మానవత్వం చాటుకున్న జోహార్ వైఎస్సార్ గ్రూప్
నెల్లూరు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మంచానికే పరిమితమైన ఆటోడ్రైవర్ వంశీ కుటుంబాన్ని ఆదుకునేందుకు అమెరికాలో స్థిరపడ్డ దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి అభిమాన ప్రవాంసాంధ్రులు జోహార్ వైఎస్ఆర్ గ్రూప్ పేరిట ముందుకొచ్చారు. లక్షా పదివేల రూపాయల ఆర్థిక సహాయాన్ని ఒంగోలు పార్లమెంటు సభ్యుడు వైవి సుబ్బారెడ్డి చేతుల మీదుగా వంశీ భార్య గీతకు హైదరాబాద్లో అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. వైఎస్సార్ స్పూర్తితో ప్రవాసాంధ్రులు బాధిత కుటుంబానికి ఈ సహాయం చేయటం చాలా ఆనందంగా ఉందని, దీంతో ఆ కుటుంబానికి కొండంత ధైర్యం వచ్చిందన్నారు. ఇటువంటి సంక్షేమ కార్య్రకమాలు మరిన్ని చేయాలని ఆయన అభిలాషించారు. ఈ కార్య్రకమంలో కావలి శాసనసభ్యుడు ప్రతాప్, ఎస్ నారాయణరెడ్డి పాల్గొన్నారు.