breaking news
heartbeat rate
-
పిండం గుండె.. గండం పెరుగుతుండె!
సాక్షి, సిటీబ్యూరో: తల్లిగర్భంలో ఉండగానే పిండం గుండె లయ తప్పుతోంది. హార్ట్‌బీట్ రేటు గణనీయంగా తగ్గిపోతోంది. హైదరాబాద్‌లో ఇలాంటి కేసులు ఇటీవల బాగా పెరిగాయి. రెయిన్బో చిల్డ్రన్స్ హార్ట్ ఇనిస్టిట్యూట్‌కు నెలకు 300 కేసులు వస్తుండగా, అందులో సుమారు 30 వరకు ఫీటల్ హార్ట్ రేటు సమస్యలున్నాయి. గర్భం దాల్చిన 16 వారాల నుంచి 18 వారాల్లో ఎర్లీ టిఫా స్కాన్ చేసి పిండం పరిస్థితిని గుర్తించవచ్చని, సరైన సమయంలో స్పందించి చికిత్స అందిస్తే, పుట్టబోయే బిడ్డకు సాధారణ జీవితం అందించేందుకు వీలుంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకీ పరిస్థితి..? జాగ్రన్ సిండ్రోమ్, ఎస్‌ఎల్‌ఈ, యాంకలైజింగ్, స్పాండలైటిస్ వంటి వ్యాధులతో బాధపడుతున్న గర్భిణుల్లోని పిండంపై హార్ట్‌బీట్ రేటుపై ప్రభావం కనిపిస్తోంది. ఇలాంటి సమయంలో పిండం గుండె తెల్లగా మారిపోతోంది. గుండె చుట్టూ నీరు చేరుతుంది. హార్ట్ వాల్‌్వలు లీకవుతాయి. ఇటువంటి సమయంలో తల్లి నుంచి ప్లాసెంటా ద్వారా చికిత్స చేయడంలో ఎఫెక్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ ఆశించిన మేరకు ఉండటంలేదు. దీంతో నేరుగా పీటస్కే ట్రీట్మెంట్ అందించే అత్యంత సంక్లిష్టమైన వైద్యసేవలను వైద్యులు విజయవంతంగా పూర్తి చేస్తున్నారు. హైదరాబాద్‌కు తెలంగాణలోని ఇతర జిల్లాలతోపాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, ఇతర సరిహద్దు రాష్ట్రాల నుంచి రిఫరల్ కేసులు వస్తున్నాయి. ప్రపంచంలోనే అత్యుత్తుమ సేవలు పిండం గుండెకు చికిత్సను ఇప్పటివరకు తల్లి నుంచే అందిస్తుండగా, తాజాగా నేరుగా ట్రీట్మెంట్ చేసే అధునాతన పద్ధతులు అందుబాటులోకి వచ్చాయి. పిండం హార్ట్ రేటు తక్కువగా ఉండటం, గుండె చుట్టూ నీరు చేరడం వంటి సందర్భాల్లో నేరుగా ఇమ్యునోగ్లోబిలిన్ థెరఫీ చేస్తున్నారు. దీనిలో 95 శాతం సక్సస్ రేటు ఉందని వైద్యులు చెబుతున్నారు. ఇమ్యునోథెరపీ సేవలందించే ఆసుపత్రులు ప్రపంచంలోనే అతి తక్కువ సంఖ్యలో ఉన్నాయి.అందులో హైదరాబాద్‌కు స్థానం లభించడం గమనార్హం. అంతర్జాతీయంగా అత్యుత్తమ వైద్యసేవలకు హైదరాబాద్ కేంద్రంగా నిలుస్తోందనేందుకు ఇదొక ఉదాహరణ. అత్యాధునిక శస్త్రచికిత్సల్లో నిష్ణాతులైన వైద్యులు అందుబాటులో ఉండటంతో వివిధ దేశాల నుంచి శస్త్రచికిత్సల కోసం ఇక్కడకు వస్తున్నారు. ఇక్కడి చికిత్సలపై ప్రఖ్యాత అమెరికన్ మ్యాగ్జైన్ జాక్ (జేఏసీసీ)లోనూ కథనాలు ప్రచురితం కావడం గరి్వంచదగ్గ విషయమని వైద్యునిపుణులు పేర్కొంటున్నారు.18వ వారం నుంచి ట్రీట్మెంట్ నెలకు 300 కేసుల వరకు ఫీటల్ ఎకో చేస్తున్నాం. అందులో పది శాతం కేసుల్లో ఫీటల్ హార్ట్ రేట్ సమస్యలు ఉంటున్నాయి. గర్భం దాల్చిన 16 నుంచి 18 వారాల్లో ఎర్లీ టిఫా స్కాన్ చేయించుకోవడం మంచిది. గుండె సంబంధిత సమస్యలు ఉంటే గుర్తించి, త్వరితగతిన చికిత్స అందించే అవకాశం ఉంటుంది. అత్యవసర సమయంలో ఇమ్యునోథెరపీ చేస్తున్నాం. ప్రెగ్నెన్సీ నిర్ధారణ అయినా నిలవకపోవడం, అబార్షన్లు వంటి సమస్యలు ఉన్నపుడు ఎక్సటెండెడ్ ఏఎన్ఐ టెస్టు చేయించుకోవాలి. పిల్లల కోసం ప్లానింగ్ చేసుకునేటప్పుడే ట్రీట్మెంట్ తీసుకోవాలి. – డా. భార్గవి, పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్ -
ఆపిల్ వాచ్ కాపాడింది
ఓ హృద్రోగిని ఆపిల్ వాచ్ కాపాడింది. అవును. వాచ్ ఏంటి కాపాడటమేంటి అనుకుంటున్నారా?. ఉత్తర వేల్స్ కు చెందిన స్కాట్ థామస్(51) ఆపిల్ వాచ్ తనను కాపాడిందని చెబుతున్నారు. వాచ్ లో హార్ట్ బీట్ రేటును చూసుకుని గుండె కొట్టుకునే వేగం చాలా తక్కువగా ఉందని తెలుసుకున్నానని చెప్పారు. సాంకేతికంగా ఎంతో ముందున్న ఆపిల్ వాచ్ లో హార్ట్ బీట్ రేట్ ను తెలుసుకోవచ్చు. దీంతో ఆసుపత్రికి వెళ్లగా ఆయనకు గుండె జబ్బు ఉన్నట్లు డాక్టర్లు ధ్రువీకరించినట్లు వెల్లడించారు. నిమిషానికి 72 సార్లు కొట్టుకోవలసిన గుండె కేవలం 42 సార్లు మాత్రమే కొట్టుకుంటోందని డాక్టర్లు చెప్పినట్లు చెప్పారు. ఆపరేషన్ చేయకపోతే మరణించే ప్రమాదం ఉందని చెప్పడంతో సర్జరీ చేయించుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం తన ఆరోగ్యం కుదుటపడినట్లు చెప్పారు.


