'మావోయిస్టు కావడం నేరం కాదు' | being maoist is not a crime, observes kerala high court | Sakshi
Sakshi News home page

'మావోయిస్టు కావడం నేరం కాదు'

May 22 2015 7:20 PM | Updated on Oct 9 2018 2:47 PM

'మావోయిస్టు కావడం నేరం కాదు' - Sakshi

'మావోయిస్టు కావడం నేరం కాదు'

కేవలం మావోయిస్టు కావడం ఏమాత్రం నేరం కాదని కేరళ హైకోర్టు భావించింది. ఓ కేసులో తీర్పు ఇచ్చే సమయంలో న్యాయమూర్తి ఈ వ్యాఖ్య చేశారు.

కేవలం మావోయిస్టు కావడం ఏమాత్రం నేరం కాదని కేరళ హైకోర్టు భావించింది. ఓ కేసులో తీర్పు ఇచ్చే సమయంలో న్యాయమూర్తి ఈ వ్యాఖ్య చేశారు. దేశంలో ఉన్న చట్టాలను ఉల్లంఘించినప్పుడు మాత్రమే అవి చట్టవ్యతిరేక కార్యకలాపాలు అవుతాయని కోర్టు రూలింగ్ ఇచ్చింది. కేవలం మావోయిస్టు అయినంత మాత్రాన ఏ ఒక్క వ్యక్తినీ రిమాండుకు లేదా కస్టడీకి పంపడానికి వీల్లేదని జస్టిస్ ఎ. ముస్తాఖ్ తెలిపారు.

శ్యాం బాలకృష్ణన్ అనే వ్యక్తిని మావోయిస్టుగా అనుమానించి అతడిని అదుపులోకి తీసుకున్న కేసు విచారణ అనంతరం తీర్పు ఇచ్చే సమయంలో ఆయనీ విషయాలు చెప్పారు. ఈ కేసులో శ్యాం బాలకృష్ణన్కు లక్ష రూపాయలకు పైగా పరిహారం ఇవ్వాలని కూడా కోర్టు ఆదేశించింది. ఇలాంటి కేసుల్లో ఇంతకుముందు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను కూడా కేరళ హైకోర్టు పరిగణనలోకి తీసుకుంది.

Advertisement
 
Advertisement
Advertisement