అన్నం తిని అనారోగ్యానికి గురైన ఆవు మృతి | Cow dies to having of food with illness | Sakshi
Sakshi News home page

అన్నం తిని అనారోగ్యానికి గురైన ఆవు మృతి

Aug 12 2015 7:56 PM | Updated on Mar 28 2018 11:08 AM

అన్నం తిని అనారోగ్యానికి గురైన ఓ ఆవు బుధవారం మృతి చెందింది.

రంగారెడ్డి(శంషాబాద్): అన్నం తిని అనారోగ్యానికి గురైన ఓ ఆవు బుధవారం మృతి చెందింది. వివరాలు..మండలంలోని ఘాంసిమియాగూడకు చెందిన రవీందర్ ఆవును పోషించుకుంటున్నాడు. రెండు రోజుల కిందట గ్రామంలో బోనాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడ అమ్మవారికి నైవేధ్యంగా సమర్చించిన అన్నంను సమీపంలో ఓ కుప్పగా పోశారు.

మంగళవారం అటుగా వెళ్లిన ఆవు ఆ అన్నం తినింది. అన్నం తిన్న ఆవు అనారోగ్యానికి గురై బుధవారం మృతి చెందింది. ఆవు మృతితో తనకు ఉపాధి లేకుండా పోయిందని, నష్టపరిహారం ఇప్పించాలని బాధితుడు కోరుతున్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement