breaking news
Ambani Residence
-
అంబానీ ఇంటికి పాప్ స్టార్ రిహన్నా..
ప్రముఖ అంతర్జాతీయ పాప్ సింగర్ రిహన్నా భారత పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ ఇంటికి వచ్చారు. తన బృందంతో కలిసి అంబానీ కుటుంబాన్ని వారి నివాసంలో కలిశారు. అత్యంత సన్నిహితుల మధ్య జరిగిన మధ్యాహ్న విందులో ఆమె పాల్గొన్నారు.ఇషా అంబానీ, శ్లోకా మెహతా, రాధికా మర్చంట్, అనంత్ అంబానీ దంపతులు స్వయంగా రిహన్నాకు సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రిహన్నాకు భారతీయ నృత్య రీతులు, సంప్రదాయ కళలు, మన సంస్కృతికి సంబంధించిన విశేషాలను అంబానీ కుటుంబ సభ్యులు వివరించారు. ఈ విందులో రిహానా భారతీయ ఆతిథ్యాన్ని ఆస్వాదించడమే కాకుండా, ఇక్కడి సంప్రదాయాల పట్ల తన ఆసక్తిని కనబరిచారు.రిలయన్స్ రిటైల్ భాగస్వామ్యంతో రిహానా తన సొంత బ్యూటీ బ్రాండ్ 'ఫెంటీ బ్యూటీ'(Fenty Beauty) ప్రమోషన్ కోసమే ఆమె భారత్కు వచ్చారు. ఈ ఉత్పత్తులు ప్రస్తుతం భారతదేశంలో కేవలం తీరా (Tira) సెఫోరా (Sephora) స్టోర్లలో మాత్రమే ప్రత్యేకంగా అందుబాటులో ఉండనున్నాయి. View this post on Instagram A post shared by Bollywood Bubble Television (@bollywoodbubbletelly) -
అంబానీ నివాసంలో తళుక్కుమన్న పతక విజేతలు.. వాళ్లిద్దరు హైలైట్(ఫొటోలు)


