బార్‌కోడ్‌తో గదుల కేటాయింపు
సాక్షి, తిరుమల: శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు ఇకపై తిరుమలలో గుర్తింపు కార్డు బార్కోడ్ ఆధారంగానే టీటీడీ గదులు కేటాయించనుంది. ప్రస్తుతం భక్తులకు ప్రభుత్వ గుర్తింపు కార్డు ఆధారంగా గదులు కేటాయిస్తున్నారు. ఫొటోమెట్రిక్ పద్ధతిలో కంప్యూటర్ ద్వారా ఫొటో తీసుకుని, వేలిముద్ర వేసి, పేరు, ఊరు, ఫోన్ నంబర్ తెలిపి గది పొందేవారు.
ఇదే విధానంలో టీటీడీ మార్పులు చేసింది. ప్రస్తుతం ఆధార్, రేషన్, పాస్‌పోర్టు, డ్రైవింగ్ లైసెన్సు వంటి కార్డుల్లో ఉండే బార్కోడ్ ఆధారంగా గదులు కేటాయించే పద్ధతిని సోమవారం ప్రారంభించింది. భక్తులు గుర్తింపు కార్డు చూపిస్తే.. దానిపై ఉండే బార్‌కోడ్‌ను సిబ్బంది స్కాన్ చేస్తే భక్తుడి పూర్తి వివరాలు కంప్యూటర్లోకి చేరతాయి. దీంతో వేలిముద్ర తీసుకునే పని ఉండదు.