breaking news
fanta
-
భారత్లో షుగర్ ఎక్కువ.. విదేశాల్లో తక్కువ ఎందుకు?
చెప్పేవి శ్రీరంగ నీతులు... చేసేవి దొంగ పనులు అన్నట్లుగా దిగ్గజ బహుళజాతి కంపెనీలు భారత వినియోగదారుల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నాయి. లండన్లో విక్రయించే ఒక ఫాంటా క్యాన్లో కేవలం 63 క్యాలరీలు, తక్కువ పంచదార ఉంటే అదే మనదేశంలో లభించే పానీయంలో మాత్రం ఏకంగా మూడు రెట్లు అధికంగా షుగర్ను దట్టించి విక్రయిస్తున్నారు. యూరోప్లో కృత్రిమ రంగుల (E110 Sunset Yellow) వాడకంపై సీసాల ముందు భాగంలోనే హెచ్చరిక బొమ్మలు తప్పనిసరి చేశారు. కాగా, మన దేశంలో మాత్రం ప్యాకెట్ వెనుక వైపు కంటికి కనిపించనంత చిన్న అక్షరాలతో సరిపెట్టడం గమనార్హం.ఈ లోపాన్ని ఆధారంగా చేసుకుని బహుళజాతి కంపెనీల వ్యవహారంపై ప్రజారోగ్య నిపుణులు స్పందిస్తూ బాటిళ్ల ముందు భాగంలోనే ఎరుపు, పచ్చ రంగుల నాణ్యతా ముద్రలు వేయాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ, చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు కాకుండా ముందే చర్యలు తీసుకోవాల్సిన 'ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా' (ఎఫ్ఎస్ఎస్ఏఐ), కార్పొరేట్ కంపెనీల ఒత్తిళ్లకు తలొగ్గి ఈ హెచ్చరికల ప్రతిపాదనను పక్కనబెట్టడం తీవ్ర ఆందోళనకరమని కొందరు నిపుణులు చెబుతున్నారు.ఎలాంటి రంగులు లేని సాధారణ పట్టికలతో వీటి గుర్తింపును సరిపెడతామని ఎఫ్ఎస్ఎస్ఏఐ పేర్కొనడంపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సైతం ఇటీవల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘భారత పౌరుల ఆరోగ్యం పట్ల దేశానికి శ్రద్ధ ఉందనే విషయం ప్రపంచానికి తెలియాలి’ అని వ్యాఖ్యానించింది. ప్రజల ఆరోగ్యమే మహాభాగ్యం అన్న ప్రాథమిక సూత్రాన్ని విస్మరించి లాభార్జనే ధ్యేయంగా సాగుతున్న ఈ కార్పొరేట్ ధోరణులను అరికట్టకపోతే రాబోయే రోజుల్లో భారత్ తీవ్ర ఊబకాయం, మధుమేహ సంక్షోభంలో కూరుకుపోవడం ఖాయమని ఆరోగ్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఇదీ చదవండి: మొదటిసారి ఇల్లు కొంటున్నారా? -
వైరల్ వీడియో: బాహుబలి తేనేటీగలు
తేనేటీగలు తమ శక్తికి మించిన పని చేసి బాహుబలిని తలపించాయి. రెండు తేనేటీగలు కలిసి ఫాంటా కూల్డ్రింక్ బాటిల్ని ఓపెన్ చేశాయి. బాటిల్ మూతకి రెండు వైపులా చేరో తేనటీగ వాలి... నెమ్మదిగా మూతని తెరిచి ఫాంటాని చప్పరించాయి. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది. Two bees opening a soda bottle together.. 😲 #repost pic.twitter.com/Kv8nJrwxJD — Buitengebieden (@buitengebieden_) May 26, 2021 -
‘ఫాంటా మామ్’ ఆవిర్భావం
అన్నానగర్ : శీతల పానీయదారుల ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రముఖ సాఫ్టుడ్రింక్ ఉత్పత్తిదారు కోకో కోలా ఇండియా తన ఉత్పత్తుల్లోని ‘ఫాంటా’ పానీయం ద్వారా ‘స్నాక్ టైం- ఫాంటా టైం’ అనే నినాదంతో ఒక వినోదాత్మక యానిమేషన్ పాత్రను ‘ఫాంటామామ్’ పేరుతో అన్ని చానల్స్లోనూ, ఫ్రింట్ మీడియాలో ప్రచారానికి వుంచిందని కోకో కోలా మార్కెటింగ్ విభాగం ఉపాధ్యక్షుడు దేవబాత్ర ముఖర్జీ విలేకరులకు తెలిపారు. వినోదంతో పాటుగా విజ్ఞానాన్ని కూడా పంచే ఈ కార్టూన్ వ్యాపార ప్రకటనను ఓ అండ్ ఎం అడ్వర్టైజింగ్ సంస్థ ఈసీడీ అజయ్గవాట్, ఎస్సీడీ శైలేందర్ మహాజన్ రూపొందించారన్నారు. ‘నోమూడ్’ యానిమేషన్ ఈ లఘుచిత్రాన్ని రూపొందించడంలో ఎంతో శ్రద్ధ వహించిందన్నారు. ఇందులోని గీతాన్ని అమితాబ్ భట్టాచార్య రాయగా, సంగీతాన్ని విజయ్ ఆంటోని అందించారన్నారు. ఈ వ్యాపార ప్రకటన ద్వారా వచ్చే ఆదాయాన్ని సపోర్టు మై స్కూల్ ప్రోగ్రామ్, పరివర్తన్, ప్రగతి వంటి సాంఘీక సంక్షేమ పథకాలను అందచేస్తామన్నారు. ఈ సొమ్ములో కొంతభాగాన్ని ఁఫైవ్ బీ వై ట్వంటీ ఉన్నతి* అనే పథకం కింద దేశంలో సాగుతున్న మామిడి పంటల రక్షణ కోసం వినియోగిస్తామన్నారు.


