అల్కరాజ్కు ఊహించని షాక్.. సెమీస్ చేరకుండానే అవుట్
ప్రతిష్టాత్మక టెన్నిస్ టోర్నమెంట్ యూఎస్ ఓపెన్-2026లో సంచలనం నమోదైంది. పురుషుల సింగిల్స్ విభాగంలో డిఫెండింగ్ చాంపియన్ కార్లోస్ అల్కరాజ్కు ఊహించని షాక్ తగిలింది. అమెరికా స్టార్ బెన్ షెల్టన్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో అల్కరాజ్ అనూహ్య రీతిలో ఓటమిపాలయ్యాడు. ఎనిమిదో సీడ్ అయిన బెన్ షెల్టన్.. వరల్డ్ నంబర్ 2 అల్కరాజ్ను 7-6(5), 1-6, 3-6, 6-1, 7-6(7) తేడాతో ఓడించాడు. Ben's moment 😤 pic.twitter.com/qnojmzvmqr— US Open Tennis (@usopen) September 9, 2026గాయం నుంచి కోలుకునిమణికట్టు గాయం కారణంగా దాదాపు నాలుగు నెలల పాటు ఆటకు దూరమైన స్పెయిన్ స్టార్ అల్కరాజ్.. యూఎస్ ఓపెనర్ సందర్భంగా రీఎంట్రీ ఇచ్చాడు. ప్రికార్టర్ ఫైనల్లో అమెరికా స్టార్ టామీ పాల్‌పై 6-4, 6-3, 6-4 తేడాతో గెలిచాడు. ఈ విజయం కోసం అల్కరాజ్ పెద్దగా కష్టపడాల్సిన అవసరం రాలేదు.ఈ క్రమంలో సులువుగానే క్వార్టన్ ఫైనల్‌కు చేరుకున్న అల్కరాజ్.. సెమీస్‌లో చోటు కోసం ఎనిమిదో సీడ్ బెన్ షెల్టన్‌తో తలపడ్డాడు. న్యూయార్క్‌లోని ఆర్థర్ ఆషే స్టేడియంలో తాజాగా జరిగిన ఈ మ్యాచ్‌లో అల్కరాజ్- బెన్ హోరాహోరీ తలపడ్డారు. నాలుగు గంటల 28 నిమిషాల పాటు సుదీర్ఘంగా సాగిన మ్యాచ్‌లో ఆఖరికి బెన్ పైచేయి సాధించగా.. గాయం తాలుకు బాధతో ఇబ్బందిపడినట్లు కనిపించిన అల్కరాజ్ నాకౌట్ అయ్యాడు. Five sets of amazing.What a show, Ben Shelton and Carlos Alcaraz 👏 pic.twitter.com/n6Dyp2oeiT— US Open Tennis (@usopen) September 9, 2026