breaking news
Jamui
-
నువ్వు అర్ధరాత్రైనా తిరుగుతావ్.. వాళ్లు అలా కాదు: మైథిలీపై పీకే ఫైర్
బిహార్ వరుస లైంగిక వేధింపుల ఘటనలు.. ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. జమయి జిల్లాలో పదో తరగతి బాలికపై వేధింపుల ఘటన మరువక ముందే.. సమస్తిపూర్‌లో ఇదే తరహా ఘటన చోటు చేసుకుంది. అయితే ఈ ఘటనపై అధికార, ప్రతిపక్షాల మధ్య విమర్శలు కొనసాగుతున్న వేళ.. జన సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు, ఎమ్మెల్యే ప్రశాంత్ కిషోర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.గణేశ్ నవరాత్రుల సందర్భంగా.. అలీనగర్ బీజేపీ ఎమ్మెల్యే, భజన గాయని మైథిలీ ఠాకూర్ ఎప్పటిలాగే ప్రదర్శనలు ఇస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో ఆమెకు సంబంధించిన ఓ వీడియో వైరల్ అయ్యింది. ‘‘ఒకప్పుడు సాయంత్రం 6 దాటితే బయట తిరిగేందుకు భయపడేవాళ్లం. ఇప్పుడు నేను ధైర్యంగా అర్ధరాత్రి 3గం. సమయంలోనూ బిహార్‌లో తిరగగలుగుతున్నా’’ అంటూ ఆమె ఈ ఏడాది ఫిబ్రవరిలో మాట్లాడింది. జమయి ఘటన నేపథ్యంతో ఆ వీడియో వైరల్ అవుతోంది.అయితే మైథిలి పేరును ప్రస్తావిస్తూ ప్రశాంత్ కిషోర్ విమర్శలు చేశారు. దర్బంగా ప్రజలు ఆమెను ఐకాన్‌గా భావించి ఓట్లు వేసి గెలిపించారని.. అయితే ఆమె మాత్రం అంబానీ కుటుంబ గణేశ్ ఉత్సవంలో ప్రదర్శన ఇస్తున్నారని వ్యాఖ్యానించారు. అదే సమయంలో మైథిలి నియోజకవర్గంలో శాంతి భద్రతల సమస్యలు నెలకొన్నాయని.. వరదలతో అక్కడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నా ఆమె పట్టించుకోవడం లేదని మండిపడ్డారాయన.మీరో ఎమ్మెల్యే అందుకే రాత్రిళ్లు..బిహార్‌లో మహిళల భద్రతపై మైథిలీ ఠాకూర్ గతంలో చేసిన వ్యాఖ్యలను కూడా ప్రశాంత్ కిషోర్ ప్రస్తావించారు. ఆమె ఎమ్మెల్యే కావడంతో రాత్రిపూట బయట తిరగగలుగుతున్నారని.. కానీ సాధారణ బాలికలు, మహిళలకు అదే స్థాయిలో భద్రత ఉందా? అని ప్రశ్నించారు. సాధారణ అమ్మాయిలు రాత్రివేళ ఒంటరిగా బయటకు వెళ్లాలంటే భయపడే పరిస్థితి ఉందని, ఇప్పుడు అబ్బాయిలు కూడా రాత్రి బయటకు వెళ్లేముందు రెండుసార్లు ఆలోచించే పరిస్థితి వచ్చిందని ఆయన వ్యాఖ్యానించారు.‘వీడియో వైరల్ కాకపోతే.. ఘటన ఎలా బయటపడేది?’జముయి ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంపైనా ప్రశాంత్ కిషోర్ పోలీసుల తీరును ప్రశ్నించారు. వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసిన వారిపై చర్యల గురించి మాట్లాడుతున్నారని.. కానీ ఆ వీడియో బయటకు రాకపోతే అసలు ఘటన వెలుగులోకి వచ్చేదెలా? అని ప్రశ్నించారు. బాధితులు తొలుత అధికారులను సంప్రదించకపోవడంతో సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చిన వీడియో ఆధారంగానే పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు.‘చేసిన వారిపై చర్యలేవి?’వీడియోను ప్రసారం చేసిన వారిపై చర్యల గురించి మాట్లాడటానికి బదులుగా.. ఘటనకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడమే ముఖ్యమని ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యానించారు. బిహార్‌లో మద్యం, ఇసుక మాఫియాలకు రాజకీయ రక్షణ ఉందంటూ కూడా ఆయన ఆరోపణలు చేశారు.‘బేటీ బచావో.. బేటీ పడావో’పైనా సెటైర్కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ‘బేటీ బచావో.. బేటీ పడావో’ కార్యక్రమాన్ని ప్రస్తావిస్తూ కూడా ప్రశాంత్ కిషోర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పరిస్థితి ఇలాగే ఉంటే.. ఇకపై అమ్మాయిలను వారే చదివించుకోవాలి, వారే కాపాడుకోవాలి అన్నట్టుగా ప్రభుత్వ వైఖరి ఉందంటూ ఆయన వ్యాఖ్యానించారు.మైథిలీ ఠాకూర్(25) బిహార్‌కు చెందిన ప్రముఖ జానపద గాయని. భోజ్‌పురి, హిందీ పాటలతో పాటు భక్తి భజన గీతాలతో గాయనిగా గుర్తింపు పొందారు. 2025 బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అలీనగర్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా సంగీత ప్రదర్శనలు కొనసాగిస్తున్నారు.ఇదీ చదవండి: ఉన్నట్లుండి ఏమైంది?.. ఎమ్మెల్యే రాజీనామాతో కలకలం -
‘చిన్న విషయమే..’ జముయి ఘటనపై షాకింగ్ వ్యాఖ్యలు
బిహార్ జముయిలో మోరల్ పోలీసింగ్ పేరిట జరిగిన దారుణం.. దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పదో తరగతి విద్యార్థిని, ఆమె స్నేహితుడిపై ఓ గ్యాంగ్ దాడి చేయడం.. ఆమెను లైంగికంగా వేధించిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఈ దారుణంపై పోలీసుల దర్యాప్తు, వరుస అరెస్టుల మధ్యే.. బిహార్ మంత్రి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఘటనను ఖండించడం మాట అటుంచి. అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతుంటాయి అనడంతో రాజకీయ దుమారం రేగింది.జముయి ఘటనపై ప్రతిపక్షాలు బిహార్‌లో ‘జంగిల్ రాజ్’ నడుస్తోందంటూ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకున్నాయి. దీనిపై స్పందించిన మంత్రి శ్రవణ్ కుమార్.. ‘ఇది ఓ చిన్న ఘటన. ఐసోలేటెడ్ ఇన్సిడెంట్స్ అప్పుడప్పుడు జరుగుతుంటాయి. ప్రపంచంలో నేరం పూర్తిగా అంతం కాలేదు’ అంటూ వ్యాఖ్యానించారు. అయితే ఈ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఇంత తీవ్రమైన ఘటనను సాధారణ నేరంగా చూడకూడదని ప్రతిపక్షాలు మండిపడ్డాయి. దీంతో తన వ్యాఖ్యలను పొరపాటుగా అర్థం చేసుకున్నారని.. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పుకొచ్చారు. గతంలో నితీశ్‌కుమార్, ఇప్పుడు సామ్రాట్ చౌద్రీ ఇలా ఎవరి హయాంలో అయినా ఇలాంటివి జరిగాయి. ఆ సమయాల్లో కఠిన చర్యలు తీసుకున్నారు. ఇప్పుడు అదే పని చేస్తాం అని అన్నారాయన. అయినప్పటికీ మంత్రి తీరుపై పలువురు మండిపడుతున్నారు. मंत्री श्रवण कुमार ने जमुई घटना हुई लड़की के साथ छेड़खानी की गई है उसे पर कहा बिहार में छुटपुट घटनाएं हो रही है उसे पर हम इनकार नहीं कर सकते हैं।हम उसे दुखी हैं फिर से ऐसी घटना दोबारा ना हो कानून के हिसाब से दोषियों पर कार्रवाई की जाएगी अपराध मुक्त पूरी दुनिया भी नहीं है छिट… pic.twitter.com/IQ0TYNAsVG— Sadan Singh Rajput (@SadanJee) September 22, 2026మరోవైపు మంత్రి వ్యాఖ్యలపై జేడీయూ నేత, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఉమేశ్ కుశ్వాహా కూడా స్పందిస్తూ.. తాను, మంత్రి చేసిన వ్యాఖ్యలను నోరు జారి చేసినవిగా(స్లిప్ ఆఫ్ ది టంగ్)గా అభివర్ణించారు. ఇలాంటి ఘటనలకు పాల్పడిన వారిపై గతంలోనూ చర్యలు తీసుకున్నామని, ఇకపైనా ఎవరినీ వదిలిపెట్టబోమని ఆయన స్పష్టం చేశారు.అసలేం జరిగిందంటే..సెప్టెంబర్ 19న మడ్వా పహాడ్ ప్రాంతంలో కోచింగ్ క్లాస్ ముగించుకుని స్కూటర్‌పై తిరిగి వస్తున్న పదో తరగతి విద్యార్థులు.. ఓ గ్యాంగ్ బారినపడ్డారు. వారి వాహనాన్ని అడ్డుకున్న నిందితులు ఇద్దరినీ కిందకు దించి దాడి చేశారు. బాలుడిని కాలర్ పట్టుకుని లాగగా.. బాలిక రక్షించే ప్రయత్నం చేసింది. ఇంతలో ముసుగులో ఉన్న ఓ వ్యక్తి దూసుకొచ్చి బలవంతంగా ఆమెను ఎత్తుకుని పరిగెత్తే ప్రయత్నం చేశాడు. ఆ సమయంలో ఆమెను అతను అసభ్యంగా తాకాడు. అయితే ఆమె స్నేహితుడు వెంటపడి ఆమెను విడిపించగలిగాడు. ఇద్దరూ తమను వదిలేయాలని వేడుకున్నప్పటికీ గ్యాంగ్ కొంతసేపు వారిని వేధించారు. చివరకు.. చేతులెత్తి బతిమాలడంతో అక్కడి నుంచి వెళ్లేందుకు అనుమతింంచారు. ఈ ఘటనను గ్యాంగ్‌లోని ఒకరు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో విషయం వెలుగులోకి వచ్చింది. తన స్నేహితురాలిని కాపాడుకున్న ఆ యువకుడు తెగువపై ప్రశంసలు కురిశాయి.ముగ్గురు అరెస్ట్, ఏడుగురి గుర్తింపువీడియో వైరల్ కావడంతో పోలీసులు వెంటనే దర్యాప్తు చేపట్టారు. ఇప్పటివరకు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. వీడియో, ఇతర ఆధారాల ఆధారంగా మొత్తం ఏడుగురిని గుర్తించినట్లు అధికారులు తెలిపారు. మిగిలిన వారి కోసం ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) గాలిస్తోంది. పోక్సోతో పాటు సంబంధిత బీఎన్ఎస్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.వీడియో షేర్ చేసినా చిక్కులేఘటనకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేసిన ఖాతాలపైనా పోలీసులు చర్యలు ప్రారంభించారు. బాలిక మైనర్ కావడంతో ఆమె గుర్తింపు బయటపడేలా వీడియోను ప్రసారం చేయడం చట్టరీత్యా నేరమని పోలీసులు హెచ్చరించారు. ఇప్పటివరకు 13 ఫేస్బుక్, 12 ఇన్స్టాగ్రామ్, 7 ఎక్స్ ఖాతాలు.. మొత్తం 32 సోషల్ మీడియా అకౌంట్లను గుర్తించి తొలగింపు చర్యలకు పంపినట్లు అధికారులు తెలిపారు.మహిళా కమిషన్ల జోక్యంఘటనపై జాతీయ మహిళా కమిషన్ సుమోటోగా స్పందించింది. నిందితులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని బిహార్ డీజీపీని ఆదేశించి.. ఏడు రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని కోరింది. రాష్ట్ర మహిళా కమిషన్ కూడా జిల్లా యంత్రాంగం నుంచి వివరాలు కోరింది.రాజకీయ దుమారంఈ ఘటనపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఘోరమైన పాలన నడుస్తోందని.. మహిళలకు రక్షణ కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. బాలిక చేతులు జోడించి వేడుకున్నప్పటికీ గ్యాంగ్ ఆమెను వేధించడం తీవ్ర ఆందోళనకరమని పేర్కొన్నారు. నిందితులందరినీ గుర్తించి పోక్సో చట్టం కింద కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బిహార్ ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్ కూడా ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.మరోవైపు అధికార పక్షం మాత్రం ఘటనపై ప్రభుత్వం సీరియస్‌గా ఉందని, దోషులుగా తేలిన ఎవరినీ వదిలిపెట్టబోమని చెబుతోంది. పోలీసులు ఇప్పటికే అరెస్టులు చేపట్టడంతో పాటు మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నారు. దీంతో జముయి ఘటనలో అసలు నిందితులందరినీ ఎప్పుడు పట్టుకుంటారు? మంత్రి వ్యాఖ్యలపై తీవ్ర విమర్శల వేళ ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. -
మోరల్ పోలీసింగ్ పేరిట మానవ మృగాళ్లు
మోరల్ పోలీసింగ్ పేరిట యువజంటలపై తరచూ దాడులు జరుగుతున్న ఘటనలు చూస్తున్నదే. అయితే ఇక్కడ ఓ యువజంటపై కొందరు వ్యక్తులు దాడికి పాల్పడిన తీరు మరీ దుర్మార్గంగా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. యువకుడిని పక్కకు లాగిన అనంతరం.. యువతిని కొందరు చుట్టుముట్టారు. పైగా వారిలో ఒకడు ఆమెను బలవంతంగా ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.రాత్రివేళ ఓ యువజంటపై ఓ గ్యాంగ్ దాడికి దిగింది. యువకుడ్ని కొందరు లాగిపడేయగా.. ఆమె ప్రతిఘటించే ప్రయత్నం చేసింది. అందులో ముసుగుతో ఉన్న ఒకడు హఠాత్తుగా దూసుకొచ్చి ఆ యువతిని బలవంతంగా ఎత్తుకెళ్లే ప్రయత్నం చేశాడు. ఆ టైంలో అసభ్యంగా తాకుతూ ఈడ్చుకెళ్లాడు. ఆమె భయంతో కేకలు వేయగా.. యువకుడు వాళ్లను అడ్డుకునే ప్రయత్నం చేశాడు. అయితే ఆ యువకుడు ఆమెను విడిపించి.. అక్కడి నుంచి ఇద్దరూ పరుగులు తీశారు. మరో వీడియోలో కాస్త దూరంలో వాళ్లిద్దరూ బైక్‌పై కూర్చోగా.. ఆ టైంలోనూ ఆ రాక్షసులు వాళ్లతో వాగ్వాదానికి దిగారు. చివరకు యువతీయువకుడు చేతులెత్తి బతిమాలడంతో.. వాళ్లను అక్కడి నుంచి పోనిచ్చారు. అయితే ఆ తర్వాత ఏం జరిగిందనే దానిపై స్పష్టత లేకుండా పోయింది.ఈ వీడియోలు బయటకు రావడం, వైరల్ కావడంతో.. ఘటనపై సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. మోరల్ పోలీసింగ్ పేరుతో ఎవరినీ వేధించే లేదంటే మహిళపై అసభ్యంగా ప్రవర్తించే హక్కు ఎవరికీ లేదని పలువురు పేర్కొంటున్నారు. వీడియోలో కనిపిస్తున్న వ్యక్తులను గుర్తించి వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.తాజా ఘటన బిహార్‌లోని జమూయి ప్రాంతంలో జరిగినట్లు తెలుస్తోంది. ఇదే రీజియన్‌లో ఈ మధ్యకాలంలో జరిగిన మూడో ఘటన ఇది. దీంతో నెటిజన్లు అక్కడి పోలీసులపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. వాళ్లది ముమ్మాటికీ ఆ యువతిని రేప్ చేసే ఉద్దేశంగా కనిపిస్తోందంటూ కామెంట్లు చేస్తున్నారు. మహిళను బలవంతంగా పట్టుకోవడం, ఆమెతో అసభ్యంగా ప్రవర్తించడం వంటి చర్యలపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు కోరుతున్నారు. మహిళల భద్రతపై ఇలాంటి ఘటనలు మరోసారి ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొంటున్నారు.ప్రేమజంటలను అడ్డుకోవడం, వేధించడం, దాడి చేయడం పేరేదైనా.. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం నేరమే. మహిళను చుట్టుముట్టి బలవంతంగా ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించడం, అసభ్యంగా ప్రవర్తించడం మరింత తీవ్రమైన అంశమంటూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరీ ముఖ్యంగా మోరల్ పోలీసింగ్ పేరిట ఇలా ప్రవర్తించడం రేపిస్టుల మనస్తత్వమని ఏకిపారేస్తున్నారు. సదరు వీడియోపై బిహార్ పోలీసులు ఇంకా స్పందించాల్సి ఉంది. ఇదీ చదవండి: మనుషులా? మానవ మృగాలా? -
అడవి మధ్యలో రహస్య గుహ.. లోపల కళ్లు బైర్లు కమ్మే దృశ్యం
ప్రతిరోజూ అడవిలోకి వెళ్లి కట్టెలు కొట్టేవారు ఒకరోజు ఒక రహస్య గుహను గమనించారు. వారు ఈ గుహ గురించి అందరికీ చెప్పగానే, అది స్థానికంగా సంచలంగా మారింది. ఆ కట్లెలు కొట్టేవారు ఆ గుహలోని వెళ్లి చూడగా, వారికి అక్కడ కళ్లు బైర్లు కమ్మే దృశ్యం కనిపించింది. బీహార్‌లోని జముయి జిల్లాలోని బర్హత్ బ్లాక్ ప్రాంతంలో ఈ రహస్య గుహ వెలుగు చూసింది. పంచకుల అడవిలో ఉన్న కొండలలో ఒక రహస్య గుహ ఉందని ఆ ప్రాంతానికి చెందిన కట్టెలు కొట్టేవారు చెప్పడంతో స్థానికులు ఆశ్చర్యపోతూ, ఆ గుహను చూసేందుకు తరలివస్తున్నారు. గుహ లోపల ఒక శివలింగం ఉందని, ధ్యాన స్థితిలో కూర్చున్న ఒక ఋషికి సంబంధించిన ఒక పురాతన విగ్రహం కూడా ఉందని గ్రామస్తులు చెబుతున్నారు. కాగా ఆ గుహలోకి ప్రవేశించే మార్గం చాలా ఇరుకుగా ఉంది. అయినప్పటికీ కొందరు టార్చిలైట్లు చేతబట్టి, గుహలోనికి ప్రవేశించే ప్రయత్నం చేస్తున్నారు.గ్రామానికి చెందిన హీరా మాంఝీ మీడియాతో మాట్లాడుతూ గ్రామంలోని కొంతమంది కలప సేకరించడానికి అడవిలోకి వెళ్లినప్పుడు ఈ గుహను గమనించారని తెలిపారు. ఆ కట్టెలు కొట్టేవారిలోని ఒక వ్యక్తి సాహసం చేసి, గుహలోకి వెళ్లాడని, అక్కడ అతనికి ఒక శివలింగం, ఒక ఋషి విగ్రహం కనిపించాయని తెలిపారు. ఈ గుహ జిల్లాలోని ప్రసిద్ధ కుకుర్జాప్ ఆనకట్టకు మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది. గుహ పైన పెద్ద బండ రాళ్ళు ఉన్నాయి. ఈ గుహగురించి తెలిసిన అనంతరం స్థానికులు గుహ వెలుపల కూర్చుని భజనలు, పూజలు చేస్తున్నారు. భక్తులు దర్శించుకునేందుకు వీలుగా గుహలోనికి మార్గం ఏర్పాటు చేయాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు. ఇది కూడా చదవండి: కుంభమేళా రైలుపై రాళ్ల దాడి.. పలువురు ప్రయాణికులకు గాయాలు -
ఎన్నికల బరిలో విచిత్ర పార్టీలు!
లోక్‌సభ ఎన్నికల మొదటి దశ ఓటింగ్‌కు కొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ మొదటి దశలో బీహార్‌లోని నాలుగు లోక్‌సభ స్థానాలకు (నవాడ, జముయి, ఔరంగాబాద్, గయ) ఓటింగ్ జరగనుంది. మరోవైపు బీహార్‌లో విచిత్రమైన పేర్లు కలిగిన రాజకీయ పార్టీల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఈ పార్టీల పేర్లు అందరి దృష్టిని ఆకర్షించేలా ఉన్నాయి. ఈ జాబితాలో ఆల్ హింద్ ఫార్వర్డ్ బ్లాక్ (రివల్యూషనరీ), స్మార్ట్ పార్టీ, లాగ్ పార్టీ, న్యూమరికల్ పార్టనర్షిప్ పార్టీ మొదలైనవి ఉన్నాయి. ప్రముఖ నేత చిరాగ్ పాశ్వాన్ బావమరిది గౌతమ్ పాశ్వాన్ సమజ్దార్ పార్టీ నుండి నామినేషన్ దాఖలు చేశారు. భారతీయ ఏక్తా పార్టీ నుంచి అనిల్ చౌదరి, భారతీయ లోక్ చేతన పార్టీ నుంచి గుడియా దేవి, రాష్ట్రీయ జన సంభవ పార్టీ నుంచి శ్రవణ్ కుమార్ నామినేషన్ దాఖలు చేశారు. అయితే ఈ పార్టీలకు చెందిన నలుగురు అభ్యర్థుల నామినేషన్లను వివిధ కారణాలతో ఎన్నికల సంఘం రద్దు చేసింది. బీహార్‌లోని గయ లోక్‌సభ స్థానం నుంచి ఎన్నికల్లో పోటీ చేసేందుకు విచిత్రమైన పేర్లు కలిగిన మూడు పార్టీల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. వీరిలో భారతీయ లోక్ చేతన పార్టీకి చెందిన శివశంకర్ పోటీకి దిగారు. డెమోక్రటిక్ సమాజ్ వాదీ పార్టీ నుంచి ధీరేంద్ర ప్రసాద్ పోటీ చేస్తున్నారు. ఔరంగాబాద్ లోక్‌సభ స్థానం నుండి లాగ్ పార్టీకి చెందిన అజిత్ శర్మ నామినేషన్ దాఖలు చేశారు. ఇదే స్థానం నుంచి జనజాగరణ్ పార్టీకి చెందిన శంభు ఠాకూర్ కూడా నామినేషన్ దాఖలు చేశారు. అయితే వీరి నామినేషన్లను ఎన్నికల సంఘం తిరస్కరించింది. -
PM Narendra Modi: అవినీతిపరులు ఒక్కటవుతున్నారు
జమూయి/కూచ్‌బెహార్: అవినీతి కేసుల్లో ఇరుక్కున్నవారంతా మోదీపై యుద్ధం పేరిట ఒక్కటవుతున్నారని ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ధ్వజమెత్తారు. ఆ కూటమిలో ఉన్న భాగస్వాములంతా పరస్పరం అవినీతి ఆరోపణలు చేసుకున్నవారేనని గుర్తుచేశారు. అవినీతిపరులను జైలుకు పంపించాలా? వద్దా? అని ప్రశ్నించారు. తాను అవినీతి నిర్మూలన గురించి మాట్లాడుతుండగా, ప్రతిపక్షాలు మాత్రం మోదీని ఓడించాలని ప్రజలకు పిలుపునిస్తున్నాయని తప్పుపట్టారు. గురువారం బిహార్‌లోని జమూయి జిల్లాలో ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు. మన దేశానికి ముప్పుగా మారిన సీమాంతర ఉగ్రవాదాన్ని అరికట్టడంలో గత కాంగ్రెస్ ప్రభుత్వాలు దారుణంగా విఫలమయ్యాయని ఆరోపించారు. ఉగ్రవాదులు పాకిస్తాన్ నుంచి వచ్చి దాడులు చేస్తున్నా పట్టించుకోలేదని విమర్శించారు. చిన్నదేశాల నుంచి ముష్కరులు వచి్చపడుతున్నా చర్యలు తీసుకోలేదని ఆక్షేపించారు. ఉగ్రవాద దాడులు జరిగినప్పుడు ఇతర దేశాల జోక్యాన్ని అనుమతించారని మండిపడ్డారు. దీనివల్ల భారత్‌కు బలహీన దేశమన్న చెడ్డపేరు వచి్చందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇండియాను సులువుగా టార్గెట్ చేయొచ్చన్న అభిప్రాయం ఏర్పడిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాల నిర్వాకం వల్ల ప్రపంచం దృష్టిలో భారత్ పేద దేశంగా ముద్రపడిందని అన్నారు. యూపీఏ ప్రభుత్వ పాలనలో 26/11 ముంబై ఉగ్రవాద దాడుల కేసులో అమెరికా జోక్యాన్ని అనుమతించడాన్ని ఆయన పరోక్షంగా ప్రస్తావించారు. సీఏఏపై విపక్షాల తప్పుడు ప్రచారం పౌరసత్వ సవరణ చట్టంపై ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మోదీ మండిపడ్డారు. భరతమాతపై విశ్వాసం ఉన్నవారికి భారత పౌరసత్వం కల్పిస్తామని, ఇది మోదీ గ్యారంటీ అని వ్యాఖ్యానించారు. ఆయన పశి్చమ బెంగాల్‌లోని కూచ్‌బెహార్‌లో ప్రచారంలో పాల్గొన్నారు. అవినీతిపరులను కాపాడేందుకు ప్రతిపక్షాలు ఆరాటపడుతున్నాయని విమర్శించారు. -
రూ.500 కోసం జుట్టు జుట్టు పట్టుకుని....చెప్పులతో కొట్టుకున్నారు: వైరల్ వీడియో
ప్రభుత్వ ఆపీస్లో పై అధికారి తలబిరుసుతనంతో తన కింద పనిచేసిన వాళ్లపై చేయిచేసుకోవడం వంటి పలు ఘటనలు గురించి విన్నాం. ఇటీవలే ఒక నర్సు ఆలస్యంగా వచ్చినందుకు ఒక ఆరోగ్యాధికారి దాడి చేసేందుకు ప్రయత్నించిన వీడియోలను చూశాం. లక్షల్లోనూ లేదా కోట్ల ఆస్తి గురించి దెబ్బలాడుకున్నా ఓ అర్థం ఉంటుంది. కానీ కేవలం రూ 500 కోసం కొట్టుకోవడం గురించి విన్నారా. పైగా ఆపేందుకు ప్రయత్నించిన కూడా తగ్గేదే లే అన్నట్టుగా ఘోరంగా కొట్టుకున్నారు. ఈ ఘటన బీహార్‌లో చోటుచేసుకుంది. అసలు విషయంలోకెళ్తే....బీహార్‌లో జాముయ్ జిల్లాలోని లక్ష్మీపూర్ బ్లాక్‌లో ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద ఇద్దరు ఆరోగ్య కార్యకర్తలు ఒకరినోకరు జుట్టుపట్టుకుని లాక్కుంటూ దారుణంగా కొట్టుకున్నారు. ఆఖరికి ఒక వ్యక్తి జోక్యం చేసుకుని ఆపేందుకు ప్రయత్నించాడు. అయినప్పటికీ ఆ ఇద్దరూ చేతులతోనూ, చెప్పులతోను ఘోరంగా కొట్టుకున్నారు. అయితే ఆశా వర్కర్ రింటూ కుమారి బీసీజీ వ్యాక్సిన్ షాట్ కోసం ఆక్సిలరీ నర్సు మిడ్వైఫ్(ఏఎన్ఎం) రంజన కుమారి వద్దకు నవజాత శిశువును తీసుకెళ్లినప్పుడే ఈ వివాదం తలెత్తింది. అయితే వ్యాక్సిన్ వేసేందుకు ఆ ఆక్సిలరీ నర్సు రూ 500 డిమాండ్ చేయడంతో ఈ గోడవ జరిగింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం ఆన్లైన్ వైరల్‌గా మారింది. దీంతో ఆస్పత్రి ఉన్నతాధికారులు విచారణ ప్రారంభించారు. అయితే ఇప్పటి వరకు ఆ కార్యకర్తలపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని అధికారులు తెలిపారు. ये दृश्य @NitishKumar के स्वास्थ्य विभाग की असलियत की कहानी बयान कर रहा हैं जहां एक टीका के बदले 500 घूस की माँग पर एएनएम और आशा सेविका ऐसे उलझ गयी @ndtvindia @Anurag_Dwary @mangalpandeybjp @PratyayaIAS pic.twitter.com/98JrknbpMk — manish (@manishndtv) January 24, 2022 (చదవండి: లావుగా ఉన్నాడని ఉద్యోగంలోంచి తీసేశారు!) -
జమూయీ.. గెలుపెవరిదోయి?
బిహార్‌లోని జమూయీ లోక్‌సభ స్థానంలో 11 శాతంగా ఉన్న మహా దళితులు, అదే సంఖ్యలో ఉన్న ముస్లిం మైనారిటీలు ఎటు మొగ్గితే విజయం అటువైపే అనేది విశ్లేషకుల అంచనా. అయితే ఈసారి ఈ రెండు సామాజిక వర్గాలనూ ప్రభావితం చేసేందుకు అన్ని పార్టీలూ తీవ్రంగా యత్నిస్తున్నాయి. అందులో భాగంగానే జమూయీ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో నరేంద్రమోదీ పర్యటించి, కాంగ్రెస్ పార్టీ దళితులకు ఏ మేలూ చేయలేదనీ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌ని అవమానించిందనీ మాట్లాడారు. ఇది ప్రధానంగా అక్కడ మహా దళితుల ఓట్లను దృష్టిలో పెట్టుకొని ప్రస్తావించినట్టు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. బీజేపీ కూటమికే అనుకూలం.. ఎన్డీయే పార్టీల పొత్తులో భాగంగా ఈ స్థానం రామ్‌విలాస్ పాశ్వాన్ నాయకత్వంలోని లోక్ జనశక్తి పార్టీ ఖాతాలోకి వెళ్లింది. ఈ స్థానం నుంచి పాశ్వాన్ కుమారుడు చిరాగ్ పాశ్వాన్‌ని అభ్యర్థిగా ప్రకటించారు. 2014లో జరిగిన ఎన్నికల్లో చిరాగ్ ఆర్జేడీకి చెందిన సుధాన్షు కుమార్ భాస్కర్ని ఓడించారు. ఇప్పుడు ఈ స్థానం నుంచి రాష్ట్రీయ లోక్‌సమతా పార్టీకి చెందిన భూదేవ్ చౌధరీని ముఖాముఖి ఢీకొంటున్నారు. ఈ నియోజకవర్గంలో 90 శాతం గ్రామీణ ప్రాంతాల జనాభా ఉండగా, పట్టణ ప్రజలు 10 శాతంగా ఉన్నారు. ఇందులో ఎస్సీలు 17 శాతం, ఎస్టీలు 3 శాతం ఉన్నారు. బిహార్‌లోని ఆర్జేడీ–కాంగ్రెస్ మహా కూటమిలో ఆర్ఎల్ఎస్పీ కూడా భాగస్వామిగా ఉంది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఆర్జేడీ అభ్యర్థిపై 11 శాతం ఓట్ల ఆధిక్యంతో చిరాగ్ పాశ్వాన్ విజయం సాధించారు. ఆర్జేడీకి 25.71 శాతం ఓట్లు వచ్చాయి. గత ఎన్నికల్లో విడిగా పోటీ చేసిన జేడీయూ 25.60 శాతం ఓట్లతో మూడో స్థానంలో నిలిచింది. అయితే ఈసారి ఎన్నికల్లో జేడీయూ ఎల్జేపీకి మద్దతివ్వడంతో ఓట్ల శాతం గణనీయంగా పెరగవచ్చునని భావిస్తున్నారు. కాంగ్రెస్–ఆర్జేడీల మద్దతు ఆర్ఎల్ఎస్పీకి ఉన్నప్పటికీ, జేడీయూ, ఎల్జేపీ, బీజేపీ కూటమికి 30 శాతం ఓట్లు అ«ధికంగా రావొచ్చని రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ స్థానం నుంచి ఎన్సీపీ బీఎస్పీ అభ్యర్థులను రంగంలోకి దించినప్పటికీ వారి ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చునని భావిస్తున్నారు. ఆ రెండు వర్గాల మొగ్గును బట్టే ఫలితం 2014 ఎన్నికల్లో ఎల్జేపీకి చెందిన చిరాగ్ పాశ్వాన్ 85 వేల ఓట్ల మెజారిటీతో ఇక్కడి నుంచి గెలుపు కైవసం చేసుకున్నారు. మహా దళిత్ జనాభా 11 శాతంపైగా ఉన్న ఏడు జిల్లాల్లో జమూయీ ఒకటి. అదే సంఖ్యలో ఉన్న ముస్లింలు, మహా దళితులు కలిసి ఫలితాలను ఎటువైపైనా మార్చగలిగే స్థితిలో ఉన్నారు. 2008 నియోజకవర్గాల పునర్విభజన అనంతరం జమూయీ స్థానానికి మూడోసారి ఎన్నికలు జరగనున్నాయి. 2009లో జరిగిన ఎన్నికల్లో జేడీయూ అభ్యర్థి భూదేవ్ చౌధరి, ఆర్జేడీ అభ్యర్థి శ్యాం రజక్‌పై 29,797 ఓట్ల మెజారిటీతో గెలిచారు. అయితే ఈసారి భూదేవ్ చౌధరి ఆర్ఎల్ఎస్పీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. జమూయీ లోక్‌సభా నియోజకవర్గ పరిధి జామూయీ, ముంగేర్, షేక్ పురా మూడు జిల్లాల్లో విస్తరించి ఉంది. నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య 14,04,016 కాగా మహిళలు 6,51,501, పురుషులు 7,52,515 మంది ఉన్నారు. మావోయిస్టు ప్రభావిత నియోజకవర్గాలైన నావ్డా, గయ, ఔరంగాబాద్‌తో పాటు జమూయీ నియోజకవర్గంలో మొదటి దశలో ఏప్రిల్ 11న ఎన్నికలు జరగనున్నాయి. జమూయీ లోక్‌సభ నియోజకవర్గంలో తారాపూర్, షేక్‌పురా, సికింద్రా, జమూయీ, చకాయి, జన్హాతో కలిపి మొత్తం 6 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. 2014 ఎన్నికల్లో ఓట్ల శాతం ఎల్జేపీ : 36.8% ఆర్జేడీ : 25.7% జేడీయూ : 25.6% -
అసభ్య వీడియో తీసి చివరికిలా..
వాడు చేసింది ముమ్మాటికి నేరమే. ఆధారాలు రుజువైతే తక్కువలో తక్కువ మూడేళ్లు కారాగార శిక్ష పడుతుంది. కానీ జడ్జిగారి సూచన మేరకు 'రహస్య వీడియో' ప్రేమికుడు తన ప్రేయసిని వివాహం చేసుకున్నాడు. సంకెళ్లున్న చేతులతోనే తాళికట్టి మళ్లీ జైలుకెళ్లాడు. అసలేం జరిగిందంటే.. బిహార్‌లోని జముయికి చెందిన దిగ్విజయ్ కుమార్ పాశ్వాన్ అనే యువకుడికి, అదే ఊళ్లో ఉండే పూజ అనే యువతికి మధ్య నాలుగేళ్లుగా ప్రేమ వ్యవహారం నడుస్తోంది. ఒకదశలో పెళ్లిచేసుకుందామనుకున్న వాళ్లు ఏవో అవాంతరాలొచ్చి ఆగిపోయారు. కాగా, గత వారం ప్రేమికులిద్దరూ తగువులాడుకున్నారు. ఒకరినొకరు తీవ్రంగా దూషించుకుని, విడిపోయారు. పూజపై కక్ష కట్టిన దిగ్విజయ్.. ఆమెకు సంబంధించిన అభ్యంతరకర వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆనోటా ఈనోటా వీడియోల విషయం తెలుసుకున్న పూజ.. మాజీ ప్రేమికుడిపై పోలీసులకు ఫిర్యాదుచేసింది. రంగంలోకి దిగిన పోలీసులు దిగ్విజయ్ ని అరెస్టు చేసి జముయి సివిల్ కోర్టులో ప్రవేశపెట్టారు. బాధితురాలు, నిందితుడి మధ్య నాలుగేళ్లుగా సాగిన ప్రేమ వ్యవహారం గురించి లాయర్ల ద్వారా తెలుసుకున్న జడ్జి గారు.. 'ఆ అమ్మాయినే పెళ్లి చేసుకో' అని దిగ్విజయ్ కి సూచించారు. అందుకతను సరే అనడం, పూజ కూడా అంగీకారం తెలపడంతో శుక్రవారం ఓ ఆలయంలో వీరి వివాహం జరిగింది. చేతికి సంకెళ్లతోనే మూడు ముళ్లూ వేసిన దిగ్విజయ్ ని పోలీసులు మళ్లీ రిమాండ్ కు తరలించారు. పూజ తన అత్తారింటికి వెళ్లింది.


