breaking news
MRVC
-
‘సీఎస్ఎంటీ–కుర్లా’ రైల్వేప్రాజెక్టులో భారీమార్పులు
ముంబై: సెంట్రల్ రైల్వే మార్గంలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టర్మినస్ (సీఎస్ఎంటీ)–కుర్లా స్టేషన్ల మధ్య నిర్మించనున్న ఐదు, ఆరో లేన్ల ప్రాజెక్టులో స్దలం కొరత కారణంగా భారీ మార్పులు చేయాలని ముంబై రైల్వే వికాస్ కార్పొరేషన్ (ఎంఆర్వీసీ) యోచిస్తోంది. అందుకు సంబంధించిన కొత్త ప్రతిపాదన రూపొందించడం, అధ్యయనం చేసే పనిలో ఎంఆర్వీసీ అధికారులు నిమగ్నమయ్యారు.సీఎస్ఎంటీ–పరేల్ స్టేషన్ల మధ్య మసీద్బందర్, శ్యాండ్రస్ట్‌రోడ్, బైకళ, చీంచ్పోక్లీ, కరీ రోడ్ స్టేషన్లు ఉన్నాయి. కానీ ఇందులో భైకళ మినహా మిగత స్టేషన్లలో ఫాస్ట్ మార్గంలో ప్లాట్‌ఫారాలు లేవు. దీంతో కేవలం భైకళ స్టేషన్‌ను మాత్రం భూగర్భంలో నిర్మించాలని ప్రతిపాదించనున్నారు. అధ్యయనం పనులు కోసం జపాన్‌కు చెందిన ఇంజినీర్లను, అలాగే మౌలికసదుపాయాల కోసం ఓ ప్రైవేటు సంస్ధను సలహాదారులుగా నియమించింది. ఇరు కంపెనీలు సాంకేతిక సమస్యలు పరిష్కరించడం తోపాటు ఈ ప్రాజెక్టుకు అయ్యే వ్యయం, భూగర్భ మార్గం, బైకళ స్టేషన్ రూపురేఖలపై మ్యాపును రూపొందిస్తాయని అధికార వర్గాలు తెలిపాయి.జపాన్ సంస్థకు బాధ్యతలు.. సీఎస్ఎంటీ–కల్యాణ్ జంక్షన్ల మధ్య ఒకప్పుడు నాలుగు రైల్వే లేన్లు ఉండేవి. వీటిలో రెండింటిని స్లో రైళ్లకు, రెండు ఫాస్ట్ రైళ్లకు కేటాయించారు. కానీ దూరప్రాంతాల రైళ్లకు ప్రత్యేకంగా లేన్లు లేకపోవడంతో మూడు, నాలుగో ఫాస్ట్ మార్గంలోనే రాకపోకలు సాగిస్తున్నాయి. ఈ రెండు లేన్ల మీదుగా ఇటు లోకల్ రైళ్లు, అటు దూర ప్రాంతాల రైళ్లు రాకపోకలు సాగించడంవల్ల వాటిపై అదనపు భారం పడుతోంది.కొత్త రైళ్లు ప్రవేశపెట్టేందుకు అవకాశం కూడా లేకపోవడంతో దూరప్రాంతాల రైళ్లు నడిపేందుకు ప్రత్యేకంగా ఐదు, ఆరో రైల్వే లేన్లు వేయాలని సుమారు మూడు దశాబ్ధాల కిందటే ప్రతిపాదన సిద్ధమైంది. స్ధలం అనుకూలంగా ఉన్న కుర్లా–కల్యాణ్ మధ్య ఐదు, ఆరో లేన్ల పనులు పూర్తిచేశారు. దీంతో కుర్లా–కల్యాణ్ స్టేషన్ల మధ్య మూడు, నాలుగో రైల్వే లేన్లపై పడుతున్న భారం కొంతమేర తగ్గింది. కానీ సీఎస్ఎంటీ–కుర్లా స్టేషన్ల మధ్య స్ధలం లేకపోవడంతో ఈ ప్రతిపాదన గత రెండు దశాబ్ధాలుగా పెండింగులో పడిపోయింది.సీఎస్ఎంటీ–కుర్లా స్టేషన్ల మధ్య 17.5 కిలోమీటర్ల దూరం ఉంది. ఇందులో పరేల్ నుంచి కుర్లా వరకు స్ధలం కొంత అనుకూలంగా ఉంది. కానీ సీఎస్ఎంటీ–పరేల్ మధ్య స్ధలం కొరత ప్రధాన సమస్య కావడంతో ఐదు, ఆరో రైల్వే లేన్లు వేయడానికి వీలుపడలేదు. ఇప్పుడు కొత్తగా చేపట్టనున్న ప్రాజెక్టులో పెను మార్పులు చేశారు. సీఎస్ఎంటీ–పరేల్ మధ్య 7.4 కిలోమీటర్ల దూరం ఉంది.ఇదీ చదవండి: భావోద్వేగంతో బస్సుకు వీడ్కోలుఐదు, ఆరో లేన్లు వేయాలంటే పట్టాలకు అనుకుని అనేక నివాస భవనాలు, వ్యాపార సంస్ధలు, స్కూళ్లు, కాలేజీ భవనాలు అడ్డువస్తున్నాయి. వీరందరికి పునరావాసం కల్పించడం, నష్టపరిహారం చెల్లించడం రైల్వేకు పెద్ద సవాలుగా మారనుంది. కానీ ఇప్పుడు కొత్తగా నియమించిన జపాన్ ఇంజినీర్లు, ప్రైవేటు సలహదారుల సంస్ధ ఇచ్చే నివేదికపై ఈ ప్రాజెక్టు భవిత ఆదారపడి ఉంది. ఒకవేళ నివేదిక అనుకూలంగా వస్తే ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలంటే కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చవుతాయి. ఈ భారాన్ని భరించే ఆర్ధిక స్థోమత ముంబై లోకల్ రైల్వే బోర్డుకు ఉందా అనేది వేచిచూడాల్సిందే. -
‘లోకల్’ కనీస చార్జీ రూ. 10
సాక్షి, ముంబై: లోకల్ రైళ్ల కనీస చార్జీ త్వరలో రూ. 10 కానుంది. ముంబై అర్బన్ ట్రాన్స్పోర్ట్ ప్రాజెక్ట్ (ఎంయూటీపీ) ప్రాజెక్టు కోసం ముంబై రైల్వే అభివృద్ధి సంస్థ (ఎంఆర్వీసీ) గతంలో ప్రపంచ బ్యాం కు నుంచి రెండు విడతలుగా రుణం తీసుకుంది. ఈ రుణాలను తిరిగి ప్రపంచ బ్యాంకుకు చెల్లించాల్సి ఉంటుందని, ఇందుకోసం కనీస చార్జీలను పెంచాలని నిర్ణయించామని సంబంధిత అధికారి ఒకరు వెల్లడించారు. కాగా ఎంఆర్వీసీ.. ప్రపంచ బ్యాంకు నుంచి మొదటి విడత కింద రూ.1,613 కోట్లు, రెండోవిడత కింద రూ.1,910 కోట్ల రుణం తీసుకుంది. ఇటీవల సమావేశమైన రైల్వేబోర్డు కనీస చార్జీలను పెంచాలని నిర ్ణయించింది. కనీస చార్జీతోపాటు నెలసరి పాస్ చార్జీలుకూడా పెరుగుతాయని అధికారులు తెలిపారు. ఈ విషయమై సంబంధిత అధికారులు మాట్లాడుతూ తాము ప్రపంచబ్యాంకు నుంచి తీసుకున్న రుణాలను తీర్చడానికి సంవత్సరానికి రూ.40 కోట్లు సం పాదించాల్సి వస్తుందన్నారు. దీంతో గత్యంతరం లేక చార్జీలను పెంచాల్సి వచ్చిందన్నారు. చార్జీలను పెంచితే రాబడి పెరుగుతుందని, తద్వారా ప్రపంచబ్యాంకు నుంచి తీసుకున్న రుణం తిరిగి చెల్లించడం సులభమవుతుందన్నారు. అయితే రైల్వే బోర్డు నిర్ణయంపై కొందరు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నిర్ణయాన్ని మరోసారి పరిశీలిస్తే బాగుంటుందంటూ భారత్ మర్చెంట్స్ చాంబర్ సభ్యులు... రైల్వేబోర్డుకు రాసిన లేఖలో పేర్కొన్నారు. మా చేతుల్లోమీ ఏమీ లేదు రైల్వే బోర్డు సూచనల మేరకే తాము నడుచుకుంటుమని పశ్చిమ రైల్వే విభాగం పీఆర్వో శరత్ చంద్రాయన్ పేర్కొన్నారు. చార్జీలను పెంచడం, పెంచకపోవడం వారి చేతుల్లోనే ఉంటుం దన్నారు. -
విరార్‌లో ఆసియాలోనే అతిపెద్ద రైల్వే కార్ షెడ్
ఆసియా ఖండంలోనే అతిపెద్ద రైల్వే కార్ షెడ్‌ను పశ్చిమ రైల్వే పరిధిలోని విరార్‌లో నిర్మిస్తున్నారు. అత్యాధునిక సదుపాయాలతో సుమారు 25.87 హెక్టార్ల స్థలంలో నిర్మిస్తున్న ఈ షెడ్లో ఒకేసారి 16 లోకల్ రైళ్లను నిలిపేందుకు వీలు కలుగనుంది. దీంతోపాటు మూడు 15 బోగీల లోకల్ రైళ్ల మరమ్మతులను ఈ షెడ్లో చేపట్టే అవకాశం ఉంది. ఈ కార్ షెడ్ నిర్మాణ పనులు సుమారు 90 శాతం పూర్తయ్యాయని ‘ముంబై రైల్వే వికాస్ కార్పొరేషన్’ (ఎంఆర్వీసీ) పేర్కొంది. మిగిలిన పనులు 2014 ఆరంభం నాటికి పూర్తి అవుతాయని భావిస్తున్నారు. నిర్మాణ పనులు పూర్తికాగానే పశ్చిమ రైల్వేకి ఈ షెడ్‌ను అప్పగించనున్నట్టు ఎంఆర్వీసీ పేర్కొంది. మరమ్మతులు, నిర్వహణ కారణంగా ప్రయాణికులకు ఇబ్బంది కలుగకుండా ఉండేందుకు షెడ్లను అధికంగా నిర్మించాలని నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే వర్గాలు తెలిపాయి. ఈ మేరకు పశ్చిమ రైల్వేమార్గంలో ప్రయాణికుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని ఈ మార్గంలో అతిపెద్ద కార్ షెడ్ నిర్మించాలని నిర్ణయించారు. అయితే ముంబైలో స్థలాభావం వల్ల కార్ షెడ్‌ను విరార్‌లో నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందుకుగానూ విరార్-నాలాసోపారా రైల్వేస్టేషన్ల మధ్య సుమారు 25.87 హెక్టార్లు అనగా సుమారు 62 ఎకరాల స్థలాన్ని 2004లో ఎంపిక చేశారు. 2005లో ఈ స్థలాన్ని రూ. 31 కోట్లతో కొనుగోలు చేశారు. ఇదే స్థలంలో రూ. 300 కోట్ల వ్యయంతో ఎంఆర్పీసీ 2006 ఈ అత్యాధునికమైన అతిపెద్ద కార్‌షెడ్ నిర్మాణం పనులు చేపట్టింది. సమీపంలోని ఓ దిగుడు బావిని ఈ మరమ్మతు షెడ్‌కు నీటి సరఫరా కోసం కేటాయించారు. ఇక్కడ ఉపయోగించిన నీటిని పునర్వినియోగించడానికి సమీపంలోనే ఓ నీటి శుద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కేంద్రానికి ప్రతిరోజూ సుమారు 2.5 లక్షల లీటర్ల నీటిని శుద్ధి చేసే సామర్థ్యం ఉన్నట్టు ఎంఆర్వీసీ పేర్కొంది. ప్రస్తుతం భూమిలోపల తొమ్మిది లక్షల లీటర్ల నీటిని నిలువ చేసేందుకు వీలుగా ట్యాంక్‌ను నిర్మించారు. ఈ షెడ్లో లోకల్ రైళ్లను అత్యాధునిక అటోమెటిక్ యంత్రాలతో వాషింగ్ చేసేందుకు వీలుంది. సమీపంలో పనిచేసే సిబ్బంది విశ్రాంతి కోసం 53 గదులను నిర్మించడంతోపాటు మోటర్‌మెన్, గార్డుల విశ్రాంతి కోసం 28 పడకలను ఏర్పాటు చేస్తున్నారు. అన్ని అత్యాధునిక సదుపాయాలతో నిర్మితమవుతున్న ఈ కార్‌షెడ్ ఆసియాలో అతిపెద్ద కార్ షెడ్‌గా గుర్తింపు పొందనుందని ఎంఆర్వీసీ పేర్కొంటోంది.


