విద్యార్థుల్లో సృజనాత్మకత వెలికితీయాలి | Sakshi
Sakshi News home page

విద్యార్థుల్లో సృజనాత్మకత వెలికితీయాలి

Published Tue, Apr 23 2024 8:45 AM

కవితల పుస్తకాలు ఆవిష్కరిస్తున్న డీఈవో ప్రణీత, తదితరులు - Sakshi

గుడిహత్నూర్‌: విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకత వెలికి తీయాలని డీఈవో ప్రణీత అన్నారు. మండలంలోని మన్నూర్‌ జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు వివిధ భాషల్లో రాసిన కవితల పుస్తకాలను సోమవారం ఆమె ఆవిష్కరించి మాట్లాడారు. విద్యార్థులకు రచనపై ఆసక్తి పెంచుతూ వారి ద్వారా కవితలు రాయించి సేకరించి దానికి పుస్తక రూపం అందించిన పాఠశాల ఉపాధ్యాయురాలు అరుణను ప్రత్యేకంగా అభినందించారు. అంతకు ముందు పుస్తక సంపాదకురాలు అరుణ మాట్లాడారు. విద్యార్థులు వారి అభిరుచులకు అనుగుణంగా కవితలు, పాటలు రాశారన్నారు. తెలుగు, మరాఠి, హిందీ, ఇంగ్లీష్‌, గోండి భాషల్లో రాసిన కవితలను సేకరించి పుస్తకరూపంలో ముద్రించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంఈవోలు నారాయణ, ఉదయ్‌రావ్‌, హెచ్‌ఎం సంతోష్‌కుమార్‌, సిబ్బంది పాల్గొన్నారు.

డీఈవో ప్రణీత

విద్యార్థులు రాసిన కవితల పుస్తకాలు ఆవిష్కరణ

Advertisement
Advertisement