మొరాయించిన తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌ | Two hours delay on telangana Superfast Express | Sakshi
Sakshi News home page

మొరాయించిన తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌

Dec 26 2019 5:58 AM | Updated on Dec 26 2019 5:58 AM

Two hours delay on telangana Superfast Express - Sakshi

కాజీపేట రూరల్‌: హైదరాబాద్‌ నుంచి కొత్త ఢిల్లీ వెళ్లాల్సిన తెలంగాణ సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు బుధవారం మార్గమధ్యలో పలు ప్రాంతాల్లో మొరాయించింది. బుధవారం ఉదయం బయలు దేరిన తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌ భువనగిరి రైల్వే స్టేషన్‌కు చేరుకున్నాక బ్రేక్‌ బోల్డు స్టార్‌ రిలీజింగ్‌ పైపు విరగగా అక్కడ 20 నిమిషాల పాటు ఆపి తాత్కాలిక మరమ్మతు చేసి, కాజీపేట పంపించారు. కాజీపేటలో మెకానిక్‌ సిబ్బంది కూడా 10 నిమిషాల పాటు శ్రమించి మరమ్మతు పూర్తి చేశారు. ఇక రామగుండం వెళ్లే సరికి మళ్లీ ఆగిపోయింది. దీంతో కాజీపేట నుంచి మెకానిక్‌ సిబ్బంది కొత్త బోల్డు స్టార్‌ పైప్‌ తీసుకెళ్లారు. అక్కడి సిబ్బందితో కలసి గంట పాటు శ్రమించి బోల్డు స్టార్‌ను తొలగించి కొత్తది అమర్చారు. ఇలా సాంకేతిక సమస్య కారణంగా తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌ రెండు గంటల పాటు ఆలస్యంగా వెళ్లినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement