వైఎస్సార్‌సీపీ విజయమే లక్ష్యం | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ విజయమే లక్ష్యం

Published Fri, Apr 19 2024 2:05 AM

మాట్లాడుతున్న అరకు అసెంబ్లీ 
వైఎస్సార్‌సీపీ అభ్యర్థి రేగం మత్స్యలింగం - Sakshi

అరకులోయ రూరల్‌: వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల విజయమే అందరి లక్ష్యం కావాలని అరకు అసెంబ్లీ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి రేగం మత్య్సలింగం అన్నారు. గురువారం స్థానిక ఓ ప్రవేట్‌ రిసార్ట్స్‌లో నియోజకవర్గ స్థాయి భూత్‌ కమిటీ సభ్యులకు ఏర్పాటుచేసిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పార్టీ జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు జగనన్నను మళ్లీ సీఎం చేసే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.ప్రతి ఇంటికీ వెళ్లి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియజేసి మద్దతు పొందాలని సూచించారు.

జగనన్న గెలుపుతోనే అన్ని వర్గాలకు మేలు: పార్టీ ఎన్నికల పరిశీలకురాలు హైమావతి

ఈ ఎన్నికల్లో జగనన్న విజయంతోనే అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందని అరకు నియోజకవర్గ ఎన్నికల పరిశీలకురాలు హైమావతి తెలిపారు. బూత్‌ కమిటీ సభ్యులు ఇంటింటికీ వెళ్లి నవరత్నాల పథకాలపై ప్రజలకు వివరించాలని కోరారు. చంద్రబాబు మోసాలను వారికి తెలియజేయాలని సూచించారు. ప్రతిఒక్కరూ స్టార్‌ క్యాంపెయిన్‌నర్లుగా పని చేసి జరిగిన అభివృద్ధిని ప్రజలకు తెలియజేయాలన్నారు.

కలిసి పనిచేద్దాం:

ఉమ్మడి విశాఖ జెడ్పీ చైర్‌పర్సన్‌ సుభద్ర

గ్రామాల్లో నిర్వహించే ఎన్నికల ప్రచారంలో కార్యకర్తలను కలుపుకుని పనిచేద్దామని ఉమ్మడి విశాఖ జెడ్పీ చైర్‌పర్సన్‌ జల్లిపల్లి సుభద్ర పిలుపునిచ్చారు. ఈ ఎన్నికల్లో విజయం తమ పార్టీదేనన్నారు. జగనన్న వస్తేనే ప్రజలకు అన్ని సంక్షేమ పథకాలు అందుతాయన్న విషయాన్ని వారికి తెలియజేయాలన్నారు. అరకు పార్లమెంట్‌ వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి గుమ్మా తనూజారాణి, అరకు అసెంబ్లీ అభ్యర్థి రేగం మత్స్యలింగాన్ని ఫ్యాన్‌ గుర్తుపై ఓటేసి గెలిపించాలని కోరారు. జెడ్పీటీసీ బొంజిబాబు, ఎంపీపీలు శెట్టి నీలవేణి, ఈశ్వరి, రాజబాబు, ఉషారాణి, మండల పార్టీ అధ్యక్షులు లక్ష్మణ్‌కుమార్‌, స్వామి, కొండబాబు, మల్లేశ్వరరావు, బాబు, ఏఎంసీ చైర్మన్‌ రాజరమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

అరకు అసెంబ్లీ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి

రేగం మత్స్యలింగం

సమావేశానికి హాజరైన బూట్‌ కమిటీల సభ్యులు,ప్రజాప్రతినిధులు
1/1

సమావేశానికి హాజరైన బూట్‌ కమిటీల సభ్యులు,ప్రజాప్రతినిధులు

Advertisement

తప్పక చదవండి

Advertisement