ఓ హృద్రోగిని ఆపిల్ వాచ్ కాపాడింది.
ఆపిల్ వాచ్ కాపాడింది
Nov 17 2016 10:23 PM | Updated on Aug 20 2018 3:07 PM
ఓ హృద్రోగిని ఆపిల్ వాచ్ కాపాడింది. అవును. వాచ్ ఏంటి కాపాడటమేంటి అనుకుంటున్నారా?. ఉత్తర వేల్స్ కు చెందిన స్కాట్ థామస్(51) ఆపిల్ వాచ్ తనను కాపాడిందని చెబుతున్నారు. వాచ్ లో హార్ట్ బీట్ రేటును చూసుకుని గుండె కొట్టుకునే వేగం చాలా తక్కువగా ఉందని తెలుసుకున్నానని చెప్పారు. సాంకేతికంగా ఎంతో ముందున్న ఆపిల్ వాచ్ లో హార్ట్ బీట్ రేట్ ను తెలుసుకోవచ్చు.
దీంతో ఆసుపత్రికి వెళ్లగా ఆయనకు గుండె జబ్బు ఉన్నట్లు డాక్టర్లు ధ్రువీకరించినట్లు వెల్లడించారు. నిమిషానికి 72 సార్లు కొట్టుకోవలసిన గుండె కేవలం 42 సార్లు మాత్రమే కొట్టుకుంటోందని డాక్టర్లు చెప్పినట్లు చెప్పారు. ఆపరేషన్ చేయకపోతే మరణించే ప్రమాదం ఉందని చెప్పడంతో సర్జరీ చేయించుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం తన ఆరోగ్యం కుదుటపడినట్లు చెప్పారు.
Advertisement
Advertisement


