విప్రో కూడా...50శాతం వారికేనట | In Q1, More Than 50% Employees To Be Locals In US: Wipro | Sakshi
Sakshi News home page

విప్రో కూడా .. 50శాతం వారికేనట

Apr 26 2017 11:43 AM | Updated on Sep 5 2017 9:46 AM

విప్రో కూడా...50శాతం వారికేనట

విప్రో కూడా...50శాతం వారికేనట

బెంగళూరు ఆధారిత ఐటీ సేవల సంస్థ విప్రో కూడా అమెరికా నియామకాలపై దృష్టిపెట్టనున్నట్టు ప్రకటించింది.

బెంగళూరు ఆధారిత  ఐటీ సేవల సంస్థ విప్రో కూడా అమెరికా నియామకాలపై దృష్టిపెట్టనున్నట్టు ప్రకటించింది. అమెరికా కొత్త హెచ్ 1 బీ వీసాల  కఠిన నిబంధనల నేపథ్యంలో  టీసీఎస్‌, ఇన్ఫోసిస్ బాటలో పయనిస్తోంది. తాము అమెరికాలో స్థానికంగా ఉద్యోగులను నియమించుకోనున్నట్టు  విప్రో వెల్లడించింది. జూన్ నాటికి (మొదటి త్రైమాసికం)  అమెరికా మార్కెట్లో సగం కన్నా ఎక్కువ  ఉద్యోగాలు స్థానికులకేనని విప్రో స్పష్టం  చేసింది.   తమ ఖాతాదారులకు వ్యాపార కొనసాగింపును నిర్ధారిస్తూ స్థానికులను నియమించుకోవడంతో పాటు  రెండు డెలివరీ కేంద్రాలను ఏర్పరుచుకుంది.
వీసా నిబంధనల కట్టడి  నేపథ్యంలో  అమెరికా మార్కెట్లో పెట్టుబడులు చాలా ముఖ్యమైనవని విప్రో భావిస్తోంది.  క్యూ1 లో 50శాతం ఉద్యోగాల్లోస్థానికులకే ప్రాధాన్యత ఇవ్వనున్నట్టు విప్రో తెలిపింది.  అన్ని కీలక మార్కెట్లలో  లోకల్‌ ఫోకస్‌  కొనసాగుతుందనీ, అయితే , తమ అతిపెద్ద మార్కెట్‌గా భావిస్తున్న అమెరికాల క్యూ1 లొ 50 శాతం కంటే ఎక్కువ మంది ఉద్యోగులను నియమించుకోవాలని భావిస్తున్నామని  విప్రో సిఇఓ అబిదిలి జెడ్‌  నీముచ్వాలా  మీడియాకు  చెప్పారు.  అమెరికాలో గణనీయంగా పెట్టుబడులుతోపాటు స్థానికు  నియామకాలు,  డెలివరీ కేంద్రాలు, నిలకడ కార్యక్రమాలు, ప్రత్యేకించి ఎడ్యుకేషన్‌  రంగలో పెట్టుబడులు పెట్టనున్నట్టు  తెలిపారు. ఈ మేరకు మిచిగాన్‌ , కాలిఫోర్నియాలలో కొత్త కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు చెప్పారు.  కాలిఫోర్నియా సెంటర్  నెక్స్ట్‌ జనరేషన్‌ టెక్నాలజీ  హబ్‌గా ఉంటుందని, మిచిగాన్లో కేంద్రం  ఆటోమోటివ్ కస్టమర్లకు  ఇంజనీరింగ్ సేవలను తన అందిస్తుంది  నీమచ్వాల వెల్లడించారు.

కాగా 2016-17 సంత్సరానికిగాను విప్రో  7.7 బిలియన్‌ డాలర్ల ఆదాయంలో 54 శాతానికిపైగా అమెరికాదే .

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement