వాట్సాప్‌లో మరో రెండు బంఫర్ ఫీచర్స్ | Sakshi
Sakshi News home page

వాట్సాప్‌లో మరో రెండు బంఫర్ ఫీచర్స్

Published Sat, Jun 25 2016 3:59 PM

వాట్సాప్‌లో మరో రెండు బంఫర్ ఫీచర్స్

ఫేస్‌బుక్‌ యాజమాన్యంలోని ఇన్‌స్టంట్ మెసెజింగ్ వేదిక వాట్సాప్ నిత్యం సరికొత్త ఫీచర్లతో యూజర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా తాజాగా మ్యూజిక్ షేరింగ్, లార్జర్ ఎమొజిస్ ఫీచర్లను అందుబాటులోకి తెస్తున్నది.

ఇప్పటికే వాట్సాప్‌లో ఫైల్ షేరింగ్ అవకాశం కల్పించిన సంగతి తెలిసిందే. ఈ ఫీచర్ వల్ల మైక్రోసాఫ్ట్ డాక్యుమెంట్స్, పీడీఎఫ్ ఫైల్స్ వంటివి పంపుకొనే వీలు కలిగింది. ఇదే క్రమంలో మొదట ఐవోఎస్‌ యాప్స్ లో మరో రెండు ఫీచర్లను వాట్సాప్ అందుబాటులోకి తీసుకొస్తున్నది. ఈ ఫీచర్లతో యూజర్లు ఇకపై తమ ఫోన్‌లో ఉన్న పాటలను కావాల్సిన వారితో షేర్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇప్పుడు స్మైల్, శాడ్ వంటి చిన్న చిన్న బొమ్మలను (ఎమోజీస్)ను త్వరలో కావాలంటే పెద్దవిగా పంపుకొనేందుకు వీలు కల్పిస్తున్నదని జర్మనీకి చెందిన మేసర్ కొఫ్ వెబ్‌సైట్ వెల్లడించింది.

ఈ ఫీచర్లు అందుబాటులోకి వస్తే యాపిల్ ఐఫోన్ యూజర్లు తమ ఫోన్‌లోని పాటలను లేదా యాపిల్ మ్యూజిక్ స్టోర్ లోని సాంగ్స్ లింకులను మిత్రులతో షేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆడియో ఫైల్స్ షేర్ చేసుకొనే అవకాశమున్నా.. వాటిని వాట్సాప్ లోనే ప్లే చేసుకొనే అవకాశం ఐఫోన్ లో అందుబాటులో లేదు. అలాగే యాపిల్ ఇటీవల తన ఐవోఎస్ యూజర్ల కోసం పెద్దసైజు ఎమోజీలను అందుబాటులోకి తెచ్చింది. వీటిని వాట్సాప్‌లో కూడా ప్రవేశపెట్టేందుకు తాజా ఫీచర్‌తో లైన్ క్లియర్ అయింది.    
 

Advertisement
Advertisement