండేళ్లుగా ముఖ్యమంత్రి జగన్‌ అసెంబ్లీ వేదికగా పలు మార్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో మరే నగరానికి లేనంత విశిష్టత, చారిత్రక నేపథ్యం, భౌగోళిక సౌరుప్యం, రవాణా సౌకర్యాలు విశాఖకు ఉన్నాయి. అన్ని రకాలుగా అభివృద్ధి చెందిన విశాఖపట్నంను రాజధానిగా చేస్తే దాని వల్ల ఆంధ్రప్రదేశ్‌కు అన్ని రకాలుగా ప్రయోజనం ఉంటుందని ఇప్పటికే ఎంతో మంది చెప్పారు. దేశంలోని అభివృద్ధి చెందిన టాప్‌ 10 నగరాల్లో ఒకటైన విశాఖ హైఎండ్‌ ఐటీ హబ్‌గా ఎదిగేందుకు ఆస్కారం చాలా ఉంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top