సోలోమన్ దీవుల్లో భూకంపం | 7.0 quake hits off Solomon Islands: USGS | Sakshi
Sakshi News home page

సోలోమన్ దీవుల్లో భూకంపం

Jul 18 2015 10:32 AM | Updated on Sep 3 2017 5:45 AM

సోలోమన్ దీవుల్లో భూకంపం

సోలోమన్ దీవుల్లో భూకంపం

సోలోమన్‌ దీవుల్లో శనివారం భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్ పై 7.0 గా నమోదయిందని యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది.

సిడ్నీ : సోలోమన్‌ దీవుల్లో శనివారం భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్ పై 7.0 గా నమోదయిందని యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. సోలోమన్ రాజధాని హోనియారాకు 583 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు తెలిపింది. అయితే భూకంప తీవ్రత 7.5 ఉంటే సునామీ వచ్చే సూచనలున్నాయని దీనిపై సమీక్ష నిర్వహించిన జియోసైన్స్ ఆస్ట్రేలియా వెల్లడించింది. 

2013లో సోలోమన్ దీవుల్లో 8.0 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ సందర్భంగా  సంభవించిన సునామీలో 10 మంది మృతి చెందగా...వేలాది మంది నిరాశ్రయులైన సంగతి తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement