నేటి నుంచి ప్రపంచ వారసత్వ వారోత్సవాలు | Sakshi
Sakshi News home page

నేటి నుంచి ప్రపంచ వారసత్వ వారోత్సవాలు

Published Mon, Nov 20 2023 12:40 AM

-

అనంతపురం కల్చరల్‌: ఈ నెల 20 నుంచి 26వ తేదీ వరకూ అనంతపురం వేదికగా ప్రపంచ వారసత్వ వారోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఇంటాక్‌ కన్వీనర్‌ రాంకుమార్‌, కవి రియాజుద్దీన్‌ ఆదివారం తెలిపారు. జిల్లా పురావస్తు, పర్యాటక శాఖలు, ఇంటాక్‌ సంయుక్త ఆధ్వర్యంలో వారం రోజుల పాటూ సాగే ఈ వేడుకలను సోమవారం ఉదయం ఆర్ట్స్‌ కాలేజ్‌ వద్ద హెరిటేజ్‌ వాక్‌తో కలెక్టర్‌ గౌతమి ప్రారంభించనున్నారు. 21న కేఎస్‌ఎన్‌ డిగ్రీ కళాశాలలో పురాతన నాణేల ప్రదర్శన, 22న రోటరీ పాఠశాలలో విద్యార్థులకు తెలుగు శతక పద్య పఠన పోటీలు, 23న ఆర్ట్స్‌ కళాశాలలో యువతకు పద్య పఠన పోటీలు, 24న పీస్‌ మెమోరియల్‌ హాల్‌లో చిత్రలేఖన పోటీలు, 25న జిల్లా కేంద్ర గ్రంథాలయంలో సీనియర్‌ రచయిత డాక్టర్‌ పతికి రమేష్‌ నారాయణ ఆధ్వర్యంలో కవి సమ్మేళనం, 26న ఎస్‌ఎస్‌బీఎన్‌ కళాశాలలో వారోత్సవాల ముగింపు వేడుకలు ఉంటాయి. ఉమ్మడి అనంత జిల్లా చరిత్రను ప్రతిబింబించేటా వారోత్సవాలు నిర్వహించనున్నట్లు ఇంటాక్‌ ప్రతినిధులు తెలిపారు.

Advertisement
Advertisement