మడకశిర కోర్టుకు హాజరైన టీడీపీ నేతలు
మడకశిర : అధికారుల విధి నిర్వహణకు అడ్డు తగిలారన్న అభియోగంపై నమోదైన కేసులో టీడీపీ నేతలు శుక్రవారం మడకశిరలోని జూనియర్ సివిల్ జడ్జి కోర్టుకు హాజరయ్యారు. గత ఏడాది పట్టణంలోని రాజీవ్‌గాంధీ సర్కిల్లో హైకోర్టు ఆదేశాల మేరకు మునిసిపల్ భవనాలను అధికారులు కూల్చివేశారు. పోలీసులు, అధికారుల విధులకు అడ్డుపడ్డారని మునిసిపల్ చైర్మన్ ప్రకాశ్ సహా 42మంది టీడీపీ నేతలపై అప్పట్లో కేసు నమోదైంది. విచారణ నిమిత్తం శుక్రవారం వీరు కోర్టులో హాజరయ్యారు. తదుపరి కేసు విచారణను ఈ నెల 27కి వాయిదా వేసినట్లు న్యాయవాది త్రిలోక్ తెలిపారు.