మంత్రిగారికి పోలీసు పాదసేవ! | police seen binding minister shoe lace in west bengal | Sakshi
Sakshi News home page

మంత్రిగారికి పోలీసు పాదసేవ!

May 25 2015 6:02 PM | Updated on Sep 3 2017 2:40 AM

మంత్రిగారికి పోలీసు పాదసేవ!

మంత్రిగారికి పోలీసు పాదసేవ!

పోలీసులను మంత్రులు తమ సేవకులుగా ఉపయోగించుకుంటున్నారు. ఇలాంటి వైనం ఒకటి పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో తాజాగా చోటుచేసుకుంది.

పోలీసులను మంత్రులు తమ సేవకులుగా ఉపయోగించుకుంటున్నారు. ఇలాంటి వైనం ఒకటి పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో తాజాగా చోటుచేసుకుంది. ఓ బహిరంగ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఒకరు.. తన బూటు లేసులను ఓ పోలీసు కానిస్టేబుల్తో కట్టించుకున్న వ్యవహారం బట్టబయలైంది. మమతాబెనర్జీ ప్రభుత్వంలో ప్రణాళిక, అభివృద్ధి శాఖల మంత్రిగా పనిచేస్తున్న రచ్పాల్ సింగ్ తన వ్యక్తిగత భద్రతకు నియమించిన గార్డుతో బూటు లేసులు కట్టించుకుంటూ కెమెరాకు దొరికేశారు.

ముందుగా ఓ విగ్రహానికి దండ వేసేందుకు బూట్లు విప్పిన మంత్రి.. ఆ తర్వాత వాటిని కట్టుకోడానికి ప్రయత్నిస్తుండగా వెంటనే గార్డు ఆయన వద్దకు వచ్చారు. మంత్రి ఆయనను ఏమాత్రం ఆపకపోగా.. ఎంచక్కా తన కాళ్లిచ్చి, లేసులు కట్టించుకున్నారు. రచ్పాల్ సింగ్ గతంలో ఐపీఎస్ అధికారిగా కూడా పనిచేశారు. ఈ అంశం వెలుగులోకి రావడంతో విపక్షాలు ఒక్కసారిగా మమత సర్కారుపై మండిపడ్డాయి.

Advertisement
 
Advertisement
Advertisement