-
ఆందోళన రేపుతున్న చైనా ఫొటోలు!
-
ఆందోళన రేపుతున్న చైనా ఫొటోలు!
న్యూఢిల్లీ: తన మొదటి దేశీయ విమాన వాహక యుద్ధనౌకను చైనా శరవేగంగా పూర్తిచేస్తున్నట్టు తాజాగా వెలుగులోకి వచ్చిన ఫొటోలను బట్టి తెలుస్తున్నది. అత్యంత ఆధునికమైన యుద్ధనౌకను టైప్ 001-ఏ పేరిట చైనా రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఒక కృత్రిమ దీవి తరహాలో అత్యాధునికమైన సాంకేతిక హంగులతో దీనిని తయారుచేస్తోంది. ఈ ‘ఐలాండ్’లో యుద్ధనౌక వంతెనలు, యుద్ధ విమానాయాన సౌకర్యాలు, యుద్ధ నియంత్రణ సాంకేతికత, ర్యాడర్లు, స్పెన్సర్లు ఇలా అత్యాధునిక హంగులు ఉండనున్నాయి. తూర్పు బీజింగ్‌కు చేరువలోని డాలియన్ ఓడరేవు పట్టణంలో.. ఓ ఎండిపోయిన డాక్‌యార్డ్ వద్ద టైప్ 001-ఏ యుద్ధ వాహకనౌక నిర్మాణం అవుతోంది. దీని బరువు 60వేల టన్నుల వరకు ఉంటుంది. ఇందులో 50 యుద్ధ విమానాలు తరలించవచ్చు. రష్యా ఎస్‌యూ-27 అనుగుణంగా చైనా రూపొందించిన జే-15 ఫైటర్ విమానాలు 36ని ఇందులో తీసుకుపోవచ్చు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఈ భారీ యుద్ధనౌకకు త్వరలోనే సముద్ర ట్రయల్స్ నిర్వహిస్తారని భావిస్తున్నారు. అయితే, ఇది పూర్తిస్థాయిలో 2020 నాటికి చైనా నేవీకి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. చైనా రూపొందిస్తున్న రెండో దేశీయ యుద్ధనౌక ఇది. రష్యా రూపొందించిన లియానింగ్ నౌక ఆధారంగా ఇది రూపొందుతున్నట్టు భావిస్తున్నారు. ఈ భారీ యుద్ధనౌకతోపాటు కొత్త జే-15 ఫైటర్ విమానాల ఫొటోలు తాజాగా చైనా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఈ ఫొటోలు చైనా వైమానిక యుద్ధనౌకలు, ఫైటర్ విమానాల సామర్థ్యాన్ని చాటుతున్నాయి. ఈ ఫొటోలు రక్షణపరంగా భారత్‌కు ఆందోళన కలిగించేవేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. భారత్ ఇప్పటికే దేశీయంగా విక్రాంత్ వైమానిక యుద్ధ నౌకను రూపొందించి.. మూడేళ్ల కిందట కోచి తీరంలో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్‌కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్‌పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
ఆకలిని అడ్డు పెట్టుకుని యుద్ధం చేయడం లేదు: నెతన్యాహు
Janki Bodiwala: షైతాన్ మూవీలో దెయ్యం పట్టినట్లుగా.. రియల్ లైఫ్‌లో ఏంజెల్‌గా.. (ఫోటోలు)
మాక్స్వెల్ అత్యంత చెత్త రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే
ప్రభాస్- నాగ్ అశ్విన్ 'కల్కి 2898 ఏడీ'.. బుజ్జి లుక్ చూశారా?
బంగారం ఎఫెక్ట్.. భారీగా పెరిగిన పట్టు చీరల ధరలు
కమల్ హాసన్ ఇండియన్-2.. ఫస్ట్ సింగిల్ వచ్చేసింది!
AP: ఆరోగ్యశ్రీ లబ్ధిదారులకు అంతరాయం కలిగిస్తే ఆసుపత్రులపై చర్యలు
మమత సర్కారుకు షాక్.. కలకత్తా హైకోర్టు సంచలన తీర్పు
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (22-05-2024)
Vishal Marriage: పెళ్లెప్పుడు? విశాల్ సమాధానమిదే! ఇంక చేసుకున్నట్లే!
తప్పక చదవండి
- మాక్స్వెల్ అత్యంత చెత్త రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే
- జీతాలపై ప్రభావం.. ఎయిర్ఇండియా ఉద్యోగుల ఆందోళన!
- విడాకుల రూమర్స్.. ఈ ప్రపంచం గురించి పట్టించుకోనంటున్న నటుడు
- ఒకపుడు జర్నలిస్టు, అంబానీని మించిన ఇంద్రభవనంలో : అత్యంత అందమైన రాణి
- ప్రచారంలో వివాదాస్పద వ్యాఖ్యలు.. ఈసీ సీరియస్
- ఈవెంట్లో ప్రియాంక చోప్రా.. వందల కోట్ల విలువైన నెక్లెస్‌తో!
- T20: బంగ్లాకు షాకిచ్చిన పసికూన.. మినీ టీమిండియా అంటూ..
- చనుగొండ్లలో చిరుత పిల్లల సంచారం.. భయాందోళనలో గ్రామస్తులు
- ఇజ్రాయెల్ హెచ్చరిక.. రాయబారులు వెనక్కి రండి
- నేమ్‌ప్లేట్ మార్చేసిన సూపర్ మామ్ సానియా మీర్జా ఫోటోలు వైరల్
Advertisement