-
డీజీపీగా హరీష్‌కుమార్ గుప్తా
సాక్షి, అమరావతి/సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(డీజీపీ)గా హరీష్ కుమార్ గుప్తా సోమవారం మంగళగిరిలోని డీజీపీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు 1992వ బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి హరీష్‌కుమార్ గుప్తాను ఏపీ డీజీపీగా నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు డీజీపీగా ఉన్న కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డిని బదిలీ చేస్తూ ఈసీ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే.కొత్త డీజీపీ నియామకం కోసం ముగ్గురు డీజీ ర్యాంక్ కలిగిన అధికారుల పేర్లను సూచించాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఎన్నికల సంఘం కోరింది. దీంతో ద్వారకా తిరుమలరావు, హరీష్‌కుమార్ గుప్తా, మాదిరెడ్డి ప్రతాప్ పేర్లను సీఎస్ పంపించగా.. వీటిని పరిశీలించిన కేంద్ర ఎన్నిక సంఘం హరీష్ కుమార్ గుప్తాను డీజీపీగా నియమించింది. కాగా, అనంతపురం డీఐజీ ఆర్ఎస్ అమ్మిరెడ్డిని బదిలీ చేస్తూ ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. -
AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా
-
ఏపీ కొత్త డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా.. నియమించిన ‘ఈసీ’
సాక్షి,విజయవాడ: ఆంధ్రప్రదేశ్ కొత్త డీజీపీగా హరీష్‌కుమార్ గుప్తాను ఎన్నికల కమిషన్(ఈసీ) నియమించింది. సోమవారం(మే6) సాయంత్రం 5 గంటలలోపు బాధ్యతలు తీసుకోవాలని గుప్తాను ఈసీ ఆదేశించింది. ఇప్పటివరకు డీజీపీగా బాధ్యతలు నిర్వహించిన రాజేంద్రనాథ్‌రెడ్డిని ఆదివారం ఈసీ బదిలీ చేసిన విషయం తెలిసిందే. తర్వాత ఏపీ చీఫ్ సెక్రటరీ(సీఎస్) ముగ్గురు సీనియర్ అధికారులతో జాబితాను పంపగా అందులో నుంచి హరీష్‌కుమార్‌గుప్తాను డీజీపీగా ఈసీ నియమించింది. -
AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
సాక్షి,విజయవాడ: ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డిని ఎన్నికల కమిషన్(ఈసీ) ఆదివారం(మే5) బదిలీ చేసింది. విధుల నుంచి వెంటనే రిలీవ్ కావాలని డీజీపిని ఆదేశించింది. డీజీపీని వెంటనే బదిలీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్)కు ఆదేశాలు జారీ చేసింది. కొత్త డీజీపీ నియామకం కోసం ముగ్గురు డీజీ ర్యాంక్ అధికారుల పేర్లు పంపాలని సీఎస్‌ను ఈసీ కోరింది. సోమవారం(మే6) ఉదయం 11 గంటల లోపు ప్రతిపాదనలు పంపాలని కోరింది. -
బెంగాల్ డీజీపీ తొలగింపు
సాక్షి, న్యూఢిల్లీ: రానున్న లోక్‌సభ ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించే లక్ష్యంతో కేంద్ర ఎన్నికల సంఘం భారీ కసరత్తుకు తెరతీసింది. ఉత్తరప్రదేశ్, గుజరాత్, బిహార్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ హోం శాఖ కార్యదర్శులతోపాటుగా, పశ్చిమబెంగాల్ డీజీపీ రాజీవ్ కుమార్‌ను తొలగించాలని ఆదేశా లు జారీ చేసింది. మిజోరం, హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రాల సాధారణ పరిపాలన విభాగాల కార్యదర్శులను కూడా తొలగించింది. గతంలోనూ చర్యలు 2016 అసెంబ్లీ ఎన్నికలతోపాటు 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలోనూ పశ్చిమబెంగాల్ డీజీపీకి ఎన్నికల విధుల నుంచి ఈసీ తొలగించడం గమనార్హం. తాత్కాలికంగా డీజీపీ రాజీవ్ కుమార్‌కు ఎన్నికలతో సంబంధం లేని బాధ్యతలను అప్పగించాలని బెంగాల్ చీఫ్ సెక్రటరీకి ఈసీ సూచించింది. ఆయనకు జూనియర్‌గా ఉన్న మరో అధికారికి డీజీపీ బాధ్యతలివ్వాలని కోరింది. డీజీపీ పోస్టుకు అర్హులైన ముగ్గురు అధికారుల పేర్లను తమకు పంపించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. వీరికి రెండు విధులు గుజరాత్, ఉత్తరప్రదేశ్, బిహార్, జార్ఖండ్, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల హోం శాఖ కార్యదర్శులు సంబంధిత రాష్ట్రాల సీఎం కార్యాలయాల బాధ్యతలను కూడా నిర్వహిస్తున్నారని, దీనివల్ల ఎన్నికల సంబంధ విధుల అమలులో ఎంతో కీలకమైన నిష్పా క్షికత, తటస్థత కొరవడే ప్రమాదముందని ఈసీ పేర్కొంది. ముఖ్యంగా శాంతిభద్రతలు, బలగాల మోహరింపుపై ఇది ప్రభావం చూపొచ్చని అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలోనే వీరిని విధుల నుంచి తప్పించాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. బీఎం కమిషనర్ తొలగింపు ఎన్నికల సమయంలో మూడేళ్లు ఒకే చోట బాధ్యతలు నిర్వహిస్తున్న వారిని, సొంత జిల్లాల్లో విధుల్లో ఉన్న వారిని ఎన్నికల సంబంధ విధుల నుంచి బదిలీ చేయడం ఆనవాయితీ. అయితే, మహారాష్ట్ర ప్రభుత్వం తమ సూచనలను పాటించకపోవడంపై ఈసీ అసంతృప్తిగా ఉంది. దీంతో, బృహన్ముంబై మున్సిపల్ కమిషనర్ ఇక్బాల్ సింగ్ చహల్తోపాటు అదనపు కమిషనర్లు, ఉప కమిషనర్లను విధుల నుంచి తప్పించాలని ఆదేశాలిచ్చింది. ఇతర కార్పొరేషన్ల మున్సిపల్ కమిషనర్లు, అదనపు, ఉప కమిషనర్లను కూడా బదిలీ చేయాలని కోరింది.
Pagination
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కాంగ్రెస్‌కు శామ్ పిట్రోడా రాజీనామా
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
ఫ్రెండ్ కోసం పెళ్లినే వాయిదా వేసుకున్న హీరోయిన్ (ఫోటోలు)
ఓట్ల తాయిలాలు షురూ.. బీజేపీపై దీదీ ఫైర్
IPL 2024: సన్‌రైజర్స్, లక్నో మ్యాచ్.. లంక యువ స్పిన్నర్ అరంగేట్రం
ఒక్క క్లిక్‌తో ‘ఏపీ పాలిసెట్’ ఫలితాలు
సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్.. ఫారెన్ వీధుల్లో కేతిక!
IPL 2024 SRH VS LSG: మరో మూడేస్తే..!
ఐసీఎంఆర్ విడుదల చేసిన ఆహార మార్గదర్శకాలు ఇవే..
వైట్‌హౌస్‌కు ఏఐ టెక్నాలజీని పరిచయం చేసిన భారత సంతతి ఇంజనీర్! ఎవరీమె?
తప్పక చదవండి
- ఓట్ల తాయిలాలు షురూ.. బీజేపీపై దీదీ ఫైర్
- ఒక్క క్లిక్‌తో ‘ఏపీ పాలిసెట్’ ఫలితాలు
- సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్.. ఫారెన్ వీధుల్లో కేతిక!
- పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
- జ్యుడీషియల్ కస్టడీకి రేవణ్ణ
- పవన్ మూవీ రిలీజ్ డేట్‌కి టెండర్ వేసిన 'దేవర'?
- ఓటీటీలోకి వచ్చేస్తున్న మరో వివాదాస్పద మూవీ
- టీ20 వరల్డ్‌కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్‌గా కేఎల్ రాహుల్..!
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- బాబోస్తే ఆరోగ్యశ్రీ గో..వింద
Advertisement