నేడు పీజీఈసెట్‌ తొలి జాబితా విడుదల | TS PGECET first list release shortly | Sakshi
Sakshi News home page

నేడు పీజీఈసెట్‌ తొలి జాబితా విడుదల

Aug 16 2017 2:22 AM | Updated on Sep 12 2017 12:09 AM

ఇంజనీరింగ్‌ కళాశాలల్లో వివిధ పీజీ కోర్సుల్లో సీట్లు సాధించిన విద్యార్థుల తొలి జాబితాను 16న విడుదల చేయనున్నట్లు పీజీఈసెట్‌– 2017 కోకన్వీనర్‌ ప్రొఫెసర్‌ రమేశ్‌బాబు తెలిపారు.

హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా ఇంజనీరింగ్‌ కళాశాలల్లో వివిధ పీజీ కోర్సుల్లో సీట్లు సాధించిన విద్యార్థుల తొలి జాబితాను బుధవారం(16న) ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నట్లు పీజీఈసెట్‌– 2017 కోకన్వీనర్‌ ప్రొఫెసర్‌ రమేశ్‌బాబు మంగళవారం తెలిపారు. పీజీఈసెట్‌ మొదటి విడత కౌన్సెలింగ్‌లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ పూర్తి చేసుకుని, కళాశాలల ఎంపికకు ఆప్షన్లు ఇచ్చుకున్న విద్యార్థులు తమ పేర్లను http:// www. osmania. ac. in/ వెబ్‌సైట్‌లో చూడవచ్చన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement