సీఎం సీటుపై ఆసక్తి లేదు: గడ్కరీ | Gadkari says 'no' to Maharashtra move | Sakshi
Sakshi News home page

సీఎం సీటుపై ఆసక్తి లేదు: గడ్కరీ

Oct 23 2014 12:10 PM | Updated on Oct 8 2018 5:45 PM

సీఎం సీటుపై ఆసక్తి లేదు: గడ్కరీ - Sakshi

సీఎం సీటుపై ఆసక్తి లేదు: గడ్కరీ

మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవి రేసులో తాను లేనని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మరోసారి స్పష్టం చేశారు.

న్యూఢిల్లీ: మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవి రేసులో తాను లేనని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మరోసారి స్పష్టం చేశారు. తనకు రాష్ట్ర రాజకీయాలపై ఆసక్తిలేదని పునరుద్ఘాటించారు. 'మహారాష్ట్ర సీఎం రేసులో లేనని ఇప్పటికే స్పష్టం చేశాను. నేను ఢిల్లీలోనే ఉండాలనుకుంటున్నాను' అని గడ్కరీ వ్యాఖ్యానించారు.

మహారాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యేలు కొందరు గడ్కరీ సీఎం కావాలని కోరుకుంటున్నట్టు మీడియా వార్తలు వచ్చి నేపథ్యంలో ఆయన వివరణయిచ్చారు. మహారాష్ట్ర మాజీ మంత్రి సుధీర్ మునగంటివార్ సహా పలువురు ఎమ్మెల్యేలు గడ్కరీ పేరు తెరపైకి తెచ్చారు. బీజేపీ అధిష్ఠానం మాత్రం దేవేంద్ర ఫడ్నావిస్ వైపు మొగ్గుచూపుతున్నట్టు తెలుస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement