-
సీఎం జిల్లాపై పట్టెవరిది?
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: పాలమూరులో రాజకీయాలు ఎప్పుడూ రసవత్తరంగానే ఉంటాయి. ప్రస్తుత లోక్‌సభ పోరు కూడా ఆసక్తికరంగానే మారింది. బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. డీకే.అరుణ (బీజేపీ), చల్లా వంశీచంద్‌రెడ్డి (కాంగ్రెస్), మన్నె శ్రీనివాస్‌రెడ్డి (బీఆర్ఎస్) నువ్వా..నేనా అన్నట్టుగా గెలుపే లక్ష్యంగా పోటాపోటీగా అ్రస్తాలు సంధిస్తున్నారు. దీంతో ఒక్కసారిగా రాజకీయాలు వేడెక్కాయి. మహబూబ్‌నగర్ లోక్‌సభ స్థానానికి 1952 నుంచి ఇప్పటివరకు 17 పర్యాయాలు ఎన్నికలు జరగ్గా.. పదిసార్లు కాంగ్రెస్, మూడు దఫాలు బీఆర్ఎస్ (అప్పటి టీఆర్ఎస్), తెలంగాణ ప్రజాసమితి, జనతాదళ్, జనతా పార్టీ, బీజేపీ ఒక్కోసారి మాత్రమే విజయం సాధించాయి. సీఎం రేవంత్‌రెడ్డి సొంత జిల్లా కావడం.. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ అసెంబ్లీ సెగ్మెంట్ కూడా ఈ పార్లమెంట్ పరిధిలోకి రావడంతో ఇక్కడ గెలుపును ఆయన ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ స్థానంలో విజయం సాధించి కాంగ్రెస్ ఆధిపత్యానికి చెక్ పెట్టాలని బీజేపీ.. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నేపథ్యంలో సిట్టింగ్ స్థానాన్ని నిలుపుకొని, తిరిగి పట్టు సాధించాలనే లక్ష్యంతో బీఆర్ఎస్ సర్వశక్తులొడ్డుతోంది. కాంగ్రెస్: కొడంగల్ స్కీం, ముదిరాజ్‌లపై ఆశలుమహబూబ్నగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచంద్‌రెడ్డికి మద్దతుగా సీఎం రేవంత్ ఫిబ్రవరి నుంచి ఇప్పటివరకు ఏడు పర్యాయాలు పర్యటించారు. అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే రూ.4వేల కోట్లతో చేపట్టిన మక్తల్–నారాయణపేట–కొడంగల్’పథకంతో పాటు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన విషయాన్ని పదేపదే ఓటర్లకు వివరిస్తున్నారు. పార్లమెంట్ పరిధిలో అధిక శాతం ఓటర్లుగా ఉన్న ముదిరాజ్‌లను బీసీ–డీ నుంచి బీసీ–ఏలోకి మారుస్తామని హామీ ఇచ్చిన ఆయన.. పాలమూరు ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా తీసుకురాకపోవడం, తగిన నిధులు కేటాయించకపోవడంపై బీజేపీ, బీఆర్ఎస్పై దుమ్మెత్తిపోస్తున్నారు. ఈ అంశాలు తమ గెలుపునకు దోహదం చేస్తాయనే ధీమా కాంగ్రెస్ పార్టీలో వ్యక్తమవుతోంది. అయితే మహబూబ్‌నగర్, మక్తల్, దేవరకద్ర, జడ్చర్ల నియోజకవ ర్గా ల్లోని పలు మండలాల్లో నాయకులు, కేడర్ మధ్య సమన్వయం కొరవడినట్టు తెలుస్తోంది. చేరికల క్రమంలో పాత, కొత్త నేతల మధ్య వైరం ముదిరినట్టు సమాచారం. బీజేపీ: మోదీ చరిష్మా, కేంద్ర పథకాలపై.. బీజేపీ అభ్యర్థిగా మాజీ మంత్రి, సీనియర్ మహిళానేత డీకే.అరుణ రెండోసారి బరిలో దిగారు. గత ఎన్నికల్లో రెండోస్థానంలో నిలిచిన ఆమె ఈ ఎన్నికల్లో విజయం సాధించాలనే పట్టుదలతో శ్రమిస్తున్నారు. ‘విజయ్ సంకల్స్ యాత్ర’పేరుతో పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలను చుట్టేసిన ఆమె.. నియోజకవర్గ కేంద్రాల్లో ఇంటింటికీ తిరిగి ఓట్లు అభ్యర్థించారు. ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమంతో ప్రజాక్షేత్రంలోనే ఉంటున్నారు. మోదీ చరిష్మా, కేంద్ర పథకాలు తన గెలుపునకు దో హదం చేస్తాయని బలంగా చెబుతున్న ఆమె.. పాలమూరు ప్రాజెక్టుల సాధనలో తనదే ముఖ్యపాత్ర అని ప్రజల ముందుకు తీసుకెళుతున్నారు. అధికసంఖ్యలో ఉన్న ఎస్సీ సా మాజికవర్గ ఓట్లు తనకు కలిసివస్తాయనే ఆశతో ఉ న్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ విమర్శలకు దీటు గా సమాధానం చెబుతూ తనదైన శైలిలో ముమ్మర ప్రచారం కొనసాగిస్తున్నారు. అయితే జితేందర్‌రెడ్డి, జలంధర్ రెడ్డి వంటి నాయకులు బీజేపీ ని వీడి కాంగ్రెస్‌లో చేర డం, ఆమెకు కొంత మైనస్‌గా మారినట్టు తెలుస్తోంది. బీఆర్ఎస్: కేసీఆర్‌పైనే భారం బీఆర్ఎస్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి రెండోసారి బరిలో నిల్చున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో పార్టీ శ్రేణుల్లో నిరుత్సాహం అలుముకుంది. ఈ క్రమంలో ఎంపీ అభ్యర్థుల ప్రకటన ఇతర పార్టీల కంటే ఆలస్యం కాగా.. ప్రచారంలో కొంత వెనుకబడ్డారు. అయితే పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగడం.. బస్సు యాత్ర ద్వారా మహబూబ్‌నగర్‌లో నిర్వహించిన భారీ రోడ్‌షో, కార్నర్ మీటింగ్‌కు పెద్దఎత్తున ప్రజలు హాజరుకావడంతో ‘గులాబీ’శ్రేణుల్లో జోష్ నెలకొంది. కేంద్రంలో పదేళ్లు అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణకు ఏం చేసిందని..అమలుకాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వాటిని అమలు చేయలేక చతికిలపడిందంటూ తనదైన పంథాలో విమర్శలు గుప్పిస్తూనే..ఈ పార్లమెంట్ స్థానంలో అధిక సంఖ్యలో ఉన్న ముస్లిం ఓటర్లు టార్గెట్‌గా ప్రసంగించి ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఇదే సమయంలో ఇక్కడ బీఆర్ఎస్, బీజేపీ మధ్యే పోటీ నెలకొందని.. అందరూ కృషి చేస్తే మన్నె శ్రీనివాస్‌రెడ్డి గెలుపు తథ్యమని నేతలకు దిశానిర్దేశం చేశారు. ఈ క్రమంలో ఆ పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నెలకొంది.ప్రభావం చూపే అంశాలు.. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయహోదా అచ్చంపేట–తాండూరు, కృష్ణా–వికారాబాద్ రైల్వే లేన్ పెండింగ్ గద్వాల–మాచర్ల లేన్‌కు అడుగులు పడకపోవడం నారాయణపేటకు మంజూరైన సైనిక్ స్కూల్ తరలిపోవడంపై నిరసన గద్వాల, నారాయణపేటలో చేనేతలకు టెక్స్టైల్ పార్కు ఏర్పాటు డీకే అరుణ (బీజేపీ)వంశీచంద్‌రెడ్డి (కాంగ్రెస్) శ్రీనివాస్‌రెడ్డి (బీఆర్ఎస్) 2019 ఎంపీ ఎన్నికల్లో ప్రధాన పార్టీల వారీగా అభ్యర్థులకు పోలైన ఓట్లు.. టీఆర్ఎస్ – మన్నె శ్రీనివాస్‌రెడ్డి4,11,402 (41.78 శాతం)బీజేపీ – డీకే అరుణ3,33,573 (33.88 శాతం)కాంగ్రెస్ – చల్లా వంశీచంద్‌రెడ్డి1,93,631 (19.67 శాతం) -
నేడు ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో కేసీఆర్ పర్యటన
సాక్షి, మహబూబ్‌నగర్: కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ముఖ్య నేతల రాకతో పార్టీల ఎన్నికల ప్రచారం మరింత వేడెక్కనుంది. నేడు జిల్లాలో మాజీ సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. పాలమూరు పోరుబాట పేరుతో చేపట్టిన బస్సు యాత్ర.. సాయంత్రం జడ్చర్ల నుంచి ప్రారంభం కానుంది. జడ్చర్ల నుండి మహబూబ్‌నగర్ వరకు భారీ రోడ్‌షో నిర్వహించనున్నారు. జిల్లా కేంద్రంలోని క్లాక్ టవర్ వద్ద కార్నర్ మీటింగ్‌లో ఆయన మాట్లాడనున్నారు.రాత్రికి మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఇంట్లో బస చేయనున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటేందుకు ఉమ్మడి జిల్లా నేతలతో సమాలోచనలు జరపనున్నారు. రేపు(శనివారం) నాగర్‌కర్నూల్‌కు బస్సు యాత్ర చేరుకోనుంది. నాగర్ కర్నూల్, మహబుబ్ నగర్ అభ్యర్థులకు మద్దుతుగా సభ నిర్వహించనున్నారు. భారీగా జనసమీకరణకు బీఆర్ఎస్ శ్రేణులు కార్యాచరణ చేస్తున్నాయి. -
డీకే అరుణతో నాకు పోటీ ఏంటి? పొంతనేంటి?: సీఎం రేవంత్
సాక్షి, నాగర్ కర్నూల్: లోక్‌సభ ఎన్నికల ముందు బీఆర్ఎస్, బీజేపీ నేతలపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. కొడంగల్‌ను దొంగ దెబ్బ తీయాలని బీజేపీ, బీఆరెస్ నాయకులు కుట్ర చేస్తున్నారని.. ఈ కుట్రలను తిప్పి కొట్టాల్సిన బాధ్యత నియోజకవర్గ ప్రజలపై ఉందన్నారు. నారాయణ పేట జిల్లా మద్దూరు మండల కేంద్రంలో కొడంగల్ నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా బీజేపీ నేత, మహబూబ్‌నగర్ ఎంపీ అభ్యర్ధి డీకే అరుణపై సీఎం రేవంత్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆనాడు మంత్రిగా ఉండి నారాయణపేట ఎత్తిపోతల రాకుండా అడ్డుకున్న డీకే అరుణ.. నేడు మళ్లీ ఓట్లు అడగడానికి వస్తున్నారని మండిపడ్డారు. తనను అవమానించానని డీకే అరుణ మాట్లాడుతున్నారని.. శత్రువు చేతిలో చుర కత్తిగా మారి పాలమూరు కడుపులో ఎందుకు పొడుస్తున్నవని మాత్రమే తాను ప్రశ్నించినట్లు పేర్కొన్నారు. నరేంద్రమోదీ చేతిలో కత్తిగా మారి పాలమూరు కడుపులో పొడవద్దని అన్నారు. ‘కొడంగల్ నియోజకవర్గంలో మీరు నాటిన మొక్క ఇవాళ మీ ఆశీర్వాదంతో తెలంగాణ ముఖ్యమంత్రి స్థాయికి చేరుకుంది. కొడంగల్ నియోజకవర్గానికి పీసీసీ అధ్యక్ష పదవి, ముఖ్యమంత్రి పదవి ఏక కాలంలో ఇచ్చిన ఘనత సోనియమ్మది. చేయి చాచి అడిగే పరిస్థితి నుంచి ఇవాళ ఎవరికి ఏం కావాలో ఇచ్చే స్థాయికి కొడంగల్‌కు కాంగ్రెస్ అవకాశం ఇచ్చింది. మీరే కథానాయకులై నన్ను 33 వేల మెజారిటీతో గెలిపించారు. పాలమూరు బిడ్డలు నూటికి నూరు శాతం నాకు అండగా నిలబడ్డారు. అలాంటి నాకు నీ మీద అసూయ ఎందుకుంటుంది.? ఎందుకు కోపం ఉంటుంది.? నాకు నీకు పోటీ ఏంటి..? పొంతనేంటి..? ఉమ్మడి పాలమూరు జిల్లాలో నాకు శత్రువులు లేరు. ప్రత్యర్ధులు లేరు. పాలమూరు అభివృద్ధి కోసమే నా తపనంతా. 70ఏళ్ల తరువాత పాలమూరుకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. నాకు అండగా నిలబడండి. పాలమూరును రాబోయే వందేళ్లకు సరిపడా అభివృద్ధి చేసి చూపిస్తా. పార్టీలకు అతీతంగా ముందుకు రండి.పాలమూరు అభివృద్ధి చేసి చూపిస్తా. వందరోజుల్లోనే మమ్మల్ని కేసీఆర్ దిగిపొమ్మంటున్నారు. పదేళ్లు ప్రజలను మోసం చేసిన నిన్ను చెంపలు వాయించాలి. తాగుబోతు కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారు. రూ. 3,900 కోట్ల లోటు బడ్జెట్‌తో నేను సీఎంగా బాధ్యత తీసుకున్నా. నేను వచ్చాక నాలుగు నెలలల్లో 26వేల కోట్లు వడ్డీలు కట్టా. అసెంబ్లీకి రా నేను లెక్కలు చూపిస్తా. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించాం. రూ.10లక్షల వరకు ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్యం అందిస్తున్నాం. రూ.500లకే గ్యాస్ సిలిండర్ అందించాం. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తూ... 45 లక్షల ఇళ్లల్లో వెలుగు నింపుతున్నాం. సేవాలాల్ సాక్షిగా పంద్రాగస్టులోగా రూ.2లక్షలు రుణమాఫీ చేస్తాం. రుణమాఫీ చేయకపోతే రాజీనామా చేస్తావా అని హరీష్ మాట్లాడుతున్నాడు. ఈ వేదికగా నేను హరీష్ రావుకు సవాల్ విసురుతున్నా. పంద్రాగస్టులోగా రుణమాఫీ చేస్తే నీ పార్టీని రద్దు చేసుకుంటావా? ఈ సవాల్‌కు హరీష్ సిద్ధమా.? నేను మాట ఇస్తే ఎలా ఉంటుందో పోయి మీ మామను అడుగున. బీజేపీ నేతలకు పిచ్చి ముదిరి మతాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారు. వారి మాయలో పడొద్దు. కొడంగల్ నుంచి వంశీచంద్ రెడ్డికి 50వేల మెజారిటీ ఇవ్వండి’ అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. -
టచ్ చేస్తే మసే!
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్/ సాక్షి, మహబూబాబాద్: ‘‘20 మంది ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని, చిటికేస్తే వస్తారని కేసీఆర్ చెప్తున్నారు. చిటికె కాదు.. మిద్దెక్కి డప్పు కొట్టు .. నీ దగ్గర ఉన్నోళ్లు కూడా ఎవరైనా ఉంటారేమో చూద్దాం. గతంలోలాగా తోడేళ్లలా వచ్చి కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఎత్తుకుపోదామని అనుకుంటున్నావేమో. ఇక్కడ కాపలా ఉన్నది రేవంత్‌రెడ్డి. కంచె వేసి కాపాడుకునే పవర్ఫుల్ హైటెన్షన్ వైర్ లాంటివాడు. కరెంటు తీగ మీద కాకి వాలితే ఎట్లా అయితదో.. కాంగ్రెస్ వైపు చూస్తే అట్లానే షాక్ కొట్టి మాడిమసై పోతారు. ప్రయత్నం చేసి చూడు’’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఆయన శుక్రవారం మహబూబ్‌నగర్‌లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా చల్లా వంశీచంద్‌రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో, పట్టణంలో నిర్వహించిన భారీ ర్యాలీ, కార్నర్ మీటింగ్‌లో పాల్గొన్నారు. సాయంత్రం మహబూబాబాద్‌లో కాంగ్రెస్ తెలంగాణ జన జాతర బహిరంగ సభలో పాల్గొన్నారు. ఆయా చోట్ల సీఎం రేవంత్ ప్రసంగం ఆయన మాటల్లోనే.. ‘‘మా కారు కొంచెం పాడైంది. గ్యారేజీకి పొయిందని నిన్న, మొన్న కేటీఆర్ అంటున్నారు. కారు రిపేరవడం కాదు.. ఇంజిన్ సహా మొత్తం పాడైపోయింది. ఇనుప సమాన్ల కింద తూకానికి అమ్ముడే. నీ కారే కాదు.. తండ్రి కేసీఆర్ ఆరోగ్యం కూడా దెబ్బతిన్నది.. ఇంకా నడవలేకపోతున్నరు. మొన్నటి ఎన్నికల్లో ఓటర్లు బీఆర్ఎస్ను పాతేసినా.. ఇంకా పొంకనాలు కొడుతున్నరు. మీ ఎమ్మెల్యేలే నీవెంబడి ఉంటలేరు. అలాంటిది ఎదుటి పార్టీల 20 మంది ఎమ్మెల్యేలున్నారని చెబుతావా? ఇంకెన్ని రోజులు ఇలా కథలు చెప్పి బతుకుతరు? మోదీ, కేసీఆర్ ఒక్కటే.. కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో కేసీఆర్ ఇద్దరూ తోడు దొంగలు. వారిలో ఎవరికి ఓటేసినా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినట్లే. తెలంగాణకు ద్రోహం చేసినట్లే.. పదేళ్లు పాలించిన ఇద్దరు రాష్ట్రానికి చేసింది శూన్యం. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిని బయట పెట్టకుండా కేసీఆర్ ఇచ్చే కమీషన్లకు కక్కుర్తి పడింది ప్రధాని కాదా? పదేళ్లలో పార్లమెంట్లో బీజేపీ ప్రవేశపెట్టిన ప్రతి బిల్లును సమరి్ధంచినది బీఆర్ఎస్ ప్రభుత్వం కాదా? ఏ ముఖంతో బీజేపీ ఓట్లు అడుగుతుంది? పదేళ్లు తెలంగాణకు నిధులు ఇవ్వకుండా అన్యాయం చేసిన బీజేపీ ఇప్పుడు ఓట్లు వేయాలంటూ ప్రజల ముందుకు రావడం సిగ్గుచేటు. బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయకుండా పక్కన పెట్టింది బీజేపీ కాదా? వరంగల్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఎటుపోయింది? తల్లిని చంపి బిడ్డను బతికించారంటూ తెలంగాణ ఏర్పాటుపై వ్యాఖ్యలు చేసిన ప్రధాని మోదీ తెలంగాణ ప్రజల ఓట్లు ఎలా అడుగుతారు? ఉత్తర భారత దేశంలో కుంభమేళా, గంగానది పరిరక్షణ కోసం వేల కోట్లు కేటాయించిన బీజేపీ ప్రభుత్వం.. మన మేడారం జాతరకు ముష్టి రూ.3 కోట్లు కేటాయించి అవమానించింది. 42 మంది తెలుగు మాట్లాడే ఎంపీలుంటే ఒక్క మంత్రి పదవి ఇచ్చారు. అదే యూపీలోని 60 మంది ఎంపీలకు 12 మంత్రి పదవులు, 26 మంది ఎంపీలు ఉన్న గుజరాత్‌కు ఏడు మంత్రి పదవులు ఇచ్చి వివక్ష చూపారు. బీఆర్ఎస్, బీజేపీ చీకటి ఒప్పందం పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ సొంతంగా ఒక్క సీటు కూడా గెలవదని గ్రహించే బీజేపీతో చీకటి ఒప్పందం కుదుర్చుకుంది. కేసీఆర్ తన బిడ్డ కవితకు బెయిల్ మంజూరు చేయించుకునేందుకు.. రాష్ట్రంలోని మహబూబ్‌నగర్, చేవెళ్ల, మల్కాజిగిరి, భువనగిరి, జహీరాబాద్ సీట్లను వదిలేశారు. ఎవరెన్ని ఒప్పందాలు చేసుకున్నా.. అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్‌ను ఓడించిన తెలంగాణ ప్రజలు.. ఈ ఎన్నికల్లో మోదీకి కూడా బుద్ధి చెప్పడం ఖాయం. కమ్యూనిస్టులు, టీజేఎస్ మద్దతు తీసుకుంటాం పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో సీపీఐ, సీపీఎం, టీజేఎస్ పార్టీల మద్దతు తీసుకుంటాం. వారితో చర్చించే బాధ్యతను ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చూసుకుంటారు. ప్రజాస్వామ్య పరిరక్షణకోసం కలిసొచ్చే ఇతర పార్టీల మద్దతును కూడా కూడగడతాం. మరో పదేళ్లు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉంటుంది. ప్రజలకు ఇచ్చి న ప్రతీ హామీని నెరవేస్తుంది. తెలంగాణ బిడ్డల చావులను చూసిన సోనియా గాంధీ మనసు తల్లడిల్లి తెలంగాణ ఇచ్చారు. ఇప్పుడు ఆమె కుటుంబానికి అండగా ఉండేందుకు తెలంగాణ సమాజం సిద్ధంగా ఉంది. ఢిల్లీలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే. 14 మంది ఎంపీలతో ఢిల్లీ వెళ్తాం..’’ అని రేవంత్ పేర్కొన్నారు. పాలమూరుకు పది పైసలైనా తెచ్చారా? శత్రువు చేతిలో కత్తి పెడితే.. వాడు పక్కోన్ని పొడవడు. మన కడుపులోనే పొడుస్తడు. నిన్న మొన్నటివరకు పదేళుŠల్ కేసీఆరే సీఎంగా, మోదీ పీఎంగా ఉన్నారు కదా. పాలమూరుకు పది పైసలన్నా తెచ్చారా? పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా తెచ్చారా? అది తేలేదుగానీ డీకే అరుణమ్మ మాత్రం బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు పదవి తెచ్చుకుంది. పాలమూరులో ఆమె గెలిస్తే గడీలో ఉన్న బంధువులకు మేలే తప్ప పాలమూరుకు ఏ న్యాయమూ జరగదు. గల్లీ నుండి కేసీఆర్ వచ్చి నా.. ఢిల్లీ నుంచి మోదీ వచ్చి నా ఈ గడ్డ మనది. నాడు తట్టపనికో, మట్టి పనికో వలసలు పోయినం. ఇవాళ నాయకులమై మీ ప్రాంతానికొచ్చినం. రాష్ట్రంలోనే కాదు.. దేశంలోనే తలెత్తుకునేలా గౌరవాన్ని ప్రదర్శించినం. కేసీఆర్‌ది అసత్య ప్రచారం: మంత్రులు మహబూబాబాద్ సభలో మంత్రులు ప్రసంగించారు. రేవంత్ బీజేపీలోకి వెళ్తున్నారంటూ.. తాను బీఆర్ఎస్లోకి వెళ్తున్నానంటూ అసత్యపు ప్రచారం చేయడం మాజీ సీఎంకు అలవాటుగా మారిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మండిపడ్డారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 120 రోజులే అయిందని, ఈ కాస్త సమయంలోనే ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచామని మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు పేర్కొన్నారు. గత పదేళ్లలో గిరిజనుల కోసం ఏమీ చేయని బీజేపీకి గిరిజనులు బుద్ధి చెప్తారని మంత్రి సీతక్క చెప్పారు. -
కేసీఆర్ కథలకు కాలం చెల్లింది: రేవంత్ కౌంటర్
సాక్షి, మహబూబ్‌నగర్: కేసీఆర్ వ్యాఖ్యలకు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. రేవంత్‌ను ముట్టుకుంటే షాక్ కొడుతుందని, తాను హైటెన్షన్ వైర్ లాంటివాడినని చెప్పారు. కేసీఆర్ కథలకు కాలం చెల్లిందన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కాపాడుకునే శక్తి తనకు ఉందన్నారు. మహబూబ్‌నగర్‌లో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి చల్లా వంశీ చంద్ రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డితోపాటు పార్టీ ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మెట్టుగడ్డ చైరస్తా నుంచి క్లాక్ టవర్ చౌరస్తా వరకు రోడ్ షో నిర్వహించారు. క్లాక్ టవర్ చౌరస్తాలో కార్నర్ మీటింగ్‌లో రేవంత్ మాట్లాడుతూ.. పార్లమెంటులో నోరు లేకపోయినా, పాలమూరులో ఇల్లు లేకపోయినా 2009 లోక సభ ఎన్నికల్లో కేసీఆర్‌నును పాలమూరు ప్రజలు గెలిపించారని గుర్తు చేశారు. అయినా కేసీఆర్ పాలమూరు జిల్లాకు ఏం చేయలేకపోయారని విమర్శించారు. కృష్ణానది పక్కనే ప్రవహిస్తున్న పాలమూరులో ప్రాజెక్టులు కట్టలేదని, విద్యా, ఉద్యోగ అవకాశాల్లో సహకరించలేదని దుయ్యబట్టారు. పరిశ్రమలు కూడా కట్టలేదని మండిపడ్డారు. ఎంపీ శ్రీనివాస్ రెడ్డి పార్లమెంట్లో ఏరోజు పాలమూరు గురించి మాట్లాడలేదని విమర్శించారు. మళ్లీ ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నారని ప్రశ్నించారు. ‘ప్రజలు కారును బొంద తీసి పాతిపెట్టారు. కారును తూకం పెట్టి అమ్ముడే. రేవంత్ రెడ్డి హై టెన్షన్ వైర్. మహబూబ్‌నగర్ కాంగ్రెస్ వైపు చూస్తూ నీ సంగతేంటో చూస్తాం. మా ఎమ్మెల్యేలను ముట్టుకో చుద్దాం. ఎమ్మెల్యేలను కంచె వేసి కాపాడుకుంటా. ఇది ఆడబిడ్డల ప్రభుత్వం. స్వయం సహాయక బృందాలతో మహిళా సంఘాలను ఆదుకున్నాం. కేసీఆర్ ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వకపోయినా మేము అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో 30 వేల ఉద్యోగాలు ఇచ్చాం. చదవండి: లోక్‌సభ ఎన్నికల హడావిడి.. నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్ధులు కేంద్రం నుంచి 30 వేల కోట్లు రాబట్టి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేస్తాం. గజ్వేల్ దొరలు-గద్వాల గడీల దొరసాని ప్రజలను బానిసల్లాగా మార్చుకున్నారు. 70 ఏళ్లలో పాలమూరుకి మంత్రి పదవి ఇవ్వడానికి మీన మేషాలు లెక్క పెట్టారు. అలాంటిది 70 ఏళ్ల తర్వాత పాలమూరుకి సువర్ణ అవకాశమొచ్చింది. ఎస్సీ వర్గీకరణ సాధించే బాధ్యత మాది. మీ బిడ్డగా అడుగుతున్న. ఒక్కసారి పాలమూరులోని రెండు పార్లమెంటు స్థానాలను గెలిపించి ఇవ్వండి. డీకే అరుణ మోదీ చేతిలో ఉంది. పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా తేలేకపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం మీద శాపనార్ధాలు పెడుతున్నారు. వంద రోజులు కాకమునపే ప్రభుత్వాన్ని కులదోయాలని కుట్రలు చేస్తున్నారు. కేసీఆర్ కాలం చెల్లింది, కారు షెడ్డుకు పోయింది. నాడు పలుగు పారాబట్టి పాలమూరు నుంచి వలసలు పోయేటోళ్లు. నేడు అదే పాలమూరు బిడ్డ నాయకుడై దేశం నలుమూలలు తిరిగి పాలమూరు ప్రతిష్ట పెంచాడు. పాలమూరు అభివృద్ధి కావాలంటే రెండు ఎంపీ సీట్లు గెలవాల్సిందే. వంశీ చంద్ రెడ్డిని, మల్లు రవిని లక్ష మెజార్టీతో గెలిపించాలి. రాష్ట్రంలో 14 ఎంపీ స్థానాల్లో గెలిపించాలి’ అని రేవంత్ కోరారు
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
అమెరికా వరల్డ్‌కప్ జట్టులో ఐదుగురు భారత సంతతి ఆటగాళ్లు..
చావ్లా అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలో రెండో బౌలర్‌గా
గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న నటుడి కూతురు (ఫోటోలు)
పార్టీ ఆఫీసులో రాహుల్ గాంధీ పూజలు - వీడియో వైరల్
వెంకటేశ్ అయ్యర్ అద్భుత పోరాటం.. ముంబై టార్గెట్ ఎంతంటే?
సీఎం జగన్ రేపటి ప్రచార సభల షెడ్యూల్ ఇలా..
పిల్లల్ని ఎందుకు కనలేదో తొలిసారి చెప్పిన వితికా
ధనుష్‌తో విడిపోయిన ఐశ్వర్య.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)
సొంతగూటికి సంజయ్ నిరుపమ్
అమిత్‌షాపై కోడ్ ఉల్లంఘన కేసు
తప్పక చదవండి
- వరల్డ్‌కప్‌కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్‌గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్‌లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్‌తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement