breaking news
nagur (B)
-
దర్గా సాక్షిగా హిందూ జంట పెళ్లి.. ముస్లిం పెద్దల అక్షింతలు
మతాల మధ్య చిచ్చు పెట్టి తమ ప్రయోజనాలు చూసుకునే ప్రయత్నాలు ఎక్కడో జరుగుతుండొచ్చు. కానీ సామాన్యులు మాత్రం ప్రేమ, ఆప్యాయత, పరస్పర గౌరవానికే పెద్దపీట వేస్తున్నారు. తమిళనాడులోని నాగూర్ నుంచి ఇప్పుడు అలాంటి మానవీయతను చాటే ఓ అందమైన దృశ్యం వెలుగులోకి వచ్చింది. నాగపట్నం జిల్లాలోని నాగూర్ ఆండవర్ దర్గాకు ఆదివారం ఉదయం వధూవరుల కుటుంబ సభ్యులు, బంధువులు చేరుకున్నారు. అనంతరం దర్గా ప్రాంగణంలోని సన్నిధి వద్ద హిందూ సంప్రదాయం ప్రకారం వివాహ వేడుక నిర్వహించారు. వరుడు వధువు మెడలో తాళి కట్టగా.. అక్కడే ఉన్న దర్గా నిర్వాహకులు, ముస్లిం పెద్దలు, ఇరు కుటుంబాల సభ్యులు వధూవరులపై అక్షతలు చల్లి ఆశీర్వదించారు.ముస్లిం పెద్దల ఆశీర్వాదం..నాగూర్ దర్గా చైర్మన్, వారసత్వ ట్రస్టీ మొహమ్మద్ ఖలీఫా సాహిబ్ కూడా ఈ వేడుకలో పాల్గొని నూతన దంపతులను ఆశీర్వదించారు. నాగపట్నం జిల్లా చాలా కాలంగా మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తోందని ఆయన పేర్కొన్నారు. నాగూర్ దర్గాలో వివిధ మతాలకు చెందిన ప్రజలు రావడం, తమ ప్రత్యేక సందర్భాలను జరుపుకోవడం కొత్తేమీ కాదన్నారు.VIDEO | Nagapattinam: Hindu wedding held at Nagore Dargah, with people from both Hindu and Muslim communities attending the ceremony. pic.twitter.com/D2f4vQ83PH— Press Trust of India (@PTI_News) September 15, 2026వధూవరుల వివాహానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొడుతున్నాయి. దర్గా నిర్వాహకులు హిందూ జంటను ఆశీర్వదిస్తున్న దృశ్యాలు నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. నాగూర్ దర్గా భిన్న మతాల ప్రజలు కలిసి మెలిసి ఉండే సంప్రదాయానికి మరోసారి వేదికగా నిలిచిందంటూ పలువురు స్పందిస్తున్నారు. ఇలాంటి ఘటనలను భవిష్యత్ తరాలకు కూడా చూపించాల్సిన అవసరం ఉందని ఖలీఫా సాహిబ్ అభిప్రాయపడ్డారు. ఓవైపు పలువురి అభ్యంతరాలు.. మరోవైపు మతం ఏదైనా ఒకరి సంతోషంలో మరొకరు భాగస్వాములు కావచ్చనే సందేశాన్ని ఈ వివాహ వేడుక చాటిందనే కామెంట్లు నెట్టింట కనిపిస్తున్నాయి. ఇదీ చదవండి: నాగ్‌పూర్ హిట్ అండ్ రన్ కేసులో బిగ్ ట్విస్ట్ -
8వ తరగతి విద్యార్థిని కిడ్నాప్.. లైంగిక దాడి
కంగ్టి : ఓ బాలికను కిడ్నాప్ చేసి, లైంగిక దాడికి పాల్పడిన సంఘటన మెదక్ జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కంగ్టి మండలం నాగూర్(బి) లో ఈ సంఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... నాగూర్(బి) గ్రామానికి చెంది న ఓ బాలిక(14) ఎనిమిదో తరగతి చదువుతోంది. అదే పాఠశాలకు చెందిన హెచ్ఎం అంబాజీ, స్థానికులైన సంజీవ్, రవి అనే వ్యక్తులు ఈ నెల 8న పూజ అనే అమ్మాయి వెంట బాలికను బీదర్‌కు బలవంతంగా పంపారు. ఈ విషయం ఎవరికైనా చెబితే తీవ్రమైన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించడంతో ఆ బాలిక ఇంట్లో చెప్పకుండా బీదర్ వెళ్లింది. అదే రోజు రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ఇద్దరు వచ్చి మత్తు మందు ఇవ్వడంతో ఆ బాలిక స్పృహ కోల్పోయింది. దాంతో వారు ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు. ఇలా ఆ బాలికను వారంపాటు బీదర్‌లో రహస్యంగా ఉంచారు. ఈనెల 11న ఉదయం సదరు ఇద్దరు వ్యక్తులు ఆ బాలికను బీదర్ రైల్వే స్టేషన్ సమీపంలో వదిలి వెళ్లారు. అక్కడ బాలికకు తన గ్రామానికి చెందిన వారు కలవడంతో వారి సహకారంతో అదే రోజు రాత్రికి ఇంటికి చేరుకుంది. నాలుగు రోజులుగా తమ కూతురు కన్పించకపోవడంతో ఆమె తల్లి తల్లడిల్లిపోయింది. తనపై జరిగిన లైంగిక దాడి విషయాన్ని తల్లికి, బంధువులకు బాలిక శుక్రవారం వివరించింది. దీంతో బీదర్ వెళ్లాలని చెప్పిన స్థానికుల ఇంటికి బంధువులు ఈ విషయమై నిలదీయగా వారు దాడి చేసి బెదిరించారు. భయాందోళనకు గురైన తల్లి, కూతురు ఆదివారం కంగ్టి పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటకు వచ్చింది. ఆరుగురిపై నిర్భయ చట్టం కింద కేసు.. ఈ కేసుకు సంబంధించి బాలికను బెదిరించి బీదర్‌కు పంపిన యూపీఎస్ హెచ్ఎం అంబాజీ, గ్రామానికి చెందిన సంజీవ్, రవితోపాటు బీదర్‌లో లైంగిక దాడికి పాల్పడిన గుర్తుతెలియని మరో ఇద్దరిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశామని కంగ్టి ఎస్ఐ కమలాకర్ తెలిపారు. బీదర్‌కు తీసుకెళ్లిన పూజ అలియాస్ సిద్ధమ్మపై కిడ్నాప్ కేసు నమోదు చేశామన్నారు. నిందితులను త్వరలోనే అరెస్టు చేస్తామన్నారు. వైద్య పరీక్షల నిమిత్తం బాధితురాలిని సంగారెడ్డి జిల్లా ఆస్పత్రికి తరలించినట్టు చెప్పారు. కాగా నిందితుడిగా ఉన్న హెచ్ఎం అంబాజీ ఇటీవల ఉత్తమ ఉపాధ్యాయుడిగా పురస్కారం పొందాడు.


