ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తింది
బ్యాంకాక్ : దేవుడు ఇచ్చిన లోపాలు కొందరి పాలిట వరంగా మారుతుంటాయి. జట్టు సుందరిగా పేరొందిన సుపాత్ర నాటీ సుసుఫాన్ (17) కూడా ఈ కోవలోనే వస్తారు. ఆంబ్రోస్ సిండ్రోమ్ అనే వ్యాధి ఆమె శరీరం మొత్తం జుట్టు పెరిగేలా చేసింది.
వ్యాధి కారణంగా సుసుఫాన్ ముఖం కూడా జుట్టుతో నిండిపోయింది. 2010లో ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ జుట్టు కలిగిన వ్యక్తిగా సుసుఫాన్ గుర్తింపు పొందారు. గిన్నిస్ బుక్ రికార్డుల్లోకి కూడా ఎక్కారు.
అయితే, ఏడేళ్ల అనంతరం సుసుఫాన్ తన సోషల్మీడియా అకౌంట్లో చేసిన పోస్టు ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తింది.
తన జీవిత భాగస్వామిని కలుసుకున్నానని, పెళ్లి చేసుకున్నానని సుసుఫాన్ చేసిన పోస్టు సారాంశం. ‘తను నా మొదటి లవ్ కాకపోవచ్చు. కానీ నా రియల్ లవ్ మాత్రం తనే’ అని రాసుకొచ్చారు ఆమె. ఆంబ్రోస్ సిండ్రోమ్ వ్యాధి జెనెటిక్ లోపం వల్ల అత్యంత అరుదుగా వస్తుంది. ఇప్పటివరకూ ఈ వ్యాధి వచ్చిన వారిని వేళ్లపై లెక్కించొచ్చు.