జార్ఖండ్ నుంచి 4 వేల మెగావాట్ల విద్యుత్ | 4 thousand MW in Jharkhand | Sakshi
Sakshi News home page

జార్ఖండ్ నుంచి 4 వేల మెగావాట్ల విద్యుత్

Aug 18 2015 1:04 AM | Updated on Sep 18 2018 8:38 PM

రాష్ట్రంలో విద్యుత్ కొరతను అధిగమించేందుకు జార్ఖండ్ నుంచి 4 వేల మెగావాట్ల విద్యుత్ తీసుకోవాలని కేంద్ర విద్యుత్

తీసుకోవాలని రాష్ట్రానికి కేంద్రం సూచన
 
హైదరాబాద్: రాష్ట్రంలో విద్యుత్ కొరతను అధిగమించేందుకు జార్ఖండ్ నుంచి 4 వేల మెగావాట్ల విద్యుత్ తీసుకోవాలని కేంద్ర విద్యుత్ సంస్థ (సీఈఏ) రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. 2018-19 నాటికి రాష్ట్రాల వారీగా విద్యుత్ అవసరాలు, లభ్యతపై అధ్యయన నివేదికను ఇటీవల కేంద్ర విద్యుత్ శాఖ వెలువరించింది. 13వ పంచవర్ష ప్రణాళిక(2018-19) ప్రారంభానికి రాష్ర్టంలో 13,197 మెగావాట్లకు విద్యుత్ డిమాండ్ పెరగనుండగా, 17156 మెగావాట్ల సామర్థ్యం కలిగి ఉండనుంది.

3,008 మెగావాట్ల విద్యుత్‌లోటును పూడ్చుకునేందుకు జార్ఖండ్ దియోఘడ్ జిల్లా హుస్సైనాబాద్‌లో నిర్మిస్తున్న 4 వేల మెగావాట్ల దియోఘడ్ ఆల్ట్రామెగా పవర్‌ప్లాంట్ నుంచి విద్యుత్‌ను సేకరించుకోవాలని రాష్ట్రాన్ని సీఈఏ కోరింది.  జార్ఖండ్ నుంచి విద్యుత్ లైన్లు లేవు. ఛత్తీస్‌గఢ్ నుంచి 2 వేల మెగావాట్ల విద్యుత్ కొనుగోళ్లకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకుంది. ఉత్తర-దక్షిణ గ్రిడ్‌ల అనుసంధాన లైన్ల నిర్మాణం పూర్తయితే చత్తీస్‌గఢ్ నుంచి విద్యుత్ తీసుకురాగలుగుతామని అధికారులు పేర్కొంటున్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement