జీ 7పై ట్రంప్‌ నీడ! | Sakshi
Sakshi News home page

జీ 7పై ట్రంప్‌ నీడ!

Published Sat, May 27 2017 4:04 AM

జీ 7పై ట్రంప్‌ నీడ! - Sakshi

టావోర్మినా: జీ 7 వార్షిక సమావేశాలు శుక్రవారం ఇటలీలో ప్రారంభమయ్యాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఈ సదస్సుకు హాజరవడం ఇదే తొలిసారి. తన దుందు డుకు విధానాలతో ప్రపంచాన్ని కలవర పెడుతున్న ట్రంప్‌ సెగ ఈసారి సదస్సును తాకేలా ఉంది. ‘అమె రికా ఫస్ట్‌’ అంటూ అధికారంలోకి వచ్చిన ట్రంప్‌... వలసలు, వాణిజ్య విధానాల్లో రక్షణాత్మకం గా వ్యవహరిస్తుండటం, పారిస్‌ పర్యావరణ ఒప్పందానికి కట్టుబడి ఉండమని ప్రకటించడం ఈసారి సదస్సులో ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశాలున్నాయి.

ఈసారి నిర్వహిస్తున్న సదస్సు సవాలుతో కూడుకున్నదని యూరోపియన్‌ యూనియన్‌ అధ్యక్షుడు డొనాల్డ్‌ టస్క్‌ అభిప్రాయపడ్డారు. ఇటలీలో టావోర్మినాలోని సిసిలీలో రెండ్రో జులు జరిగే జీ7 సదస్సులో వాణి జ్యం, పర్యావరణ సంబంధ అంశాలే ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశాలున్నట్లు యూఎస్‌ సీని యర్‌ అధికారుల వ్యాఖ్యానించా రు. పారిస్‌ వాతావరణ ఒప్పందం పై ట్రంప్‌ ప్రకటన వల్ల జరిగే నష్టాన్ని కనిష్టం చేయడానికి యూఎస్‌ అధికారులు తెరవెనక కష్టపడుతున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement