ఎన్నికల నిబంధనలుపక్కాగా అమలు | Sakshi
Sakshi News home page

ఎన్నికల నిబంధనలుపక్కాగా అమలు

Published Sat, Apr 20 2024 2:05 AM

మాట్లాడుతున్న ఎన్నికల వ్యయ పరిశీలకుడు పంకజ్‌సింగ్‌, చిత్రంలో కలెక్టర్‌ విజయ సునీత - Sakshi

వ్యయ పరిశీలకుడు పంకజ్‌సింగ్‌

సాక్షి,పాడేరు: సార్వత్రిక ఎన్నికల్లో నిబంధనలు పక్కాగా అమలు చేయాలని ఎన్నికల వ్యయ పరిశీలకుడు పంకజ్‌సింగ్‌ ఆదేశించారు.శుక్రవారం ఆయన కలెక్టరేట్‌లో జిల్లా ఎన్నికల అధికారి,క లెక్టర్‌ విజయసునీత,జ ఎస్పీ తుహిన్‌సిన్హా, పాడేరు, అరకు ఆర్‌వోలు భావన వశిష్ట, అభిషేక్‌తోపాటు వ్యయ పరిశీలన బృందంతో ఆయన సమావేశమయ్యారు. రంపచోడవరం నుంచి వర్చువల్‌ విధానంలో ఆర్‌వో ప్రశాంత్‌కుమార్‌ పాల్గొన్నారు.ఈ సందర్భంగా పంకజ్‌సింగ్‌ మాట్లాడుతూ అన్ని సవాళ్లను అధిగమిస్తూ జిల్లాలో సార్వత్రిక ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించాలన్నారు. ఎన్నికల వ్యయ నివేదికలను ఎప్పటికప్పడు సిద్ధం చేయాలన్నారు. దీనిపై అన్ని రాజకీయ పార్టీలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. అలాగే కలెక్టరేట్‌లోని జిల్లా కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ను సందర్శించారు. మీడియా మానటరింగ్‌, సోషల్‌ మీడియా,సి–విజిల్‌, కాల్‌సెంటర్‌, ఎంసీసీ, బోర్డర్‌ చెక్‌పోస్టుల వెబ్‌ నిర్వహణను పరిశీలించారు. డీఆర్వో పద్మావతి, నోడల్‌ అధికారులు సువర్ణ ఫణి, గోవిందరాజులు, రాములు, సాయినవీన్‌, రమేష్‌కుమార్‌రావు, పూర్ణయ్య, రామకృష్ణరాజు పాల్గొన్నారు.

Advertisement
Advertisement