గురువాయూరు శ్రీకృష్ణ దేవాలయం పేల్చేస్తాం | Bomb threat to Kerala's Sri Krishna temple, security tightened | Sakshi
Sakshi News home page

గురువాయూరు శ్రీకృష్ణ దేవాలయం పేల్చేస్తాం

Jul 21 2015 6:30 PM | Updated on Sep 3 2017 5:54 AM

గురువాయూరు శ్రీకృష్ణ దేవాలయం పేల్చేస్తాం

గురువాయూరు శ్రీకృష్ణ దేవాలయం పేల్చేస్తాం

కేరళ గురువాయూరులోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీకృష్ణ దేవాలయం.

గురువాయూరు: కేరళ గురువాయూరులోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీకృష్ణ దేవాలయం. ఈ దేవాలయాన్ని 24 గంటలలో పేల్చివేస్తామని ఆగంతకులు మంగళవారం ఫోన్ చేసి దేవాలయ సిబ్బందిని బెదిరించారు. దాంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. దేవాలయంతోపాటు పరిసర ప్రాంతాలను బాంబు స్క్వాడ్తో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నట్లు పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు.

అలాగే ఆలయంతోపాటు పరిసర ప్రాంతాలు భద్రతను మరింత కట్టుదిట్టం చేసినట్లు తెలిపారు. ఫోన్ కాల్పై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామన్నారు. బెదిరింపు ఫోన్ కాల్ ఖతార్ నుంచి వచ్చినట్లు గుర్తించామని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా వాసికెక్కిన గురువాయూరు శ్రీకృష్ణ దేవాలయాన్ని నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటారన్న విషయం విదితమే.   

Advertisement
 
Advertisement
Advertisement