ఓటర్ల జాబితా తారుమారు...అర్థరాత్రి వరకు పోలింగ్
పశ్చిమగోదావరి జిల్లా జీలుగుమిల్లి మండలం దర్భగూడెంలో పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. ఈనేపథ్యంలో ఆ గ్రామంలో రాత్రి 11 గంటల వరకు పోలింగ్ జరిగేందుకు ఎన్నికల అధికారులు అనుమతి ఇచ్చారు. గ్రామంలోని ఓటర్ల జాబితా తారుమారైంది. దాంతో స్థానిక ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలింగ్ బూత్‌కు తాళాలు వేసి ఆందోళనకు దిగారు.
దాంతో ఎన్నికల సిబ్బంది ఉన్నతాధికారులను ఫిర్యాదు చేశారు. జిల్లా జాయింట్ కలెక్టర్ దర్భగూడెం గ్రామస్థులతో చర్చించారు. అందులో భాగంగా రాత్రి 11 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తామని జాయింట్ కలెక్టర్ గ్రామస్థులు హామీ ఇచ్చారు. దాంతో గ్రామస్థులు దిగివచ్చారు. ఈ నేపథ్యంలో పోలింగ్ చాలా ఆలస్యంగా ప్రారంభమైంది.