-
టమోటాలు ఇలా కూడా పెంచవచ్చు!
ఇటీవల కాలంలో స్థలం లేకపోయినా మొక్కల పెంచుకునే సరికొత్త పద్ధతులు వస్తున్నాయి. ఆఖరికి ఫ్లాట్‌లోని బాల్కనీలో కూడా సులభంగా పెంచుకునే పద్ధతులను కూడా చూశాం. చిన్ని చిన్ని కుండీల్లోనే జామ, దానిమ్మ వంటి పళ్లు కాసే మొక్కలను పెంచి చూపించారు. ఇదంత ఒక ఎత్తైతే ఇప్పుడు ఏకంగా మొక్కలను తలకిందులుగా పెంచే సరికొత్త పద్ధతి మన ముందుకు వచ్చింది. పైగా దీని వల్ల ఎన్నో చీడ పీడలను కూడా నివారించొచ్చు, మంచి దిగుబడి కూడా వస్తుందంటున్నారు. అందులోనూ టమోటా మొక్కలను ఇలా పెంచితే స్థలం ఆదా అవ్వడమే గాక ఎక్కువ టమోటాలు పండించొచ్చు అంటున్నారు అగ్రికల్చర్ నిపుణులు. ఇంతకీ ఇదెలా సాధ్యం? ఎలా పెంచుతారంటే.. టమోటాలను తలకిందులుగా పెంచే పద్ధతిని ఎంచుకొనేటప్పుడూ అన్ని రకాల టమోటాలకు ఈ పద్ధతి మంచిది కాదనే విషయాన్ని గుర్తించుకోవాలి. ముఖ్యంగా చెర్రీ టమోటా వంటి కొన్ని రకాల టమాటాలకు మాత్రమే ఈ పద్ధతి సరైనది. ముందుగా వేలాడే మొక్కల కంటైనర్లను తీసుకోవాలి. ముఖ్యంగా చక్కగా వేలాదీయగల బకెట్ లేదా కుండిని తీసుకోవాలి దాని అడుగు భాగన రంధ్రం ఉండేలా చూసుకోండి. ఒకవేళ్ల రంధ్రం లేకపోతే మనం ఏర్పాటు చేసుకోవాలి. దీనికి మంచి ఎరువుతో కూడిన మట్టిని కుండీలో నింపి దానిలో టమోటా వితనాలు వేసి ఉంచాలి. ఆ విత్తనాలు మొలకెత్తిన వెంటనే..ఆ కుండీ పైభాగం కవర్ అయ్యేలా కవర్ లేదా ఏదైనా మూత వంటి వాటిని ఏర్పాటు చేసి తలకిందులుగా వేలాడదీసి ఆ రంధ్రంలో ఈ మొలకెత్తిన మొక్కను చొప్పించాలి. దీన్ని సూర్యరశ్మీ తగిలే చోట వేలాదీయండి. ఆ తర్వాత మొక్కగా మొలికెత్తిన ఈ టమోటా మొక్కను చక్కగా పెరిగేలా తీగల వంటి సపోర్టు ఏర్పాటు చేసుకుని సమయానికి నీరు అందించాలి. చక్కగా గాలికి ఎక్స్పోజ్అయ్యి మంచిగా పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే పరాగ సంపర్కం సులభతరమవుతుంది. ఇక ఈ పద్ధతిలో మొక్క మట్టికి బయటకు బహిర్గతం కావడం వల్ల నేల ద్వారా వచ్చే తెగుళ్లు, ఫంగస్, కట్‌వార్మ్ వంటి సమస్యలు వచ్చే ప్రమాదం తక్కువుగా ఉంటుంది. తలక్రిందులుగా వేలాడదీయడం వల్ల మొక్కలు ఎలాపడితే అలా వ్యాపించవు కాబట్టి చక్కగా నచ్చిన రీతీలో కట్ చేసుకుని ఆకర్షణీయంగా పెంచుకునే సౌలభ్యం ఉంటుంది. అంతేగాక వీటిని ఎండ తగిలే చోటికి తరలించుకుపోవడం సులభం, పైగా ఎక్కువ టమాటాలు కాస్తాయి కూడా. ముఖ్యంగా ఈ పద్ధతిలో పెంచాలనుకుంటే ఎంచుకునే బకెట్ లేదా కుండీ తోపాటు అందులో వేసే మట్టి, మనం వేసే మొక్కకు కాసే పళ్లని తట్టుకునే సామర్థ్యం తదితరాలు ఉన్నవాటినే ఎంచుకోవడం అత్యంత కీలకం. స్థలం సమస్యతో ఇబ్బంది పడే వాళ్లకు, ఇంటి పంటలంటే ఇష్టపడే వారికి ఈ విధానం చాలా బాగా ఉపయోగపడుతుంది. సులభంగా బాల్కనీల్లోనూ కిటికీల్లోనూ తలకిందులుగా టమాట మొక్కలను పెంచడమే గాక సమృద్ధిగా టమోటాలను పెంచగలుగుతారు కూడా. (చదవండి: ఇది గ్రీన్ పాలిటిక్స్ యుగం! రాజకీయ పార్టీలే గ్రీన్ పార్టీలుగా..!) -
రైతన్నలకు మరింత ఆదాయం
సాక్షి, అమరావతి: రాష్ట్రానికే ప్రత్యేకమైన ప్రసిద్ధి చెందిన ఆహార ఉత్పత్తులకు భౌగోళిక గుర్తింపు (జీఐ) తేవడంతో పాటు రైతులకు గిట్టుబాటు ధర, అదనపు విలువ చేకూర్చడం ద్వారా వారు మరింత ఆదాయం పొందేలా ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ మరో కీలక ముందడుగు వేసింది. ఒకేసారి మూడు సంస్థలతో గురువారం మౌలిక అవగాహన ఒప్పందాలు (ఎంవోయూలు) కుదుర్చుకుంది. సచివాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఏపీ సహకార, వ్యవసాయ, ఆహార శుద్ధి శాఖల ముఖ్య కార్యదర్శి చిరంజీవి చౌదరి సమక్షంలో ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ (ఏపీజీబీ), రహేజా సోలార్ ఫుడ్ ప్రాసెసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ (ఆర్ఎస్ఎఫ్పీఎల్), దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాలతో ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ ఎంవోయూలు చేసుకుంది. ఈ మేరకు ఆయా సంస్థల ఉన్నతాధికారులతో కలిసి సొసైటీ సీఈవో ఎల్.శ్రీధర్ రెడ్డి ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. భౌగోళిక గుర్తింపు కోసం సాంకేతిక సహకారం రాష్ట్రానికే ప్రత్యేకమైన ఆహార ఉత్పత్తులకు బ్రాండింగ్, భౌగోళిక గుర్తింపు (జీఐ) తీసుకొచ్చేందుకు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు దామోదరం సంజీవయ్య న్యాయ విశ్వవిద్యాలయం ముందుకొచ్చింది. ఇప్పటికే ఆత్రేయపురం పూతరేకులకు జీఐ ట్యాగ్ వచ్చింది. ఇదే రీతిలో రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో 32కు పైగా ఆహార ఉత్పత్తులకు భౌగోళిక గుర్తింపు కోసం ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ చేస్తున్న కృషికి వర్సిటీ సాంకేతిక సహకారం అందించనుంది. తద్వారా రాష్ట్రానికే ప్రత్యేకమైన ఆయా గొప్ప వంటల వారసత్వాన్ని సంరక్షించడంతోపాటు వాటిని భవిష్యత్ తరాలకు అందించేందుకు తగు రీతిలో ప్రచారం చేయడానికి వీలవుతుంది. రైతుల ఉత్పత్తుల కొనుగోలుకు.. సోలార్ డీ హైడ్రేషన్ యూనిట్లకు అవసరమైన సాంకేతికతను ఇప్పటివరకు మహారాష్ట్రకు చెందిన ఎస్4ఎస్ అనే సంస్థ అందిస్తోంది. ఈ యూనిట్ల ద్వారా ఉత్పత్తి చేసే ఉల్లి, టమాటా ఫ్లేక్స్ (ముక్కలు)ను కిలో రూ.2.50 చొప్పున కొనుగోలు చేస్తూ వారికి అండగా నిలుస్తోంది. అదే రీతిలో రాయలసీమ జిల్లాల్లో ఏర్పాటవుతున్న మిగిలిన యూనిట్లకు సాంకేతిక సహకారం, మద్దతు అందించేందుకు మధ్యప్రదేశ్‌కు చెందిన రహేజా సోలార్ ఫుడ్స్ ప్రాసెసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ముందుకొచ్చింది. కనీసం 2 వేల యూనిట్లకు సహకారం అందిస్తుంది. ఉల్లి, టమాటాలను సమకూర్చడంతో పాటు రైతుల నుంచి ఉల్లి, టమాటా ఫ్లేక్స్‌ను తిరిగి కొనుగోలు చేస్తుంది. ఏపీజీబీ చైర్మన్ రాకేశ్ కష్యప్, జీఎం పీఆర్ పడ్గెటా్వర్, దామోదరం సంజీవయ్య న్యాయ విశ్వవిద్యాలయం రిజి్రస్టార్ జోగినాయుడు, రహేజా సంస్థ వైస్ చైర్మన్ సౌరబ్, ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ స్టేట్ లీడ్ సుభాష్, మేనేజర్ శ్రీనాథ్‌రెడ్డి పాల్గొన్నారు. సోలార్ డీహైడ్రేషన్ యూనిట్లకు ఆర్థిక చేయూత టమాటా, ఉల్లి పంటలకు అదనపు విలువ చేకూర్చడం ద్వారా రైతులకు గిట్టుబాటు ధర, పొదుపు సంఘాలకు జీవనోపాధి కల్పించడమే లక్ష్యంగా రాయలసీమ, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ప్రత్యేకంగా 5 వేల సోలార్ డీహైడ్రేషన్ యూనిట్ల ఏర్పాటు లక్ష్యంగా సొసైటీ ముందుకెళ్తోంది. ఇప్పటికే కర్నూలు జిల్లాలో పైలట్ ప్రాజెక్టు విజయవంతం కావడంతో సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు మిగిలిన జిల్లాల్లో కూడా ఈ ప్రాజెక్టును విస్తరించేందుకు కార్యాచరణ సిద్ధం చేసింది. ఇందుకు అవసరమైన ఆర్థిక చేయూతనిచ్చేందుకు ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ (ఏపీజీబీ) ముందుకొచ్చింది. సొసైటీతో చేసుకున్న ఒప్పందం ప్రకారం.. ఆయా జిల్లాల్లో ఎంపిక చేసిన లబి్ధదారులకు రూ.10 లక్షల వరకు ఎలాంటి పూచీకత్తు లేకుండా రుణాలను బ్యాంక్ అందించనుంది. యూనిట్ మొత్తంలో 35 శాతాన్ని సొసైటీ సబ్సిడీ రూపంలో అందిస్తుంది. 9 శాతం వడ్డీతో మంజూరు చేసే ఈ రుణాలపై అగ్రి ఇన్ఫ్రా ఫండ్ కింద అదనంగా మరో 3 శాతం వడ్డీ రాయితీ కూడా లభిస్తుంది. -
వెజి‘ట్రబుల్’కు విరుగుడు.. టమాటా, ఉల్లిపాయల ప్రాసెసింగ్‌తో దీర్ఘకాలం నిల్వ
-పల్లా రవికిరణ్, ఏపీ సెంట్రల్ డెస్క్ నిన్నటిదాకా వినియోగదారులను ఏడిపించిన టమాటా నేడు రైతన్నలతో కన్నీళ్లు పెట్టిస్తోంది! టమాటాతో పోటీగా ఎగబాకిన పచ్చి మిర్చి ధరలు సగానికిపైగా పతనమయ్యాయి! ఈదఫా ‘ఉల్లిపాయ’ బాంబు పేలటానికి సిద్ధమైంది!! సామాన్యుడిని ఠారెత్తించిన కూరగాయల ధరలు ఇప్పుడు దిగి వచ్చినా కొద్ది నెలలు దేశ ప్రజలకు చుక్కలు చూపించాయి. ఇప్పుడు ఎక్కడ చూసినా టమాటాలే. ఐదారు రోజులకు మించి నిల్వ ఉంటే పాడవుతాయి. అకాల వర్షాలకు ఉల్లిపాయలు కుళ్లిపోతాయి. చాలాసార్లు కనీస ఖర్చులు కూడా దక్కకపోవడంతో టమాటాలను రోడ్లపై పారబోసి నిరసన తెలిపిన ఘటనలున్నాయి. అయితే అనావృష్టి లేదంటే అతివృష్టి..! మరి ఏం చేయాలి? సీజన్లో సద్వినియోగం.. వాతావరణ మార్పుల కారణంగా అకాల వర్షాలతో ఉద్యాన పంటలకు తీవ్ర నష్టం వాటిల్లడం నిజమే అసలు కారణం సరైన నిల్వ, ప్రాసెసింగ్ సదుపాయాలు లేకపోవడమే. వరద వచ్చినప్పుడే ఒడిసి పట్టుకోవాలి! టమాటా, ఉల్లి లాంటివి కూడా సీజన్లో విరివిగా, చౌకగా లభ్యమవుతాయి. మరి సమృద్ధిగా దొరికినప్పుడు సేకరించుకుని ప్రాసెస్ చేసి వాడుకుంటే? రాష్ట్రంలో ఇప్పుడు అదే ప్రక్రియ మొదలైంది. సరైన పద్ధతిలో నిల్వ చేయడం, నాణ్యతను సంరక్షించడం కీలకం. అందుకే ప్రాసెసింగ్ యూనిట్లను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. గ్రామ స్థాయిలో పొదుపు మహిళల ద్వారా వీటిని ఏర్పాటు చేయడంతోపాటు భారీ ప్లాంట్లపై కూడా దృష్టి పెట్టింది. ఒకవైపు ధరలు పతనమైనప్పుడు మార్కెట్ జోక్యంతో అన్నదాతలను ఆదుకుంటూనే మరోవైపు వీటిని అందుబాటులోకి తెస్తోంది. దీనివల్ల ధరల మంటకు, దళారుల దందాకు తెర పడుతుంది! ఈ ఫొటోలో కనిపిస్తున్న మహిళ పేరు షేక్‌జుబేదా బీ. పొదుపు సంఘంలో సభ్యురాలు. కర్నూలు జిల్లా కల్లూరు మండలం తడకనపల్లెకు చెందిన ఈమె ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ సహకారంతో టమాటా, ఉల్లిపాయల ప్రాసెసింగ్, డ్రయ్యింగ్ ద్వారా నెలకు రూ.18,000 వరకు ఆదాయాన్ని పొందుతోంది. బ్యాంకు లోన్‌తో యంత్రాలు, షెడ్‌ను సమకూర్చుకోగా సబ్సిడీగా రూ.70,000 అందాయి. తన వాటాగా రూ.20 వేలు జత చేసింది. సోలార్ డ్రయ్యర్లు, డీ హైడ్రేషన్ యూనిట్లతో రోజూ 200 కిలోల కూరగాయలను ఇంట్లోనే ప్రాసెసింగ్ చేస్తోంది. వీటిని సరఫరా చేస్తూన్న ‘ఎస్4 ఎస్’ అనే కంపెనీ ప్రాసెసింగ్ అనంతరం తిరిగి ఆమె వద్ద నుంచి సేకరిస్తోంది. 50 కిలోలు ప్రాసెసింగ్ చేసినందుకు రూ.125 చెల్లిస్తుండగా కరెంట్ చార్జీల కింద మరో రూ.20 చొప్పున కంపెనీ ఇస్తోంది. ప్రతి నెలా రూ.4,000 బ్యాంకు కిస్తీ పోనూ నికరంగా నెలకు రూ.14,000 వరకు ఆదాయం లభిస్తోంది. డ్రయ్యర్లతో డీ హైడ్రేషన్ యూనిట్లు.. ఉద్యాన రైతులకు గిట్టుబాటు ధర, మహిళలకు స్వయం ఉపాధి కల్పించడం లక్ష్యంగా సోలార్ డ్రయ్యర్లతో కూడిన డీ హైడ్రేషన్ యూనిట్ల ఏర్పాటును రాష్ట్ర ప్రభుత్వం పెద్దఎత్తున ప్రోత్సహిస్తోంది. పైలట్ ప్రాజెక్టు కింద కర్నూలు జిల్లా తడకనపల్లిలో గతేడాది ఆగస్టులో 35 శాతం సబ్సిడీతో పది యూనిట్లు ఏర్పాటు కాగా కొద్ది రోజుల్లోనే మరిన్ని అందుబాటులోకి వచ్చాయి. రైతులకు కనీస మద్దతు ధర చెల్లిస్తూ ఇప్పటి వరకు 1,200 టన్నుల టమాటా, ఉల్లిని ప్రాసెస్ చేశారు. ఈ ఏడాది జూలైలో మరో వంద యూనిట్లను ప్రారంభించారు. పైలెట్ ప్రాజెక్టు విజయవంతం కావడంతో రాష్ట్రవ్యాప్తంగా రూ.84 కోట్లతో 5 వేల యూనిట్ల ఏర్పాటుకు బ్యాంక్ ఆఫ్ బరోడాతో ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ అవగాహన ఒప్పందం చేసుకుంది. వీటిలో 3,500 యూనిట్లను రాయలసీమ జిల్లాల్లోనే నెలకొల్పుతున్నారు. ప్రతి 100 సోలార్ యూనిట్లను ఒక క్లసర్ కిందకు తెచ్చి రైతుల నుంచి రోజూ 20 టన్నులు టమాటా, ఉల్లిని సేకరించి రెండు టన్నుల ఫ్లేక్స్ తయారు చేయనున్నారు. కర్నూలు జిల్లా ఆదోని ప్రాంతంలో ఇప్పటికే 900 మంది లబ్ధిదారులను గుర్తించారు. సెప్టెంబరు నాటికి 500 యూనిట్ల ఏర్పాటు లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. అనంతపురం జిల్లాలోని తాడిపత్రి, కళ్యాణదుర్గం, సత్యసాయి జిల్లా తనకల్లు ప్రాంతాల్లోనూ లబ్ధిదారులను గుర్తిస్తున్నారు. పత్తికొండలో టమాటా ప్రాసెసింగ్ యూనిట్ కర్నూలు జిల్లా పత్తికొండలో రూ.10 కోట్లతో భారీ స్థాయిలో టమాటా ప్రాసెసింగ్ యూనిట్ నిర్మాణ పనులకు త్వరలో భూమి పూజ జరగనుంది. ఈ యూనిట్లో స్టోరేజీ, సార్టింగ్, గ్రేడింగ్ సదుపాయాలు కల్పిస్తున్నారు. పల్పింగ్ లైన్, డీ హైడ్రేషన్ లైన్ ఉంటాయి. కెచప్, జామ్, గ్రేవీ లాంటి అదనపు విలువతో కూడిన ఉత్పత్తులు తయారవుతాయి. రాజంపేటలో రూ.294.92 కోట్లతో, నంద్యాలలో రూ.165.32 కోట్లతో ఇంటిగ్రేటెడ్ గుజ్జు, ఐక్యూఎఫ్ (టమాటా) పరిశ్రమలను ఏర్పాటు చేస్తున్నారు. రైతన్నకు ‘మద్దతు’.. మహిళలకు ఉపాధి ఉల్లి, టమాటా రైతులకు ఏడాది పొడవునా గిట్టుబాటు ధరలతో పాటు పొదుపు సంఘాల మహిళలకు స్వయం ఉపాధి కల్పన లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా సోలార్ డీ హైడ్రేషన్ యూనిట్ల ఏర్పాటును ప్రోత్సహిస్తున్నాం. కర్నూలు జిల్లాలో పైలట్ ప్రాజెక్టు కింద నెలకొల్పిన 100 యూనిట్లు విజయవంతం కావడంతో సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.84 కోట్ల అంచనాతో 5 వేల యూనిట్లను ఏర్పాటు చేస్తున్నాం. ఈమేరకు బ్యాంక్ ఆఫ్ బరోడాతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాం. ఒక్కో యూనిట్ రూ.1.68 లక్షల అంచనాతో ఏర్పాటు చేస్తున్నాం. లబ్ధిదారుల గుర్తింపు చురుగ్గా సాగుతోంది. – ఎల్.శ్రీధర్‌రెడ్డి, సీఈవో, ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ -
భారీగా పతనమైన టమాటా రేటు
సాక్షి, అన్నమయ్య: కొండెక్కి రేట్లతో సామాన్యుడ్ని నెలలపాటు ముప్పుతిప్పలు పెట్టిన టమాటా ధర.. అమాంతం పడిపోయింది. ఒకానొక టైంలో కేజీ 300 దాకా చేరుకుని చుక్కలు చూపించింది. అయితే ఊహించినట్లుగా.. ధరలు పడిపోతూ వస్తున్నాయి. ఈ క్రమంలో.. ఒక్కసారిగా ధరలు నేలకు పడిపోయాయి. నిత్యావసర సరకుల్లో ఒకటైన టమాటా ధరలు సాధారణ స్థాయికి చేరుకున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో కిలో టమాటా ధర రూ. 50 లోపుకి చేరుకుంది. చాలా చోట్ల కేజీకి రూ. 15, రూ. 20 ఇలా దొరుకుతోంది కూడా. హైదరాబాద్‌లోనూ కేజీ రూ. 20 దాకా పలుకుతోంది. అయితే.. టమాట మార్కెట్ యార్డ్ మదనపల్లెలో(అన్నమయ్య జిల్లా ఏపీ) కేజీ టమాట రూ.9కి పలుకుతోంది. గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతుల ఆవేదన చెందుతున్నారు. సరఫరాలో అంతరాయం కలగడం, టమాటాను ఎక్కువగా సాగుచేసే ప్రాంతాల్లో ప్రతికూల వాతావరణం ఏర్పడటంతో ఆ మధ్య అన్ని ప్రధాన నగరాల్లో టమాటాలు సెంచరీని దాటేసిన సంగతి తెలిసిందే. -
టమాటా ఉత్పత్తిలో రాష్ట్రానికి మూడో స్థానం
సాక్షి, అమరావతి: దేశంలో టమాటా ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో నిలిచింది. రాష్ట్రంలో 2022–23లో 23.37 లక్షల మెట్రిక్ టన్నుల టమాటాలు ఉత్పత్తి అయ్యాయి. దీంతో దేశం మొత్తం టమాటా ఉత్పత్తిలో రాష్ట్రం వాటా 11.30 శాతంగా నమోదైంది. ఈ మేరకు ఇటీవల టమాటా ధరల పెరుగుదలకు కారణాలు, సమస్యలపై నాబార్డు మంగళవారం నివేదికను విడుదల చేసింది. ప్రధానంగా దేశంలో టమాటాలు ఎక్కువగా పండించే రాష్ట్రాల్లో 2022–23లో ఉత్పత్తి భారీగా తగ్గిందని నివేదిక తెలిపింది. అయితే ఇందుకు భిన్నంగా ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం అంతకు ముందు ఆర్థిక ఏడాదితో పోలి్చతే 2022–23లో 1.50 శాతం వృద్ధి నమోదైందని వెల్లడించింది. ఈ రాష్ట్రాల్లో ఉత్పత్తి తగ్గడమే కారణం.. ప్రధానంగా టమాల ధరల పెరుగుదలకు గుజరాత్, తమిళనాడు, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రల్లో ఉత్పత్తి గణనీయంగా తగ్గడమేనని నాబార్డు తెలిపింది. దీంతో పాటు మేలో అకాల వర్షాలు, జూన్‌లో వర్షాలు, వడగండ్ల వానలకు పంట దెబ్బతిందని వివరించింది. కర్ణాటకలో పంట ప్రధాన ప్రాంతాల్లో మార్చి, ఏప్రిల్, మే నెలల్లో వడగళ్ల వానలకు, జూన్‌లో భారీ వర్షాలకు.. వేసిన పంటలో 70 శాతం నాశనమైందని పేర్కొంది. అలాగే మహారాష్ట్రలో ఈ ఏడాది వాతావరణ అననుకూల పరిస్థితులు ఉండటంతో పెద్ద ఎత్తున పంట దెబ్బతిందని వెల్లడించింది. దేశంలో టమాటా ఉత్పత్తి 2021–22లో 206.9 లక్షల టన్నులు ఉండగా ఇది 2022–23లో 206.2 లక్షల టన్నులకు తగ్గిందని తెలిపింది. దీంతో ఈ ఏడాది జూలైలో దేశంలో టమాటా ధరలు మూడు రెట్లు పెరిగాయని వివరించింది. ఈ ఏడాది జూన్‌లో కిలో టమాటా దాదాపు రూ.30 ఉండగా జూలై చివరి నాటికి రిటైల్ మార్కెట్లో కిలో రూ.130కి పెరిగిందని పేర్కొంది. ఈ ఏడాది ఆగస్టు 10న హోల్‌సేల్‌లో కిలో రూ.106.91 ఉండగా రిటైల్ మార్కెట్లో రూ.131.69 ఉందని వెల్లడించింది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
విద్య, వైద్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు
డ్రైవర్ నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి
ప్రభుత్వ వైద్యశాలల్లో మెరుగైన వైద్యం
చంద్రబాబూ 14 ఏళ్లు ఏం చేశావు?
నీట్‌కు ఏర్పాట్లు పూర్తి
‘పోస్టల్ బ్యాలెట్’ను వినియోగించుకోండి
పార్లమెంట్లో గళం వినిపిస్తా..
స్వర్ణకవచాలంకరణలో రామయ్య
హామీలపై ఆశలు..
నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
తప్పక చదవండి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్‌కప్‌కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్‌గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్‌లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
Advertisement