రెండు రాష్ట్రాల్లో అధ్యక్షుల్ని మార్చిన బీజేపీ | Sakshi
Sakshi News home page

రెండు రాష్ట్రాల్లో అధ్యక్షుల్ని మార్చిన బీజేపీ

Published Wed, Nov 30 2016 2:32 PM

రెండు రాష్ట్రాల్లో అధ్యక్షుల్ని మార్చిన బీజేపీ - Sakshi

న్యూఢిల్లీ: రెండు రాష్ట్రాలకు నూతన అధ్యక్షులను నియమిస్తూ భారతీయ జనతాపార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. ఢిల్లీ యూనిట్‌కు మనోజ్‌ తివారీని, బిహార్‌ రాష్ట్రానికి నిత్యానంద్‌ రాయ్‌ని అధ్యక్షులుగా నియమించారు. ఈ ఇద్దరూ ప్రస్తుతం లోక్‌సభ సభ్యులుగా కొనసాగుతున్నారు.
 
2014 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు, 2015 బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘోర పరాజయం చవిచూసినప్పటి ఢిల్లీ బీజేపీ చీఫ్‌ సతీశ్‌ ఉపాథ్యాయ, బిహార్‌ బీజేపీ చీఫ్‌ మంగళ్‌పాండేలను తొలగించాలని పెద్ద ఎత్తున డిమాండ్లు వెల్లువెత్తాయి. అయితే సుదీర్ఘకాలం వేచిచూసిన తర్వాత మాత్రమే బీజేపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. మనోజ్‌ తివారి ఈశాన్య ఢిల్లీ స్థానం నుంచి, నిత్యానంద రాయ్‌ బిహార్‌లోని ఉజయ్‌పూర్‌ నియోజకవర్గం నుంచి లోక్‌లభకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. వీరి నియామకం తక్షణమే అమలులోకి వస్తుందని అమిత్‌షా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement