breaking news
Neurosurgeons
-
ఇన్ బ్రెయిన్
మెదడు పనితీరుపై విశ్లేషణ, కార్యాచరణ సమాచారాన్ని అందించే సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేసి, మానసిక వైద్యులకు ఆధునాతన బ్రెయిన్ ఇమేజింగ్–బేస్డ్ ఇన్సైట్స్ను అందించే న్యూరో–ఇన్ఫార్మటిక్స్ ప్లాట్‌ఫామ్ ‘బ్రెయిన్ సైట్ ఏఐ’ నిర్మించారు రింఝిమ్ అగర్వాల్, ఇమ్మాన్యుయేల్...గత సంవత్సరం ఇండియా సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్ట్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడిఎస్సీవో) నుంచి ‘సాఫ్ట్వేర్–యాజ్–ఎ మెడికల్ డివైజ్’ సర్టిఫికెట్ పొందడం ద్వారా ‘బ్రెయిన్‌సైట్ ఏఐ’ వాణిజ్యపరంగా కీలకమైన మైలురాయిని చేరింది. ఈ సంస్థకు ఇమ్మాన్యుయేల్ సీయివో, రింఝిమ్ అగర్వాల్ సీటీవో.నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరోసైన్సెస్ నుంచి రింజిమ్ అగర్వాల్ పీహెచ్డీ చేసింది. ఇమ్మాన్యుయల్ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుంచి ఎంబీఏ చేసింది. హెల్త్ కేర్ మేనేజ్మెంట్, టెక్నాలజీ అండ్ పాలసీలలో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 15 సంవత్సరాల అనుభవాన్ని సంపాదించింది. ఆపరేటింగ్ సిస్టమ్ డిజైన్, పబ్లిక్ హెల్త్ అండ్ హెల్త్ కేర్ బిజినెస్‌లో ఆమెకు అపార అనుభవం ఉంది.‘సీడిఎస్సీవో లైసెన్స్ మాకు వాణిజ్యపరంగా ఉపయోగపడుతుంది. ఈ సంవత్సరం మా ఆదాయాన్ని పెంచుకోవడంపై దృష్టి పెట్టాం. మా ప్రాడక్స్›్ట వంద ఆస్పత్రులకు చేరువ కావాలనేది మా లక్ష్యం’ అంటుంది ఇమ్మాన్యుయేల్.‘ఆసుపత్రులలో అత్యంత సాంకేతిక పరిజ్ఞానం ఉన్న వైద్యులలో న్యూరోసర్జన్లు ఒకరు. మా సాంకేతికత మెదడుకు సంబంధించిన నిర్మాణాత్మక అంశాలకు మాత్రమే కాకుండా లాంగ్వేజ్, కాగ్నిషన్లాంటి వివిధ విధులపై కూడా ఇన్సైట్స్ను అందించగలదు. మా బ్రెయిన్‌సైట్ ఏఐ సామర్థ్యం సర్జన్లలో ఆసక్తి రేకెత్తించింది’ అంటుంది అగర్వాల్.‘బ్రెయిన్‌సైట్ ఏఐ’ అందించే సమాచారం సర్జరీల సమయంలో వైద్యులకు ఉపయోగపడుతుంది. ఉదాహరణకు ఒక కణితి... దేహంలో ఏదైనా కీలక విధులు నిర్వహించే ప్రాంతానికి చాలా దగ్గరగా ఉంటే, వైద్యులు దానిని చేరుకోవడానికి వేరే ప్రత్యామ్నాయ మార్గంలో వెళ్లడానికి వీలవుతుంది.బ్రెయిన్ ఏఐ ప్రాడక్ట్ ‘వోక్సెల్‌బాక్స్’ వేగంగా అభివృద్ధి చెందనుంది. మెదడుకు సంబంధించిన నాడీ కణాల కనెక్షన్లను మ్యాప్ చేయడానికి ‘ఫంక్షనల్ మాగ్నెటిక్ రెసోసెన్స్ ఇమేజింగ్’ (ఎఫ్ఎంఆర్ఐ) ఉపయోగ పడుతుంది. ఆ డేటాను ప్రాసెస్ చేసేందుకు ఉపయోగపడేదే ఏఐ–పవర్డ్ ప్రాడక్ట్ వోక్సెల్‌బాక్స్. రోగ నిర్ధారణ, శస్త్ర చికిత్సలను ప్లాన్ చేయడంలోనూ, చికిత్సను పర్యవేక్షించడంలో సహాయపడేందుకు వీలైన బ్రెయిన్ మ్యాప్స్‌ను తయారు చేయడంలో ‘వోక్సెల్ బాక్స్’ ఉపయోగపడుతుంది.హెల్త్–టెక్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా విజయం సాధించిన రింఝిమ్ అగర్వాల్, ఇమ్మాన్యుయేల్ ‘స్నోడ్రాప్’ అనే పేషెంట్ కేర్ యాప్‌ను కూడా అభివృద్ధి చేశారు. పేషెంట్ల ప్రొఫైల్స్ రూపొందించడంలో, వైద్యప్రకియను మెరుగుపరచడంలో ఇది ఉపయోగపడుతుంది. -
మైఖెల్ జాక్సన్‌లా డాన్స్.. జర జాగ్రత్త..
చండీగఢ్ : డాన్స్ అంటే ముందుగా గుర్తొచ్చే పేరు పాప్ సంగీత రారాజు ‘మైఖెల్ జాక్సన్’. ఆయన చేసిన మూమెంట్స్‌లో ప్రముఖమైనవి ‘మూన్‌వాక్’, ‘ గ్రావిటీ డిఫైయింగ్’. నేటి తరం ఆయనలా డాన్స్ చేయాలని ముఖ్యంగా ఈ రెండిటిని చేసి అందరి మెప్పుపొందాలని చూస్తుంటారు. అయితే మైఖెల్లా డాన్స్ చేయడం ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు న్యూరోసర్జన్లు. ఆయన చేసిన డాన్స్ మూమెంట్లను అనుకరించటం ద్వారా వెన్నెముకకు గాయాలయ్యే అవకాశం ఎక్కువంటున్నారు. చండీగఢ్‌కు చెందిన ‘పోస్ట్‌గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్’ న్యూరోసర్జన్ల బృందం ఈ విషయాన్ని ధృవీకరించింది. ‘స్మూత్ క్రిమినల్’ ఆల్బమ్‌లో మైఖెల్ జాక్సన్ చేసిన 45 డిగ్రీ బెండ్ మూమెంట్ వల్ల వెన్నెముక దెబ్బ తినే అవకాశం ఉందంటున్నారు. ఎముకలను వేగవంతంగా కదిలించడం, ఒత్తిడికి గురిచేయటం ద్వారా నష్టం వాటిల్లుతుందంటున్నారు. శరీరాన్ని ఒక స్థాయికి మించి వంచడం వల్ల వెన్నెముకకు గాయాలవుతాయని తెలిపారు. వెన్నెముకకు గాయాలైన వారిలో కొంతమందికి ఫిజియోథెరపితో నయం అయితే మరికొంత మందికి శస్త్ర చికిత్స చేయాల్సి ఉంటుందంటున్నారు. ప్రమాదకరమైన భంగిమలతో కూడిన డాన్స్‌లతో శరీర అవయవాలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని హెచ్చరిస్తున్నారు న్యూరోసర్జన్లు. మెప్పు పొందాలని చూస్తే ముప్పు తప్పదంటున్నారు. -
నరుడి తోక.. కత్తిరింపు!
నాగ్‌పూర్: ఎవరిమీద అయినా కోపమొస్తే.. వాడి తోక తెగ్గోస్తా అంటా మన కోపాన్ని వ్యక్తం చేస్తాం. అయితే మహారాష్ట్రకు చెందిన ఒక బాలుడికి దురదృష్టవశాత్తూ నిజంగానే తోక మొలిచింది. నాగపూర్ డాక్టర్లు ఎంతో శ్రమించి శస్త్రచికిత్స ద్వారా దానిని తొలగించారు. అసాధారణంగా 18 అంగుళాలు పెరిగిన తోక వల్ల తీవ్రమైన నొప్పితో వచ్చిన బాలుడిని ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వైద్యులు రక్షించారు. గత వారం తీవ్రమైన నొప్పితో 18 ఏళ్ల బాలుడు ఆసుపత్రికి వస్తే సర్జరీ చేసి తోకను తీసివేశామని న్యూరోసర్జరీ విభాగం అధిపతి డాక్టర్.ప్రమోద్ గిరి అన్నారు. ‘బాలుడు పుట్టినప్పటి నుంచి తోక ఉంది. క్రమంగా పెరుగుతూపోవడం వల్ల అతడికి కూర్చోవడం, పడుకోవడానికి ఇబ్బంది కలిగింది. దీంతో తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకువచ్చారు’ అని ఆయన చెప్పారు. ఇది చాలా క్లిష్టమైన ఆపరేష¯ŒS అని, వెన్నెముకకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా సర్జరీ ముగించామని ప్రమోద్ వివరించారు. ఇప్పటివరకు ఇంత పెద్ద తోకను తొలగించడం ఇదే మొదటిసారని ప్రమోద్ విశదీకరించారు.


