breaking news
Tales
-
ఆసై దోసై అప్పళం వడై..
ప్రతి ఇంటిలో మనం మరచి΄ోయిన ఒక నిధి ఉంటుంది. కొద్దిమందికి ఆ నిధి అకస్మాత్తుగా గుర్తుకు వచ్చి వెలుగులోకి తెస్తారు. ఆ వెలుగులు పిల్లల ప్రపంచంలోకి వస్తే ఎంత బాగుంటుంది? ఎంత బాగుంటాయో చెబుతున్నాయి అమ్మ చెప్పిన కథలు. ‘ఫోక్టేల్స్ ఫ్రమ్ తమిళనాడు’ పేరుతో వచ్చిన పుస్తకం సోషల్ మీడియాలో ఎట్రాక్షన్గా మారింది. ‘నాకు కూడా మా అమ్మ చెప్పిన కథలు గుర్తుకు వస్తున్నాయి’ అంటూ కలం పడుతున్నారు నెటిజనులలో కొందరు...చిన్నప్పుడు తల్లి తనకు చెప్పిన జానపద కథలను ఈతరం పిల్లలకు ‘ఫోక్ టేల్స్ ఫ్రమ్ తమిళనాడు’ పేరుతో చేరువ చేస్తున్నారు నారాయణ్.అమ్మ చెప్పిన ఆ కథలు ఎలా ఉంటాయి?ఏనుగు పక్కింటి అబ్బాయిలా పిల్లలతో ఫ్రెండ్లీగా మాట్లాడుతుంది.పులి గాండ్రిస్తూనే ‘హాయ్’ చెబుతుంది.గర్జిస్తూనే సింహం మన యోగక్షేమాలు అడుగుతుంది.ఒక్కటా రెండా... ఎన్నెన్ని చిత్రవిచిత్రాలో! ఈ పుస్తకంలో 21 కథలు పొట్ట చెక్కలయ్యేలా నవ్విస్తాయి. నైతిక విలువలు అంటే ఏమిటో చెప్పకనే చెబుతాయి. తెల్లగుర్రంపై ఎక్కించి మేఘాలపై స్వారీ చేయిస్తాయి.పనిదొంగ పక్షులుఅనగనగా ఒక కోడి. ఆ కోడి పిండి కలిపి చపాతీలు చేస్తుండగా, దాని పొరుగున ఉన్న కాకి, పిచ్చుక, బాతు, చిలకలాంటివి కోడికి సహాయం చేయకుండా ఏవో సాకులు చెప్పి తప్పించుకుంటాయి.అయితే, వేడి వేడి చపాతీలు రెడీ అయిన వెంటనే...‘మాకు కూడా’ అంటూ ఆత్రుతగా కోడి చుట్టూ చేరతాయి. అప్పుడు కోడి నోటి నుండి...‘ఆసై దోసై అప్పళం వడై’ అనే పాట వినిపిస్తుంది. పిల్లలకు తెగ నవ్వొస్తుంది.ఇక ‘కా...కా’ కథ విషయానికి వస్తే, ఒక సోమరి కాకి తన ఆహారాన్ని వెదుక్కోవడానికి బద్దకించి, పిచ్చుకల నుండి దొంగిలిస్తుంటుంది. ఆహారాన్ని దొంగిలించడంలో అపారమైన తెలివితేటలు చూపే కాకి అత్యంత సులువుగా ఉచ్చులో పడుతుంటుంది. తన మూర్ఖత్వాన్ని చాటుకుంటుంది.పాటల కథలు!అమ్మ చెప్పిన కథలలో పాటలు, కవితలు ఉండడం మరో విశేషం. చందమామను పిలిచే పాట ‘నిల నిల ఓడి వా’ ను పిల్లలు గట్టిగా పాడుకుంటారు. ఈ కథలు పిల్లలకు తమిళ సాంస్కృతిక విశేషాలు, ఆహారపు అలవాట్ల గురించి కూడా తెలియజేస్తాయి.‘మా అమ్మ చెప్పే కథలు వింటూ పెరిగాను. ఈ కథలను నేను మరెక్కడా వినలేదు. తన ముందుతరాల నుండి అమ్మకవి వారసత్వ సంపదగా వచ్చాయి. సంగీతంపై నాకు అవగాహన ఉన్నప్పటికీ అమ్మకు ఉన్నంత లోతైన అవగాహన లేదు. తాను కథ చెప్పే విధానానికి సంగీతం బలం అయింది. కథలను మరింత ఆసక్తికరంగా వినేలా చేసింది’ అంటారు నారాయణ్.కథాచిత్ర ప్రపంచంఅందమైన కథలకు, అద్భుతమైన చిత్రాలు తోడైతే పిల్లలకు ఎంత సంతోషం కలిగిసాయో ఈ పుస్తకంలోని కనువిందు చేసే కలర్ పెయింట్స్ సాక్ష్యం. జానపద కథలు పుస్తకరూపంలోకి వచ్చినప్పుడు ఎన్నో రకాల మార్పులకు గురవుతుంటాయి.‘అసలు మార్పులు అవసరమా?’ అనే ప్రశ్నకు నారాయణ్ ఇచ్చే జవాబు...‘అవసరమే లేదు’ ఎందుకంటే జానపద కథలు ఊహల ద్వారానే పాఠకులతో అనుసంధానం అవుతాయి.‘కొన్ని విషయాలు శాశ్వతమైనవి. ఊహాలోకంలో విహరించాలనే మన ప్రేమ కూడా అందులో ఒకటి. ప్రతీదాన్ని సమకాలీకరించాల్సిన అవసరం లేదు. జానపద కథలు యథాతథ రూపంలోనే బాగుంటాయి’ అంటున్నారు నారాయణ్.- సృజనఇవి చదవండి: పిల్లల్లో హింసాత్మక ఆలోచనలకు అసలు కారణాలేంటో తెలుసా? -
ఆది పురుష్ కోసం కృతి సనాన్ స్పెషల్ శాలువా దీని ప్రత్యేకతలు తెలిస్తే ఔరా అంటారు..!
-
సాహితీ విహారి
విహారి.. తెలుగు సాహితీ రంగంలో సుప్రసిద్ధమైన కలం. ఆయన కేవలం కథా విహారి మాత్రమే కాదు. పన్నెండు కథా సంకలనాలతో ‘తెలుగు కథ తేజోరేఖలు’, ‘కథా విహారం’, ‘పరిచయాలు పరామర్శలు’ శీర్షికలతో విమర్శకుడి గానూ ప్రసిద్ధులు. 75 ఏళ్ల వయసు లోనూ కథారచనను యజ్ఞంలా చేస్తున్నారు. ఆయన సాహితీ షష్టిపూర్తి ఇటీవల విజయవాడలో జరిగింది. ఈ సందర్భంగా ఫోన్లో ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ. – తెనాలి మాది తెనాలి. తల్లిదండ్రులు శ్రీదేవి, జొన్నలగడ్డ మేదాదక్షిణామూర్తి. 1941 అక్టోబరు 15న జన్మించాను. నా అసలు పేరు సత్యనారాయణమూర్తి. కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా నా చదువు ఎస్ఎస్ఎల్సీతోనే ఆగిపోయింది. చిన్ననాటే పేదరికంలోని కష్టాలను అనుభవించాను. చిరుద్యోగంతో ఆరంభించి, ప్రైవేట్గా చదువుకుంటూ డిగ్రీలు, రచయితగా గుర్తింపునూ సాధించుకోగలిగాను. మా నాన్నగారికి భర్మాషెల్ అనే ప్రముఖ కంపెనీలో ఉద్యోగం. ముక్కుసూటి మనిషి. ఒకానొక సందర్భంలో ఉద్యోగం వదిలేశారు. మా కుటుంబాన్ని ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయి. మేం ఏడుగురం. ఇద్దరం మగబిడ్డలం. ఐదుగురు తోబుట్టువులు ఉన్నారు. పుస్తకాలంటే పిచ్చి.. చిన్నవయసులో మచిలీపట్నంలో పనిచేసినపుడు అక్కడి సాహిత్య వాతావరణం నాకు ప్రేరణ . అప్పట్లో పుస్తకాలు పిచ్చిగా చదివేవాణ్ణి. తెనాలికి చెందిన త్రిపురనేని గోపీచంద్ కథల ప్రభావం ఎక్కువ. మధురాంతకం రాజారాం కథలూ నాకు ఆసక్తి. చుక్కాని అనే పత్రికలో ‘రాగజ్యోతి’ పేరుతో నా తొలికథ ప్రచురితమైంది. అది 1962వ సంవత్సరం. అప్పటికి జీవిత బీమా సంస్థలో చిన్న ఉద్యోగంలో ఉన్నాను. శాలివాహన అనే నా సహ ఉద్యోగితో కలిసి దాదాపు పదిహేనేళ్లు చాలా కథలు రాశాం. ఉద్యోగంలో బదిలీల కారణంగా ఆ అలవాటుకు బ్రేక్ పడింది. అదే నా కలం పేరు.. నేను కథలు కొనసాగించాను. చదువును కూడా. ఎంఏ చేశా. ఇన్సూరెన్సులో ఫెలోషిప్, హ్యూమన్ రిసోర్సెస్ మేనేజ్మెంట్, జర్నలిజం వంటి ఇతర అంశాల్లో డిప్లొమాలు సాధించాను. జీవిత బీమా సంస్థలో హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ నుంచి జనరల్ మేనేజర్గా 2002లో రిటైరయ్యా. రచనా వ్యాసంగం కొనసాగిస్తూ 12 కథాసంపుటాలు, ఏడు నవలలు, ఆ విమర్శనాత్మకమైన వ్యాస సంపుటాలు, ఒక సాహిత్య కదంబం, ఐదు కవితా సంపుటాలు, ఒక దీర్ఘ కథాకావ్యం – పుస్తకాల రూపంలో వచ్చాయి. తెలుగులోని అన్ని ప్రసిద్ధ పత్రికల్లోనూ 300కు పైగా నా రచనలు ప్రచురితమయ్యాయి. చిన్నతనంలో భాగవతంలోని పద్యాలను చదివేటపుడు, ‘హారికి నందగోకుల విహారికి’ అన్న పంక్తుల్లోని విహారి పదం నాకెంతో నచ్చింది. అదే నా కలం పేరైంది. నేటి సాహిత్యం.. ఆధునిక జీవితంలోని పరిణామాలను సరిగ్గా పట్టించుకోలేకపోతున్నారు. ప్రపంచీకరణ పరిణామం అనివార్యం. దాన్ని వెనక్కి తిప్పలేం. వీటిని సానుకూలంగా, సమదృష్టితో కాకుండా కొందరు వ్యతిరేక దృష్టితో చూస్తున్నారు. ప్రపంచీకరణ అవకాశాలను అందిపుచ్చుకుంటూనే మరోవైపు వ్యతిరేకతతో రాస్తున్నారు. అందులో భాగంగా తెలుగులో గతాన్ని వర్తమానంగా భావిస్తూ రాస్తున్నారు. కొందరు ఏహ్యభావంతో రాస్తుంటే మరికొందరు ఏ విలువలు ప్రతిపాదిస్తున్నారో? ఎందుకు రాస్తున్నారో తెలియని గందరగోళంలో పడుతున్నారు. మన జీవితాలను సాహిత్యంలో సమకాలీనం చేస్తూ రాయాలి. అలాగే మూస ఇతివృత్తాల నుంచి బయటపడాలనేది నా అభిప్రాయం. పురస్కారాలు.. సత్కారాలు ఎన్నో.. స్పృహ, గోరంతదీపం, గుండెలో కోయిల, అమ్మపేరు చీకటి, కొత్తనీరు వంటి కథా సంపుటాలు, చలనం, కలంకన్ను కవితా సంపుటాలు, సమీక్ష, కథాకృతి వీక్షణం అనే వ్యాస సంపుటాలు విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి. ‘పళ్లచక్రం’ కథా సంపుటికి రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. దీపావళి కథల పోటీలో ఆంధ్రపత్రిక నుంచి వరుసగా ఐదేళ్లు ఉత్తమ కథ బహుమతి అందుకున్నా. పురస్కారాలు, సత్కారాలు ఎన్నో.. వివిధ పత్రికల్లో పరిచయాలు– పరామర్శలు, బతుకు గీతలు, కథావిహారం వంటి శీర్షికలనూ నిర్వహించా. నా రచనలపై ఉస్మానియా, ఇతర యూనివర్శిటీల్లో పరిశోధనలు జరిగాయి. రామాయణంపై జరుగుతున్నాయి.


