-
200 మీటర్ల బ్రెస్ట్‌స్ట్రోక్‌లో కొత్త ప్రపంచ రికార్డు
టోక్యో: ఒలింపిక్స్ స్విమ్మింగ్‌లో కొత్త ప్రపంచ రికార్డు నమోదైంది. మహిళల 200 మీటర్ల బ్రెస్ట్‌స్ట్రోక్ ఈవెంట్లో దక్షిణాఫ్రికా స్విమ్మర్ తాత్యానా షున్మేకర్ ఈ ఘనత సాధించింది. శుక్రవారం జరిగిన ఫైనల్ రేసును 24 ఏళ్ల తాత్యానా 2ని:18.95 సెకన్లలో పూర్తి చేసి స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. ఈ క్రమంలో 2ని:19.11 సెకన్లతో 2013లో రికీ మోలెర్ పెడర్సన్ (డెన్మార్క్) నెలకొల్పిన ప్రపంచ రికార్డును తాత్యానా బద్దలు కొట్టింది. -
ఇష్వి మథాయ్‌కు స్వర్ణం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అంతర్ జిల్లా స్విమ్మింగ్ చాంపియన్‌షిప్‌లో రంగారెడ్డి జిల్లా స్విమ్మర్ ఇష్వి మథాయ్ ఆకట్టుకుంది. కరీంనగర్లో శనివారం ముగిసిన ఈ పోటీ ల్లో బాలికల 50 మీటర్ల బ్రెస్ట్‌స్ట్రోక్ ఈవెంట్లో ఇష్వి స్వర్ణ పతకాన్ని గెలిచింది. 50 మీటర్ల దూరాన్ని ఇష్వి 0:44.83 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. -
గెలిస్తే కన్నీళ్లు వస్తాయ్
జయహో కనేటో మహిళల 200 మీటర్ల బ్రెస్ట్ స్ట్రోక్‌లో జపాన్ స్మిమ్మర్ కనేటో రీ స్వర్ణం సాధించింది. వివాదాస్పద (రెండుసార్లు డోపింగ్ నిషేధం ఎదుర్కొన్న) రష్యా అథ్లెట్ యులియా ఎఫిమోవా కన్నా 1.67 సెకన్ల ముందు రేసు పూర్తి చేసింది. విజయం తర్వాత ఆనందాన్ని తట్టుకోలేక ఈమె ఉద్వేగానికి గురైంది. అయితే విజయం ఆనందాన్నిచ్చినా.. మరింత ఉత్తమ టైమింగ్ నమోదు చేయనందుకు బాధగా ఉందని కనేటో తెలిపింది. చైనాకు చెందిన షీజింగ్ లిన్ మూడో స్థానంతో కాంస్యాన్ని అందుకుంది. 16 ఏళ్లకే స్వర్ణం అమెరికా స్విమ్మర్.. పదహారేళ్ల సిమోన్ మాన్యుయెల్ మహిళల 100 మీటర్ల ఫ్రీస్టయిల్లో బంగారు పతకం గెలుపొందింది. ఈ విజయంతో ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలిచిన తొలి ఆఫ్రో-అమెరికన్‌గా రికార్డులకెక్కింది. చిన్నవయసులో ప్రపంచ అత్యుత్తమ క్రీడా వేదికపై అవార్డు అందుకునే అవకాశం రావటంతో సిమోన్ ఆనందం పట్టలేక ఏడ్చేసింది. అయితే ఈ రేసులో సిమోన్‌తో పాటు కెనడా స్విమ్మర్ పెన్నీ ఒలెక్సియాక్ ఒకే సమయంలో (52.70 సెకన్లు) రేసు పూర్తి చేయటంతో ఇద్దరికీ స్వర్ణపతకాన్ని అందించారు. మా లాంగ్.. మహదానందం టీటీలో చైనా హవా కొనసాగుతోంది. ప్రపంచ నెంబర్ వన్ మా లాంగ్ పురుషుల వ్యక్తిగత ఈవెంట్లో చైనాకే చెందిన డిఫెండింగ్ చాంపియన్ ఝాంగ్ జైక్పై 4-0 (14-12, 11-5, 11-4, 11-4) తేడాతో గెలిచి.. టీటీలో ఐదో మేల్ గ్రాండ్‌స్లామ్ (ప్రపంచ చాంపియన్‌షిప్, ప్రపంచ కప్, ఒలింపిక్ గోల్డ్) విజేతగా నిలిచాడు. లాంగ్‌కు ఇదే తొలి ఒలింపిక్ స్వర్ణం. ఇది రియోలో చైనాకు 11వ బంగారు పతకం. లండన్ ఒలింపిక్స్ క్వాలిఫయింగ్‌లోనే ఇంటిబాట పట్టిన లాంగ్.. ఈసారి ఏకంగా డిఫెండింగ్ చాంపియన్‌ను ఓడించాడు. సిమోనా మజాకా! అమెరికా జిమ్నాస్టిక్ సంచలనం సిమోన్ బైల్స్ రియోలో మరో స్వర్ణాన్ని గెలుచుకుంది. మహిళల వ్యక్తిగత ఆల్‌రౌండ్ టైటిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. మూడుసార్లు ప్రపంచ చాంపియన్ అయిన బైల్స్ రియోలో 62.198 పాయింట్లతో మొదటి స్థానంలో నిలిచింది. ఓ ప్రపంచ చాంపియన్.. ఒలింపిక్స్ గోల్డ్ గెలవటం 1996 తర్వాత ఇదే తొలిసారి కావటం విశేషం. టీమ్ ఆల్‌రౌండ్ ఈవెంట్లోనూ అమెరికా స్వర్ణం గెలవటంలో సిమోన్ బైల్స్ పాత్ర కీలకం. వారెవా.. అలెగ్జాండ్రియా లండన్ ఒలింపిక్స్‌లో వ్యక్తిగత ఆల్‌రౌండ్ ఈవెంట్లో టైబ్రేక్‌తో తృటిలో పోడియం అవకాశాన్ని కోల్పోయిన అమెరికా జిమ్నాస్ట్ అలెగ్జాండ్రియా రైజ్మాన్... ఈసారి ఎలాంటి పొరపాట్లు చేయకుండా రజతాన్ని అందుకుంది. అప్పటి పతకం మిస్సైన బాధేంటో ఆమెకు తెలుసు. అందుకే రజతం అందుకోగానే కన్నీటితో ఆనందాన్ని వ్యక్తపరిచింది. రష్యన్ జిమ్నాస్ట్ ముస్తాఫినా ఆలియా.. మూడో స్థానంలో నిలిచింది. 2012లో ముస్తాఫినా కారణంగానే.. అలెగ్జాండ్రియా పతకం మిస్సైంది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రాహుల్ తెలంగాణ మహిళలకు క్షమాపణలు చెప్పాలి: హరీశ్‌రావు
కేకేఆర్‌తో లక్నో పోరు.. తుది జట్లు ఇవే! స్టార్ బౌలర్ దూరం
జడేజా ఆల్‌రౌండ్ షో.. పంజాబ్‌ను చిత్తు చేసిన సీఎస్కే
సీను సీతారైంది సాంబడా
సందడిగా వస్త్ర దుకాణం ప్రారంభోత్సవం (ఫొటోలు)
మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
ఆ పూలు స్టార్స్‌లా అందంగా ఉన్నా..వాసన మాత్రం భరించలేం!
IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
ఉద్యోగం వెతుక్కునే క్రమంలో ఇలా చెయ్యొద్దు!: గూగుల్ ఉద్యోగి
తప్పక చదవండి
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్‌కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్‌తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement