breaking news
academy player
-
చరిత్ర సృష్టించిన 11 ఏళ్ల చందన్!
-
చరిత్ర సృష్టించిన చందన్!
పేదరికం, ఆర్థిక కష్టాలు.. అమ్మ రెక్కలు ముక్కలు చేసుకుంటేగానీ కుటుంబం గడువదు. ఇన్నీ కష్టాల నడుమ 11 ఏళ్ల చందన్ నాయక్ ప్రతిభ చాటాడు. చిన్న వయస్సులోనే ఫుట్‌బాల్ ఆటలో తానేంటో నిరూపించుకున్నాడు. అతని ప్రతిభను మెచ్చి ఏకంగా జర్మనీ నుంచి అవకాశం ఎగురుకుంటూ వచ్చింది. జర్మనీలోని బేయర్న్ మ్యూనిక్‌లో అకాడెమీ ఆటగాడికి శిక్షణ తీసుకొనేందుకు చందన్ ఎంపికయ్యాడు. అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీకి కూడా గతంలో ఇదే తరహాలో అవకాశం లభించిందని, ఇప్పుడు చందన్ కూడా ఇలా అవకాశం దక్కించుకొని చరిత్ర సృష్టించాడని కోచ్ తెలిపారు. ఒడిశాలోని భువనేశ్వర్‌కు చెందిన చందన్ ది నిరుపేద కుటుంబం. తల్లి రెక్కల కష్టం మీదనే కుటుంబం నడుస్తుంది. ఇలాంటి గడ్డు పరిస్థితుల్లోనూ తనకు ఈ గొప్ప అవకాశం దక్కడంపై చందన్ ఆనందం వ్యక్తం చేశాడు. ఏనాటికైనా ఫుట్‌బాల్ ఆటగాడికి దేశానికి ప్రాతినిధ్యం వహించాలన్నదే తన ఆకాంక్ష అని చందన్ తెలిపాడు.