ప్రత్యేక హోదా సాధించాలి.. లేకపోతే...? | cpi rama krishna fires on seemandhra mps | Sakshi
Sakshi News home page

ప్రత్యేక హోదా సాధించాలి.. లేకపోతే...?

Jul 15 2015 12:26 PM | Updated on Aug 13 2018 4:30 PM

ప్రత్యేక హోదా సాధించాలి.. లేకపోతే...? - Sakshi

ప్రత్యేక హోదా సాధించాలి.. లేకపోతే...?

వచ్చే పార్లమెంటు సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించాలని.. లేకపోతే సీమాంధ్ర ఎంపీలకు హిజ్రాలతో స్వాగతం చెబుతామని సీపీఐ ఏపీ కార్యదర్శి కె.రామకృష్ణ హెచ్చరించారు.

అనంతపురం: వచ్చే పార్లమెంటు సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించాలని.. లేకపోతే సీమాంధ్ర ఎంపీలకు హిజ్రాలతో స్వాగతం చెబుతామని సీపీఐ ఏపీ కార్యదర్శి కె.రామకృష్ణ హెచ్చరించారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. గోదావరి పుష్కరాల తొక్కిసలాటకు చంద్రబాబే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.

లక్షల మందిని ఆహ్వానించిన ప్రభుత్వం ఎందుకు మౌలిక సదుపాయాలు కల్పించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ 27 మంది మృతికి కారణమైన తొక్కిసలాట ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని సూచించారు. ఒక్కో మృతుడి కుటుంబానికి రూ.20 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement